Himachal Pradesh Incident
-
వారే బతికుంటే ఇప్పుడేం చేస్తూ ఉండేవారో!
హైదరాబాద్: అందరిలో ఉల్లాసం.. ప్రకృతిలో సీతాకోకచిలుకల్లా కేరింతలు.. రాళ్లు రప్పలూ.. చెట్టూ పుట్టా అన్నింటిని ముద్దాడే ఆశ.. తనివి తీరా స్పర్షించాలన్న కోరిక.. ప్రతి కొత్త చోటును కెమెరాతో తమ వద్దకు చేర్చుకునే ప్రయత్నం.. తొలుత నిర్మలంగా నిశ్చింతగా, ప్రశాంతంగా ఉన్న ఆ నది పారే మార్గంలో స్నేహితులంతా కలిసి కోలాహలంగా గంతులు వేస్తూ కెమెరాలతో వీలయినన్ని ఫొటోలతో బిజీగా ఉండగా..మొదట చినుకై ఆ తర్వాత వరదై మరికాసేపట్లో ఉప్పెనైనట్లుగా ఒక్కసారిగా గంగమ్మ ఉగ్రరూపం దాల్చింది. ముందు సెలయేరుగా మారి వారి పాదాలను ముద్దాడింది.. ఆ వెంటనే వేగం పెంచి మరో రూపాన్ని సంతరించుకుంది. దీంతో భయపడినవారంతా పారిపోయేందుకు ప్రయత్నించినా అందరినీ అమాంతం హత్తుకుని తనలో కలిపేసుకుంది. వారి కుటుంబాల్లో విషాధం నింపింది. ఘటన తీరు చూసిన అందరి కళ్లలో వరదల్లే నీరు నింపింది. ఇది సరిగ్గా ఏడాది కిందట హైదరాబాద్ శివార్లలోని వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజి నుంచి సరదాగా టూర్‌కు వెళ్లిన విద్యార్థుల విషణ్ణ వదనాల చరిత. హిమాచల్‌ప్రదేశ్‌లో బియాస్ నది వద్ద సంభవించిన ప్రమాదంలో దాదాపు 24 మంది మరణించగా కొందరే ప్రాణాలతో బయటపడ్డారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండానే పండో డ్యామ్ తలుపులు తెరవడంతో ఆ వరద నీటికి వారంతా కొట్టుకుపోయి ప్రాణాలు విడిచారు. కాస్త అప్రమత్తంగా ఉన్నా.. అనుభవజ్ఞులు పక్కన ఉన్న వారు బతికి బయటపడేవారేమో. నది ప్రవహించే మార్గంలోని రాళ్ల గుట్టలు ఎక్కి ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధిస్తూ జోకులు వేసుకుంటూ, నవ్వుకుంటూ ఉన్నారే తప్ప వారి ప్రాణాలు పోతాయన్న విషయం గమనించలేదు. కాళ్ల కిందకు నీళ్లు వస్తుండగా ఒడ్డున ఉన్న స్థానికులు అప్రమత్తం చేసే ప్రయత్నం చేసి బయటకు రమ్మంటూ చేతులు ఊపినా.. వాళ్లు హాయ్ చెబుతున్నారని అనుకొని వీరు కూడా చేతులు ఊపారు తప్ప.. అపాయాన్ని ఏమాత్రం గుర్తించలేకపోయారు. క్షణాల్లో వీరంతా రాళ్ల నుంచి నీళ్లలో పడి కొట్టుకుపోయారు. కనీసం నెల రోజులపాటు వీరి మృతదేహాల కోసం గాలింపులు జరిగాయి. ఈ ఘటనలో కళాశాల, అక్కడి డ్యామ్ అధికారుల నిర్లక్ష్యం వెరసి 24 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇకముందైనా కళాశాలలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోగలిగితే అటు తల్లిదండ్రులకు, వారి పిల్లలకు బంగారు భవితకు భరోసా ఇచ్చినట్లవుతుంది. ఏదేమైనా.. ఉజ్వల భవిష్యత్ ఉండి అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోయిన ఆ 24 మంది విద్యార్థులు బతికుంటే ఇప్పుడేం చేస్తూ ఉండేవారో. -
బియాస్ దుర్ఘటన నేపథ్యంలో...
న్యూఢిల్లీ: బియాస్ నదిలో 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతైన దుర్ఘటన నేపథ్యంలో విద్యార్థుల విజ్ఞాన యాత్రలకు మార్గదర్శకాలు రూపొందించాలని యూజీసీ, ఏఐసీటీఈలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. విద్యార్థుల భద్రతే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలు ఉండాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభకు తెలిపారు. బియాస్ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే స్పందించానని ఆమె చెప్పారు. సహాయక చర్యలు చేపట్టాలని హిమచల్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా తమ మంత్రులను సంఘటనా స్థలానికి పంపాయని చెప్పారు. బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాలకు చెందిన 24 మంది జూన్ 8న హిమచల్‌ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైయ్యారు. వీరిలో ముగ్గురు మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు. -
రిథిమాకు కన్నీటి వీడ్కోలు
బంగారుపాళెం: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో కొట్టుకుపోయి ఆశువులుబాసిన ఇంజినీరింగ్ విద్యార్థిని రిథిమా పాపానికి శుక్రవారం కన్నీటి వీడ్కోలు పలికారు. హైదరాబాద్‌లోని విజ్ఞాన జ్యోతి కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న రిథిమా పాపాని తోటి విద్యార్థులతో కలిసి విజ్ఞాన యాత్రకు వెళ్లి, 8వ తేదీన హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. బుధవారం ఆమె మృతదేహాన్ని అధికారులు కనుగొన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరింది. అక్కడి నుంచి ఆమె స్వగ్రామమైన చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలం పాపానివారిపల్లెకు తీసుకొచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
రిధిమా.. వెళ్లిపోయావమ్మా !
మోతీనగర్: హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నదీ ప్రవాహంలో గల్లంతైన రిధిమా మృతదేహం లభించిందని అధికారులు సమాచారమివ్వడంతో మోతీనగర్ బీఎస్పీకాలనీలో ఆమె నివాసం వద్ద తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈనెల 8న దుర్ఘటన జరిగిన నాటి నుంచి రిధిమా తల్లిదండ్రులు శ్రీనివాస్, రాధాదేవిలు తల్లడిల్లుతూ కూతురు కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు తమకూతురు క్షేమంగా తిరిగి వస్తుందని కళ్లల్లో ఒత్తులువేసుకొని అన్నపానీయాలు ముట్టకుండా ఎదురుచూసిన తల్లిదండ్రులకు చివరకు మృతదేహం వస్తుందని తెలియడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. ‘చిన్నప్పటినుంచి అల్లారుముద్దుగా పెంచుకున్నాం. ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదని’ ఆవేదన వ్యక్తం చేశారు. రిధిమా మృతదేహం లభించిందని తెలియడంతో ఆమె స్నేహితులు, బంధువులు ఇంటికి తరలివస్తున్నారు. ఈనెల 8న బియాస్ నదిలో దుర్ఘటన జరగ్గా...ఇప్పటివరకు 18 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా ఏడు మృతదేహాలు దొరకాల్సి ఉంది. మృతదేహం గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అనంతరం అక్కడినుంచి చిత్తూరు జిల్లాకు తరలించనున్నట్లు రిధిమా కుటుంబసభ్యులు తెలిపారు. -
హిమాచల్‌లో గడ్డకట్టిన అవినీతి!
