రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులకు రంగం సిద్ధం
హైదరాబాద్: తెలంగాణ నూతన పారిశ్రామిక చట్టం టీఎస్ ఐపాస్ కింద మరో విడత మరికొన్ని పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా 14 కంపెనీలకు అనుమతి పత్రాలు అందించారు. రూ.1118 కోట్ల పెట్టుబడులకు అనుమతులు పొందిన కంపెనీల అధినేతలు సంసిద్ధత వ్యక్తం చేశారు.