ఖమ్మం: హిమాచల్‌ప్రదేశ్ ఘటనపై ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన విద్యార్థులు కిరణ్‌కుమార్, ఉపేందర్ కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు. గాలింపు చర్యలపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్ లో బియాస్ నదిలో ఆదివారం సాయంత్రం విజ్ఞానజ్యోతి కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారు.
హిమాచల్‌ప్రదేశ్ ఘటనలో వనస్థలిపురంకు చెందిన అరవింద్ గల్లంతయ్యాడు. అతని కోసం కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కరీంనగర్ జిల్లా మండలం రేకుర్తికి చెందిన దాసరి శ్రీనిధి కుటుంబ సభ్యులు కూడా ఆమె ఆచూకీ కోసం ఎదురు చూస్తున్నారు.
గాలింపు చర్యలపై కేంద్రంతో సంప్రదింపులు
Published Mon, Jun 9 2014 9:47 AM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM
Advertisement
Advertisement