సందర్భం ప్రొఫెసర్,మాడభూషి శ్రీధర్ బియాస్ ప్రమాద ఘటన నిర్లక్ష్యంతో జరిగిన దారుణమా లేక ఇంకేదైనా ప్రమాదకర నేపథ్యం ఉందా? అనేది లోతైన దర్యాప్తు జరిపితే తప్ప తెలియదు. అంతర్గత దర్యాప్తు జరిపి అన్ని లాంఛనాలు పాటించాకే నీటిని వదిలారనీ, ఇందులో ఇంజనీర్ల తప్పేమీ లేదంటూ ఒక నివేదికను హడావుడిగా నీటిని విడుదల చేసినట్టే విడుదల చేయడం ఇంకా దారుణం. కేదార్నాథ్ విషాద ఘటన జరిగిన దాదాపు ఏడాది తరువాత హిమాలయాలలో మళ్లీ మృత్యువు తాండవమాడింది. హైదరాబాద్‌కు చెందిన 24 మంది విద్యార్థులను, ఒక టూర్ ఆపరేటర్‌ను బలి తీసుకుంది. ఇది విధి వైపరీత్యం కాదు. విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం. నేరస్థాయి దాటిన ఘోర దుర్మార్గం. హిమాచల్‌ప్రదేశ్ కులు ప్రాంతపు మండీ జిల్లాలో బియాస్ నదిపైన ఆనకట్ట దాని పక్కనే 126 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసే లార్జీ జలవిద్యుత్ కేంద్రం ఉంది. భావి ఇంజనీర్లను బలిపెట్టిన వారు ఎవరంటే నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్యామ్ ఇంజనీర్లు. జూన్ 8 తెల్లవారుజామున ఒంటిగంట నుంచి సాయంత్రం 7.30 నిమిషాల వరకు మొత్తం 29 సార్లు విడివిడిగా 2,820 క్యూమెక్‌ల నీరును వదిలారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు 1,950 క్యూమెక్‌ల నీటిని వదిలారు. ఆ తరువాత మళ్లీ 7 గంటలకు 450 క్యూమెక్‌ల నీటిని విడుదల చేశారు. ఈ ప్రవాహమే డ్యామ్ నుంచి 15 కిలోమీటర్ల దూరాన్ని శరవేగంగా దాటి దాదాపు పది నిమిషాల్లో తాలోట్ గ్రామాన్ని చేరి 25 మంది ప్రాణం తీసింది. అసలు అంత నీటిని ఆ సమయంలో ఎందుకు వదిలారు? ఎవరు వదిలారు? ఇది కేవలం నిర్లక్ష్యంతో జరిగిన దారుణమా లేక ఇంకేదైనా ప్రమాదకర నేపథ్యం ఉందా? అనేది లోతైన దర్యాప్తు జరిపితే తప్ప తెలియదు. ఒక అంతర్గత దర్యాప్తు జరిపి అన్ని లాంఛనాలు పాటించిన తరువాతనే నీటిని వదిలారనీ, జలవిద్యుత్ విభాగ ఇంజనీర్ల తప్పేమీ లేదంటూ ఒక నివేదికను హడావుడిగా నీటిని విడుదల చేసినట్టే విడుదల చేయడం ఇంకా దారుణం. జవాబు లేని ప్రశ్నలు అంత భారీగా నీటిని ఆ సమయంలో ఎందుకు వదలాల్సి వచ్చిందనేది ఆ సందర్భానికి అడగవలసిన ఒక ప్రశ్న. అయితే ఈ ప్రమాదానికి ప్రత్యక్షంగా సంబంధం లేని పరోక్షమైన ప్రశ్నలు మరికొన్ని ఉన్నాయి. నీళ్లు సరిగ్గా ప్రవహించని నదికి దగ్గరగా రోడ్డు ఎందుకు నిర్మించారు? అంతగా రాకపోకలకు ఉపయోగపడని ప్రాంతంలో ఈ రోడ్డు వల్ల ఎవరికి ప్రయోజనం? జలవిద్యుత్ ఉత్పాదనకు నీరు నిలువ చేసుకుంటారు. సాధారణంగా వరదలు ఎక్కువగా వచ్చి జలాశయం నిండిపోయి ఆనకట్ట తెగిపోయే ప్రమాదం ఉందనుకుంటే నీరు వదులుతారు. కాని జలవిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకునేలా కావాలని భారీ ఎత్తున నీటిని వదిలారు. ఇది దారుణమైన నేపథ్యం. ఒకవేళ వదలడం తప్పనిసరి అయితే రాత్రి వేళల్లో మాత్రమే నీరు వదులుతారు. ఎప్పుడు వదిలినా నదివెంట డ్యాం ఇంజనీర్లు, సిబ్బంది తిరుగుతూ నీటిప్రవాహం పెరుగుతుందని నదిలోకి వెళ్లవద్దని పౌరులను హెచ్చరించాలి. చుట్టుతా హెచ్చరికలు రాసిన బోర్డులు అడుగడుగునా ఏర్పాటు చేయాలి. ఇవేవీ చేయకుండా నీళ్లు వదిలి జనాన్ని చంపేట్టయితే అక్కడ ఇంజనీర్లెందుకు? నదుల మీద ఆనకట్టలెందుకు? చదువులు పనికి రానివా? లేక చదువుకున్న ఈ ఇంజనీర్లు పనికి రాని పనిచేశారా? సామర్థ్యస్థాయిలో కోత ఎందుకు? 126 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల లార్జీ ప్లాంట్ తన సామర్థ్యస్థాయిని మరీ 36 మెగావాట్లకు ఎందుకు తగ్గించుకోవలసి వచ్చింది? అందువల్ల ఇంత నీటిని విడుదల చేయవలసి వస్తుందని, అది వృథాచేయడమేనని తెలియదా? లేదా అందుకే నీటిని వదిలారా? ఒకవేళ విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం తగ్గించుకునేంత ఎక్కువ ప్రవాహం ఉంటే కొన్ని ప్రైవేటు విద్యుత్ పవర్ ప్లాంట్లు తమ సామర్థ్యాన్ని మించి 10 నుంచి 15 శాతం ఎక్కువ విద్యుత్‌ను ఎందుకు ఉత్పత్తి చేసుకోనిచ్చారు? వారెందుకు జలాలను వాడుకోవాలి? ప్రభుత్వ విద్యుత్కేంద్రం జలాన్ని ఎందుకు వదలాలి. జనాన్ని ఎందుకు చంపాలి? కర్చమ్ వాంగ్టూ విద్యుత్ కేంద్రం 100 మెగావాట్లు, ఎన్జేపీసీ 1500 మెగావాట్లు, అలెయిస్ డుహాంగన్ కేంద్రం 192 మెగావాట్లను మించి జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునేందుకు అనుమతించారు. కేవలం ప్రభుత్వరంగ లార్జీ డ్యామ్ వద్ద విద్యుత్ కేంద్రానికి మాత్రం 126 మెగావాట్ల సామర్థ్యం ఉన్నా భారీ ఎత్తున ఉత్పత్తి 36 మెగావాట్లకు తగ్గించడం జరిగింది. అందువల్లనే భారీ ఎత్తున నీటిని డ్యాం నుంచి నదిలోకి వదలవలసి