'అన్ని జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన టీఎస్ ఐపాస్ విధానం అమలులోనూ అంతే వేగంతో ముందుకు వెళుతున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. రెండు వారాల్లోపే 17 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని పెద్దపెద్ద కంపెనీలన్నీ ఆసక్తి చూపుతున్నాయన్నారు.
తన అమెరికా పర్యటనలోనూ పలు కంపెనీలు తెలంగాణ వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయన్నారు. పరిశ్రమల్లో ఉపాధి పొందగోరే యువకుల కోసం పది జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఓటుకు కోట్లు కేసుపై స్పందిస్తూ దొరికిన దొంగ తప్పించుకునే ప్రయత్నాలు.. తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధిని ఏ విధంగానూ ప్రభావం చూపవన్నారు.