!['పెదబాబైనా, చినబాబైనా చర్చకు రెడీ' - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/51436522052_625x300.jpg.webp?itok=rcKfHEbf)
'పెదబాబైనా, చినబాబైనా చర్చకు రెడీ'
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారిందని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. చంద్రబాబు హయంలో నీటిపారుదల రంగం కుంటుపడిందని విమర్శించారు.
పాలమూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని టీడీపీకి జూపల్లి సవాల్ విసిరారు. శనివారం ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వస్తామని, చంద్రబాబయినా లేక చినబాబుతో అయినా చర్చకు సిద్ధమని ప్రకటించారు. పాలమూరు ఎత్తిపోతల పథకంపై టీటీడీపీ నేతల వైఖరి స్పష్టం చేయాలని జూపల్లి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి ప్రజల నిరసన తీసుకెళ్లేందుకే పాలమూరు బంద్కు పిలుపునిచ్చినట్టు జూపల్లి చెప్పారు.