వచ్చింది. ఇదంతా ఎవరి ప్రయోజనం కోసం? నదులలో ప్రవాహం విపరీతంగా పెరిగితే, విద్యుచ్ఛక్తి వినియోగం డిమాండ్ లేకపోతే, అన్ని ప్రాజెక్టులూ సమానంగా సామర్థ్యం తగ్గించుకుని ఒక నిష్పత్తి ప్రకారం నీటిని విడుదల చేయడానికి శాస్త్రీయమైన పద్ధతులు అనుసరించడం న్యాయం. కాని దానికి భిన్నంగా జరుగుతోంది. ఇసుక మాఫియా పాత్ర నదులను దోచుకునే ఇసుక మాఫియా కూడా ఈ ప్రమాదం వెనుక ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇసుకను తవ్వుకుని అమ్ముకునే వారికి అనుకూలంగా ఉండడం కోసం, వారికి అవసరమైన ఇసుక నిల్వలను నదీ పరీవాహక ప్రాంతంలో మేటలు వేసేలా రాత్రి వేళల్లో కాకుండా పగటివేళ నీటిని వదులుతున్నారని, అందువల్ల జలాశయంలో ఇసుక నదిలోకి చేరి కాంట్రాక్లర్లకు ఎక్కువ నిల్వలు దొరుకుతాయని, చీకటి పడకుండానే లారీలలో ఇసుక నింపుకుని ప్రయాణం చేయడానికే ఈ పని చేస్తున్నారని వార్తలొచ్చాయి. నదుల వెంట రోడ్లు అవసరం లేకపోయినా అవి ఏ గ్రామాలనూ కలపకపోయినా మాఫియా లారీలు తిరగడానికే రోడ్డును నిర్మించారనే ఆరోపణలూ ఉన్నాయి. అనుమానాస్పద దర్యాప్తు జూన్ 17 నాటికే ఒక దర్యాప్తు తూతూ మంత్రంగా ముగించి లార్జీ డ్యాం ఇంజనీర్లు ఏ తప్పూ చేయలేదని ఒక నివేదికను విడుదల చేయించుకున్నారు. ఈ తొందరపాటు దర్యాప్తు చర్య మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ దర్యాప్తు నివేదికలో ప్రభుత్వం ఇంజనీర్లకు క్లీన్చిట్ ఇచ్చి కాపాడేందుకు చేసే ప్రయత్నాలను హిమాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం శాంతాకుమార్ తీవ్రంగా తప్పు పట్టారు. ఇది విషాదం కాదనీ, ఇంజనీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యార్థుల ప్రాణాలు తీశారని ఆయన ఘాటుగా విమర్శించారు. హెచ్చరికలు చేయకుండా, వేళా పాళా లేకుండా నీటిని విడుదల చేయడం నేరపూరిత నిర్లక్ష్యం కాక మరొకటి అయ్యే అవకాశమే లేదు. కేవలం మౌఖిక ఆదేశాల ద్వారా నీటిని విడుదల చేయించారని తాత్కాలిక నివేదిక వివరిస్తున్నది. ఇది కాకుండా దీని వెనుక మరిన్ని ఘోరాలు ఉన్నాయి. ఈ నివేదికలో ప్రైవేటు పవర్ ప్లాంట్లను ఎక్కువ సామర్థ్యంతో పనిచేయనిచ్చి, కేవలం లార్జీ డ్యాం దగ్గరి విద్యుత్ కేంద్రం సామర్థ్యాన్ని 90 మెగావాట్లు తగ్గించి 26కే పరిమితం చేయడం వెనుక ఏ కుట్రలు ఉన్నాయనే ప్రశ్నలకు సమాధానం లేదు. దీనికి సమాధానం లభిస్తే ఇంజనీర్లు నిర్లక్ష్య నేరస్తులే కాదు, ఘోరమైన హంతకులనీ తేల్చాల్సి వస్తుంది. అప్పుడు నిర్లక్ష్యం ద్వారా ప్రాణాలు తీసారనే నేరానికి (సెక్షన్ 304ఎ) రెండేళ్ల జైలు శిక్ష వీరికి ఏమాత్రం సరిపోదు. కొందరికి లాభం చేకూర్చడం కోసం ప్రభుత్వానికి నష్టం చేసిన నేరంతో పాటు ఆ అవినీతి ద్వారా 25 మంది ప్రాణాలు తీసిన ఈ హంతకులను ఎంత కఠినంగా శిక్షిస్తారో అందుకు ఏంచేయాలో ప్రభువులు, ప్రతిపక్షం, పత్రికలు జనం నిగ్గదీయాలి. ఒక్కొక్క ప్రాణ హరణానికి కారణాలయిన ఈ జలవిద్యుత్ కేంద్రం ఇంజనీర్లను శిక్షించడమే కాకుండా, ఆ పవర్ ప్లాంట్ కంపెనీ లేదా ప్రభుత్వం అసువులు కోల్పోయిన వారి కుటుంబాలకు భారీ నష్టపరిహారం చెల్లించాలి. ఇసుక మాఫియా పాత్ర రుజువైతే వారికి సహకరించిన గూడుపుఠాణీ అధికారులను కూడా కఠినంగా శిక్షించాలి. (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) -
మరో మూడు మృతదేహాలు లభ్యం
సాక్షి, హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో మరో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. బుధవారం రాత్రి శివప్రకాశ్ వర్మ, గురువారం మధ్యాహ్నం ఆశిష్‌మంథా, అఖిల్‌ల మృతదేహాలు దొరికాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం 12 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 12మంది మృతదేహాల కోసం గాలింపు ముమ్మరం చేశారు. శివప్రకాశ్ వర్మది కూకట్పల్లి, ఆశిష్ మంథా సికింద్రాబాద్, అఖిల్ దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన వాసులుగా గుర్తించారు. వీరి మృతదేహాలు శుక్రవారం ఉదయం విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంటాయని అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న రవాణామంత్రి మహేందర్‌రెడ్డి, అదనపు డీజీ రాజీవ్ త్రివేదిలు ‘సాక్షి’కి తెలిపారు. -
'నీళ్లు విడిచిన రోజు సైరన్ పని చేయలేదు'
న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ బియాస్ నది ఘటనకు కళాశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. విద్యార్థులతో అనుభవం లేని సిబ్బందిని విహార యాత్రకు పంపంటం వల్లే విద్యార్థులు నదిలోకి దిగారన్నారు. సంఘటన జరిగిన రోజు లార్జి డ్యామ్ గేట్లు ఎత్తిన సమయంలో సైరన్ పని చేయలేదని మహేందర్ రెడ్డి తెలిపారు. సైరన్ పనిచేసి ఉంటే విద్యార్థులు అప్రమత్తంగా ఉండేవారన్నారు. 11వ రోజు కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన బుధవారమిక్కడ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు స్వస్థలాలకు వెళ్లారని, ఉత్తరాఖండ్ బాధితుల మాదిరిగా వారికి డెత్ సర్టిఫికెట్లు ఇవ్వటం జరిగిందన్నారు. విద్యార్థులు గల్లంతై పదకొండు రోజులు గడిచినా ఇంకా 17మంది ఆచూకీ దొరకలేదు. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు చేసేదేమీ లేక దుఖంతో వెనుదిరిగారు. మరోవైపు ఎన్డీఆర్ఎస్ సిబ్బందితో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి మహేందర్ రెడ్డి, లవ్ అగర్వాల్, కార్తికేయ శర్మ తదితరులు హిమాచల్ ప్రదేశ్‌లో విద్యార్థుల గాలింపు చర్యలను పర్యవేక్షించారు. -
'ఏపీ నేతలు టూర్‌కి వచ్చినట్టుగా వచ్చారు'
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ లో బియాస్ నదిలో విద్యార్థులు గల్లంతైన దుర్ఘటనపై సాయంత్రం సీఎం కేసీఆర్‌కు నివేదిక సమర్పించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. గాలింపు చర్యలు మరో పది రోజులు కొనసాగుతాయని చెప్పారు. విద్యార్థుల విషయంలో ఆంధ్ర, తెలంగాణ అనేది చూడలేదన్నారు. ఘటనలో కాలేజీ యాజమాన్య నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తోందన్నారు. స్టూడెంట్స్‌తో పాటు సీనియర్ ఫ్యాకల్టీలు, లోకల్ గైడ్ లేరని తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాస్తారని చెప్పారు. స్టడీ టూర్స్‌పై త్వరలోనే ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేస్తుందన్నారు. బియాస్ విషాదంపై ఏపీ ప్రభుత్వం స్పందించిన తీరుపై నాయిని ఆక్షేపించారు. ఏపీ నేతలు ఏదో టూర్‌కి వచ్చినట్టుగా వచ్చి వెళ్లిపోయారని అన్నారు. -
'వాటంతటవే పైకి తేలితేనే దొరుకుతాయి'
మండి: హిమాచల్ ప్రదేశ్ ఘటనకు బాధ్యులైన వారిని వదలబోమని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి అన్నారు. మండి కలెక్టర్ నివేదిక అందిన వెంటనే కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థుల ఫీజును రీయింబర్స్మెంట్ చేసేందుకు కాలేజ్ మేనేజ్ మెంట్ ఒప్పుకుందని తెలిపారు. విద్యార్థుల కుటుంబానికి కాలేజీలో సీటు లేదా ఉద్యోగం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందని వెల్లడించారు. గల్లంతైన విద్యార్థుల మృతదేహాల గాలింపుకు సంబంధించి అన్ని మార్గాలు ఉపయోగించామని చెప్పారు. వాటంతటవే పైకి తేలితేనే మృతదేహాలు దొరుకుతాయని అన్నారు. -
నేటి నుంచి ‘సోనార్’ గాలింపు
సాక్షి, హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్ దుర్ఘటనలో బియాస్ నదిలో గల్లంతైన వీఎన్ఆర్ విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆచూకీ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. 16 మంది విద్యార్థులు, ఒక టూర్ ఆపరేటర్ కోసం శనివారం ఏడో రోజు నావికాదళం, ఎన్డీఆర్ఎఫ్ దళాలు, రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రత్యేక ఈత నిపుణులు, మరో 450 మంది పనివారు రోజంతా గాలించినా లాభం లేకపోయింది. ప్రమాద స్థలి నుంచి మూడు కిలోమీటర్ల మేరకు నదిలో నీటిమట్టాన్ని గంట పాటు కనీస స్థాయికి తగ్గించి వెదికినా ఒక్క మృతదేహం కూడా లభించలేదు. దాంతో ఐదు రోజులుగా ఘటనా స్థలి వద్దే పడిగాపులు కాస్తూ, తమ పిల్లల కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల మనోవేదనకు అంతులేకుండా పోయింది. ఆదివారం నుంచి అత్యాధునిక సోనార్ (సైట్ స్కాన్ రాడార్) పరిజ్ఞానాన్ని వినియోగించాలని నిర్ణయించారు. అప్పటికీ ఫలితం లేకపోతే మృతదేహాల కోసం పండో డ్యామ్ గేట్లు ఎత్తేయడం, లేక మరో వారం పది రోజుల్లో వాటంతట అవే పైకి తేలేదాకా ఎదురు చూడటం తప్ప మరో మార్గం ఉండకపోవచ్చంటున్నారు. మరోవైపు ప్రమాదం జరిగిన మండి జిల్లాలోనే కొద్ది రోజులుగా మకాం వేసిన తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి శనివారం స్థానిక ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. విహారయాత్రకు వెళ్లిన 24 మంది విద్యార్థులు, ఒక టూర్ ఆపరేటర్ జూన్ 8న లార్జి డ్యామ్ నుంచి హఠాత్తుగా వచ్చి పడ్డ నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడం తెలిసిందే. గురువారం దాకా 8 మంది విద్యార్థుల మృతదేహాలు లభించాయి. శుక్రవారం మానవరహిత విమానాన్ని రంగంలోకి దించినా లాభం లేకపోయింది. -
నిరీక్షణ
బరువెక్కిన గుండెలతో.. నీళ్లింకిన కళ్లతో ఆశలు గల్లంతు..ఎంతకీ చిక్కని ఆచూకి బాధిత కుటుంబాలు బెంబేలు బిడ్డల కోసం ఎదురుచూపులు సిటీబ్యూరో: నిరీక్షణ.. వేదన.. రోదన.. బియాస్ ఘటనలో బాధిత కుటుంబాలు తెరిపిన పడటంలేదు. గల్లంతైన బిడ్డలు క్షేమంగానే ఉన్నారా?.. ఆచూకీ చిక్కుతుందా? అనేది అంతులేని వేదనకు గురిచేస్తోంది. ప్రమాదం జరిగిన నాలుగు రోజులైనా ఇప్పటికీ తమ వారి జాడ లేకపోవడంతో నిద్రహారాలు లేకుండా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. లార్జీ డ్యామ్ వద్ద విద్యార్థులు నీటి ఉధృతిలో కొట్టుకుపోతున్న దృశ్యాలను అమర్ఉజాలా.కామ్ అనే వెబ్సైట్ బుధవారం విడుదల చేసింది. ఆ వీడియో క్లిప్పింగ్‌లు మీడియాలో ప్రసారం కావడంతో బాధిత కుటుంబాలు మరింతగా తల్లడిల్లాయి. బంధుమిత్రుల హృదయాలు కకావికలమయ్యాయి. విద్యార్థులు నీటి ఉధృతికి కొట్టుకుపోతున్న దృశ్యాలు గుండెల్ని బరువెక్కిం చాయి. ఈ వీడియోలో కొట్టుకుపోతూ కనిపించిన వారు తమ తోటి విద్యార్థులేనని ఈ దుర్ఘటన నుంచి సురక్షితంగా బయటపడిన దివ్య ‘సాక్షి’కి తెలిపింది. గట్టుపైనున్న వారు తమ వీడియో కెమెరాలో ఈ దృశ్యాలను బంధించారన్నారు. అందరూ చూస్తుండగానే నిమిషం వ్యవధిలో ఘోరం జరిగిపోయిందంటూ ఆమె విలపించారు. అప్పుడూ.. ఇప్పుడూ..అదే విషాదం గతేడాది చోటుచేసుకున్న చార్ధామ్ విషాదంలోనూ కొందరి ఆచూకీ తెలియరాలేదు. అప్పట్లో బాధిత బాధిత కుటుంబాల బాధ వర్ణనాతీతం. తాజా సంఘటన కూడా అలాంటి చేదు అనుభవాలను మిగులుస్తుందేమోనని విద్యార్థుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో 24 మంది విద్యార్థులు కొట్టుకుపోగా ఇప్పటివరకు ఆరు మృతదేహాలు మాత్రమే లభించాయి. మిగతా వారి ఆచూకీ లేకుండా పోయింది. వారు బతికే ఉన్నారా?, గాయపడి ఎక్కడైనా ఇరుక్కుపోయారా? అనే వివరాలు తెలియ రావడం లేదు. నదిలో బండ రాళ్లు ఉండడం, నీరు చల్లగా ఉండడంతో అసలు తమ పిల్లలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియక బాధిత కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు. ఏ క్షణాన ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని బెంబేలెత్తిపోతున్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు లార్జీ, మండి డ్యామ్ పరిసరాలను జల్లెడ పడుతున్నా ఫలితం కనిపించకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జాతీయ రిమోట్‌సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ) సహకారంతో విద్యార్థుల ఆచూకీ కనుగొని కన్నవారి శోకాన్ని కొంతమేరైనా తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. నగర వాసులకు జూన్ నెలలో టూర్ల రూపంలో వచ్చిపడుతున్న విపత్తులు సర్వత్రా కలవర పెడుతున్నాయి. ఆశలు తలకిందులేనా..? వరద ప్రవాహంలో కొట్టుకుపోయి నాలుగు రోజులు కావడంతో విద్యార్థులు సజీవంగా ఉన్నారా..? లేదోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. సదరు విద్యార్థులు క్షతగాత్రులై కొండకోనల్లో చిక్కుకున్న పక్షంలో వారికిసరైన చికిత్స, ఆహారం, మంచినీరు అందే పరిస్థితి లేకపోవడంతో వారు బతకడం కష్టమేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. గల్లంతైన విద్యార్థుల ఆచూకీని కనుగొనేందుకు రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హిమాచల్ ప్రదేశ్‌లోనే మకాం వేసి గాలింపు చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. హోంమంత్రితోపాటు బాలానగర్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, పేట్‌బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు, దుండిగల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు గత మూడు రోజులుగా హిమాచల్ ప్రదేశ్‌లోనే ఉన్నారు. తమ వారి ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు. వీరి ఆచూకీ కోసం ఎదురు చూపులు.... వీఎన్ఆర్-వీజేఐటీ కళాశాలకు చెందిన గల్లంతైన విద్యార్థుల్లో ఇప్పటికి ఆరుగురి మృతదేహాలు లభించిన విషయం తెలిసిందే. ఇంకా దాసరి శ్రీనిధి, రిషితారెడ్డి, పాపాని రిధిమ, ఆశిష్మంత, కిరణ్‌కుమార్, అఖిల్, తరుణ్, ఉపేందర్, శివప్రకాశ్‌వర్మ, సాయిరాజ్, బస్వరాజ్ సందీప్, రిత్విక్, జగదీష్, పరమేశ్వర్, అఖిల్ మిట్టపల్లి, విష్ణువర్ధన్‌రెడ్డి, అరవింద్‌కుమార్, కల్లూరి శ్రీహర్ష ఆచూకీ తెలియాల్సి ఉంది. కులు వెళ్తున్నానన్నాడు... మండి నుంచి కులు వెళ్తున్నట్టు చెప్పాడు.. అంతలో నీళ్లలో పడి గల్లంతైనట్టు వార్తలు.. చివరకు బుధవారం మృతదేహమై తేలినట్టు తెలిసి సాబేర్ కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గుల్మొహర్పార్కు కాలనీలో విషాదం అలముకుంది. -
విషాదయాత్ర
-
కన్నా ఎక్కడున్నావురా?
బియాస్ నదిలో జరగిన ప్రమాదంలో రహమత్‌నగర్‌కు చెందిన జగదీశ్ ఉన్నాడు. తమ కొడుకును తలుచుకుంటు తల్లిదండ్రుల కన్నీరు మున్నీరుగా విలపించడం స్థానికంగా ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ‘కన్నా.. ఎక్కడున్నావురా.. ఏమైపోయావురా..కనిపించరా..’ అంటు జగదీష్ తల్లి విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. తల్లిదండ్రులను ఒప్పించి వెళ్లాడు మియాపూర్ హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలోని బ్లోసమ్ అపార్ట్మెంట్లో ఉంటున్న రవివర్మ ఎస్బీహెచ్, జూబ్లీహిల్స్ శాఖ బ్రాంచ్‌మేనేజర్. భార్య సుమతి, ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శివప్రకాశ్ వర్మ విజ్ఞాన్జ్యోతిలో ఈఐఈ ఇంజనీరింగ్ కోర్సు ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులను ఒప్పించి పట్టుబట్టి మరీ 3వ తేదీన విహారయాత్రకు బయలుదేరాడు. ప్రతిరోజు తల్లితో ఫోన్లో మాట్లాడుతుండేవాడు. చివరిసారిగా ఆదివారం ఉదయం తల్లికి ఫోన్ చేశాడు. టూర్ విశేషాలు చెప్పాడు. ఆ తరువాత మళ్లీ ఫోన్ రాలేదు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సోమవారం ఉదయం 6 గంటలకు ఇంటికి తాళంవేసి హిమాచల్‌కు బయలుదేరారు. తల్లడిల్లుతున్న తల్లి హృదయం హిమాచల్‌ప్రదేశ్ ఘటనలో చిలకలగూడ శ్రీనివాసనగర్‌కు చెందిన అశీష్ ముంతా(20) గల్లంతు కావడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తల్లి సత్యవాణి కన్నీటిపర్యంతమైంది. ఏడాది కిందట భర్తను కోల్పోయి విచారంలో ఉన్న ఆమెకు ఈ వార్త అశనిపాతమైంది. కాగా గల్లంతైన ఆశీష్ ప్రమాద సమయంలో ఇద్దరు విద్యార్థినులకు ఒడ్డుకు చేర్చి, తాను ప్రమాదంలో చిక్కుకున్నాడని అతని స్నేహితులు చెబుతున్నారు. ఆచూకీ లేని సాబేర్.. శేరిలింగంపల్లి గుల్మెహర్పార్క్ కాలనీకి చెందిన షేక్ సాబేర్ హుస్సేన్ విషయమై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించగా సాబేర్ సురక్షితంగానే ఉన్నట్లు చెప్పారు. అయినా కాలేజీ వాళ్ల మాటలతో సంతృప్తి చెందక సాబేర్ తల్లిదండ్రులు ఆసియా, షేక్ రజాలు సోమవారం హిమాచల్‌కు బయలుదేరి వెళ్లారు. కానీ బియాస్నది వద్ద జరిగిన విషాదం వివరాలు తమకు ఏమీ తెలియడం లేదని సాబేర్ తల్లిదండ్రులు హిమాచల్‌లోని మండి నుంచి ‘సాక్షి’కి ఫోన్ చేసి చెప్పారు. ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించితేకాని ఆచూకీ దొరకదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ రాకపోవడంతో ఆందోళన చందానగర్‌కు జవహర్ కాలనీ టెల్కర్ట్స్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసముండే వెంకట దుర్గ తరుణ్‌ను ఈ నెల 3వ తేదీ సాయంత్రం 8 గంటలకు స్వయంగా తండ్రి సుబ్బారావు రెలైక్కించారు. రెగ్యులర్‌గా ఫోన్లో మాట్లాడే తరుణ్ చివరిసారిగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు తండ్రికి ఫోన్ చేసి కులూకు వెళుతున్నట్లు చెప్పాడు. అంతే.. ఆ తరువాత ఫోన్ రాలేదు. దాంతో తండ్రి సుబ్బారావు ఆందోళనకు గురై హిమాచల్‌ప్రదేశ్‌కు బయలుదేరి వెళ్లాడు. ఫోన్ స్విచాఫ్.. కడప జిల్లా తెలుగు గంగ ప్రాజెక్టులో ఎస్ఈగా పనిచేస్తున్న సుబ్బారావు, ఆశల కుటుంబం కూడా కూకట్‌పల్లిలోనే ఉంటుంది. వారి కుమారుడు సాయిరాజ్ కూడా ఈ ప్రమాదంలో గల్లంతయ్యాడు. చివరి సారిగా సాయిరాజ్ ఆదివారం మధ్యాహ్నం ఫోన్ చేసి కులుమనాలి సమీపంలోని పర్యాటక స్థలంలో ఉన్నామని చెప్పాడు. టీవిలో వస్తున్న వార్తలు విన్న తల్లిదండ్రులు సాయికి ఫోన్ చేశారు. అప్పటికే అది స్విచాఫ్ అయింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన వారు హుటాహుటిన హిమాచల్ ప్రదేశ్‌కి బయలుదేరారు. కోలుకోలేని విషాదంలో తల్లి వనస్థలిపురంకు చెందిన గోనూరు అరవింద్ గల్లంతయ్యాడన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. అరవింద్ తల్లి శశిలత దుఃఖం వర్ణనాతీతం. శంషాబాద్‌లో ఉండే భర్త వినోద్‌కుమార్‌తో వచ్చిన మనస్పర్ధల కారణంగా కొంతకాలంగా ఆమె తన ముగ్గురు పిల్లలతో వనస్థలిపురం హిల్‌కాలనీలోని తండ్రి సంగప్ప ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో అరవింద్ గల్లంతు కావడం ఆ తల్లిని కోలుకోలేని విషాదంలో ముంచింది. -
చిట్టచివరి నిమిషం వరకు ఆనందంగా..
ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు వరకు అంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగానే ఉన్నారు. వెనక నుంచి నీటి రూపంలో వెంటాడుతూ వస్తున్న మృత్యువును ఎవరూ గుర్తించలేకపోయారు. హిమాచల్‌ప్రదేశ్‌లో బియాస్ నది వద్ద సంభవించిన ప్రమాదంలో దాదాపు 24 మంది మరణించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ శివార్లలోని వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజి నుంచి సరదాగా వెళ్లిన విద్యార్థులు విషణ్ణ వదనాలతో రావాల్సి వచ్చింది. తొలుత పండో డ్యామ్‌కు దాదాపు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యార్థులు.. రాళ్ల మధ్య నుంచి వంపులు తిరుగుతూ వెళ్తున్న నీళ్లను చూసి పరవశించిపోయారు. అడుగు లోతు కూడా లేకపోవడంతో సరదాగా లోపలకు దిగారు. వెళ్లే ముందు కూడా ఎందుకైనా మంచిదని అక్కడున్న స్థానికులను ఓసారి అడిగారు. అదంత ప్రమాదకరమైన ప్రదేశం కాదని, అయితే కాస్త జాగ్రత్తగా మాత్రం ఉండాలని వాళ్లు చెప్పడంతో అందరూ ఉత్సాహంగా లోపలకు వెళ్లారు. చాలాసేపు ఫొటోలు తీసుకున్నారు. వీడియోలు కూడా తీశారు. ఒకరిద్దరైతే వెంటనే వాట్స్ యాప్ లాంటివాటి ద్వారా షేర్ చేశారు. రాళ్ల గుట్టలు ఎక్కి ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధించారు. సరదాగా జోకులు వేసుకున్నారు, నవ్వుకున్నారు. క్షణాల్లోనే కాళ్ల కిందకు నీళ్లు వచ్చేశాయి. ఒడ్డున ఉన్న స్థానికులు వీళ్లను అప్రమత్తం చేసేందుకు బయటకు రమ్మంటూ చేతులు ఊపారు. కానీ, వాళ్లు హాయ్ చెబుతున్నారని అనుకోవడంతో వీళ్లు కూడా చేతులు ఊపారు తప్ప.. అపాయాన్ని ఏమాత్రం గుర్తించలేకపోయారు. పిల్లలు నిలబడిన చిన్నపాటి రాళ్లు కొట్టుకుపోవడంతో బ్యాలెన్స్ కోల్పోయారు. చాలామంది నీళ్లలో కొట్టుకుపోగా.. దాదాపు సగం మంది మాత్రం మిగిలినవారి సాయంతో బయటపడ్డారు. -
మృతుల కుటుంబాలకు లక్షన్నర పరిహారం
హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం లక్షన్నర చొప్పున పరిహారాన్ని ప్రకటించింది. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించింది. బియాస్ నదీ ప్రమాదంలో దాదాపు 24 మంది తెలుగు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 48 మంది విద్యార్థులు, ఫ్యాకల్టీతో కూడిన బృందం కులు మనాలికి విహారయాత్ర కోసం వెళ్లి ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గల్లంతైన వారి ఆచూకీ కోసం దాదాపు 550 మంది పారామిలటరీ బలగాలు అక్కడ ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. -
రిథిమా కోసం తల్లిదండ్రుల నిరీక్షణ
హైదరాబాద్: బియాస్ ఉదంతంలో గల్లంతైన తమ బిడ్డల జాడ కోసం తల్లిదండ్రులు, ఆత్మీయులు రెప్పవేయకుండా ఎదురు చూస్తున్నారు. నగరంలో సర్వత్రా విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థులు గల్లంతైన ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు,తోబుట్టువులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించడం ప్రతి ఒక్కరిని కలచి వేస్తోంది. కోటి ఆశలతో నిరీక్షణ మోతీనగర్ డివిజన్ బాలాజి స్వర్ణపురికాలనీకి చెందిన పి. శ్రీనివాస్, రమాదేవిల ప్రథమ కుమార్తె రిథిమా పాపాని కూడా గల్లంతైంది. తమ కూతురు క్షేమంగా తిరిగివస్తుందని తల్లిదండ్రులు మాత్రం కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. జాడ తెలియని శ్రీహర్ష నల్లకుంట శివం రోడ్డులోని బతుకమ్మకుంటకు చెందిన కల్లూరి శ్రీహర్ష గల్లంతైనట్లు వచ్చిన వార్తలతో అతని తల్లి స్వర్ణలత నిలువునా కుప్పకూలారు. స్పృహ తప్పారు. తండ్రి కేఆర్‌కేవీ.ప్రసాద్ హుటాహుటిన హిమాచల్ బయలుదేరి వెళ్లారు. -
నలుగురిని కాపాడి.. కొట్టుకుపోయాడు!!
ఒకవైపు బియాస్ నదీ జలాలు ఉధృతంగా తరుముకొస్తున్నాయి.. మరోవైపు స్నేహితులు నీటిలో కొట్టుకుపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అయినా ముందు తన ప్రాణాలు పణంగా పెట్టి మరీ నలుగురు స్నేహితుల ప్రాణాలు కాపాడాడు. అతడిపేరు ముప్పిడి కిరణ్ కుమార్. ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ముప్పిడి వెంకటరమణ కుమారుడైన కిరణ్ తన స్నేహితులను కాపాడి, తాను మాత్రం గల్లంతైపోయాడు. ప్రమాదస్థలంలో కిరణ్‌కు సమీపంలో ప్రత్యూష అనే విద్యార్థినితో పాటు మరో విద్యార్థిని ఉన్నారు. వాళ్లిద్దరినీ కాపాడేందుకు కిరణ్ నదీ ప్రవాహంలోనే ఉండిపోయాడు. వారితో పాటు మరో ఇద్దరిని అత్యంత కష్టమ్మీద ఒడ్డుకు చేర్చాడు. తమ బృందానికి నాయకుడిగా ఉన్న అతడు.. తనను తాను మాత్రం కాపాడుకోలేకపోయాడు. ''నీటిమట్టం పెరుగుతున్నట్లు గుర్తించగానే కిరణ్ ప్రమాదాన్ని ఊహించి మమ్మల్ని ఒడ్డువైపు నెట్టేశాడు. మేమంతా ఒడ్డుకు చేరుకుని, కిరణ్ ఎక్కడున్నాడా అని చూశాం. అతడు నీళ్లలోంచి బయటకు రావడానికి కష్టపడుతున్నట్లు మాకు అర్థమైంది. కానీ అతడు ఎలాగైనా వస్తాడన్న ఆశతోనే మేం చాలాసేపు చూశాం. కానీ, కింద ఉన్న రాయి కొట్టుకుపోవడంతో కిరణ్ కూడా నీళ్లలో కొట్టుకుపోయాడు'' అని ప్రత్యూష తెలిపింది. తన కుమారుడికి ఈత బాగా వచ్చని, అతడు ఎలాగోలా ఎక్కడో ఒక చోట సురక్షిత ప్రాంతానికి చేరుకునే ఉంటాడని కిరణ్ తండ్రి వెంకటరమణ అన్నారు. ఆయనతో పాటు అతడి స్నేహితులు చాలామంది చేస్తున్న ప్రార్థనలు ఫలించి, కిరణ్ బయటపడే అవకాశాలు కూడా లేకపోలేవు!! -
ఇది మా బిడ్డకు మరోజన్మ
* సృజన్ తండ్రి విశ్వనాథం రాజేంద్రనగర్: విహారయాత్రకు వెళ్లిన విజ్ఞాన్ జ్యోతి కళాశాల విద్యార్థులు గల్లంతయ్యారంటూ టీవీలో బ్రేకింగ్న్యూస్ చూసి షాక్‌కు గురయ్యామని.. అదే సమయంలో తన కూతురు తేరుకుని కుమారుడి సెల్‌కు ఫోన్ చేసి మాట్లాడ్డంతో ఊపిరి పీల్చుకున్నట్టు విద్యార్థి పి.సృజన్ తల్లిదండ్రులు విశ్వనాథం, ఉమాదేవి కన్నీరు పెట్టుకున్నారు. తమ కుమారుడు క్షేమంగా ఉన్నా తోటి విద్యార్థులు 24 మంది మృతి చెందారని తెలిసి తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి అయిన విశ్వనాథంకు ముగ్గురు సంతానం కాగా సృజన్ చిన్నవాడు. వీరంతా బండ్లగూడ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో సృజన్ తండ్రికి ఫోన్‌చేసి క్షేమంగా ఉన్నట్టు తెలిపి ఫోన్ పెట్టేశాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో బంధువొకరు ఫోన్‌చేసి విహారయాత్రకు వెళ్లినవారి జాడతెలియడంలేదంటూ టీవీలో వస్తోందని చెప్పారన్నారు. హతాశులైన తాము కుప్పకూలిపోగా కూతురు సృజన్‌తో మాట్లాడించిందన్నారు. తాను క్షేమంగా ఉన్నట్టు చెప్పడంతో కొంత ఊరట లభించదని విశ్వనాథం పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఫోన్‌చేసిన సృజన్ చండీఘడ్ నుంచి విమానంలో వస్తున్నట్టు సమాచారం అందించాడు. -
నీళ్లు వదిలేటప్పుడు హెచ్చరికలేవీ: హైకోర్టు
హిమాచల్ ప్రదేశ్‌లో తెలుగు విద్యార్థులు మృతిచెందిన ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బియాస్ నది ఘటనను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. లార్జి ప్రాజెక్టు అధికారులపై కూడా కోర్టు మండిపడింది. ఈ దుర్ఘటన వెనుక అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోందని, నీళ్లు వదిలేటప్పుడు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం ఎలా సంభవించింది, అందుకు కారణాలేంటన్న వివరాలతో ఈనెల 16వ తేదీలోగా కోర్టుకు నివేదిక ఇవ్వాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. మరోవైపు సహాయక చర్యల విషయంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 గంటలు గడిచినా, ఇంతవరకు చాలామంది ఆచూకీ తెలియలేదని, ఆచూకీ తెలుసుకోడానికి సైన్యాన్ని రంగంలోకి దించాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతం సురక్షితమేనని చెప్పడం వల్లే తామంతా ఫొటోలు తీసుకోడానికి కిందకు దిగామని సురక్షితంగా బయటపడిన విద్యార్థులలో కొందరు చెప్పారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా నీళ్లు పెద్ద స్థాయిలో రావడంతో ఆ సమయానికి ఏం చేయాలో కూడా తెలియలేదని అన్నారు. అది ప్రమాదకరమైన ప్రాంతం అని తమకు ఎవరూ చెప్పలేదని విద్యార్థులు తెలిపారు. -
దేవాశీష్ బోస్ మృతదేహం లభ్యం
మండి (హిమాచల్‌ప్రదేశ్): బియాస్ నదిలో మరో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడు బాగ్‌అంబర్‌పేట సీఈకాలనీకి చెందిన దేవాశీష్ బోస్ గా గుర్తించారు. బోస్ తండ్రి రాబిన్‌బోస్ నిన్ననే సంఘటన జరిగిన స్థలానికి చేరుకున్నారు. కుమారుడి మరణవార్త తెలియడంతో బోస్ తల్లి నిర్మల భోరున విలపించారు. దీంతో ఇప్పటివరకు మృతదేహాలు వెలికితీసినట్టయింది. ఇంకా 19 మంది ఆచూకీ చేయాల్సివుంది. గల్లంతైన వారికోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దాదాపు 500 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. నిన్న నలుగురు మృతదేహాలు వెలికితీశారు. సోమవారం అర్థరాత్రి ఈ మృతదేహాలను హైదరాబాద్ కు తరలించారు. ఈ నలుగురు అల్వాల్‌కు చెందిన దుర్గాదాస్ కుమార్తె గంపల ఐశ్వర్య, కూకట్‌పల్లికి చెందిన రాధాకృష్ణ కుమార్తె అప్పనబోట్ల లక్ష్మిగాయత్రి, చర్లపల్లికి చెందిన సూర్యకుమార్ కుమార్తె ఆకుల విజేత, నల్గొండ జిల్లా బిక్యాతాండాకు చెందిన శేఖర్‌నాయక్ కుమారుడు బానోతు రాంబాబుగా గుర్తించారు. -
విద్యార్థిని రిషిక క్షేమం
కాచిగూడ: హిమాచల్‌ప్రదేశ్‌కు స్టడీటూర్ కోసం వెళ్లిన వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాల విద్యార్థుల్లో బర్కత్‌పుర బసంత్ కాలనీలోని బసంత్ ఆపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న రామకృష్ణ, మంజుల దంపతుల కుమార్తె రిషిక కూడా ఉంది. ప్రమాదం విషయం తెలినప్పటి నుంచి తల్లిదండ్రులు తీవ్ర అందోళన చెందారు. అయితే, తాను క్షేమంగానే ఉన్నట్టు రిషిక నుంచి ఫోన్ రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం రిషిక కుటుంబ సభ్యులను జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్, బర్కత్‌పుర కార్పొరేటర్ దిడ్డి రాంబాబు కలిసి విద్యార్థిని యోగక్షేమాలు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. రిషిక త్వరగా హైదరాబాద్ చేరుకునేలా అధికారులతో మాట్లాడతామన్నారు. ఫోన్ వచ్చిన కొద్దిసేపటికే... ముషీరాబాద్: వీఎన్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న నల్లకుంటకు చెందిన బైరినేని రిత్విక్ రావ్ ఆదివారం మధ్యాహ్నం తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. మరో గంటలో హిమాచల్‌ప్రదేశ్‌కు చేరుకుంటున్నామని చెప్పాడు. కానీ అంతలోనే గల్లంతైనవార్తలు విని తల్లిదండ్రులు కుప్పకూలారు. గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆదివారం రాత్రి 8.45 గంటలకు టీవీలో వార్తలు చూసి కొడుకు రిత్విక్‌కు తండ్రి రామ్మోహన్రావు ఫోన్ చేశాడు. అయితే ఫోన్ స్నేహితుడి దగ్గర ఉండటంతో రిత్విక్‌కు ఫోన్ ఇవ్వమంటే స్నేహితుడు తడబడుతూ దూరంగా ఉన్నాడని, మళ్లీ ఫోన్ చేయిస్తానని చెబుతూ విషయం దాటవేశాడు. గట్టిగా నిలదీయగా నదిలో కొట్టుకుపోయాడని సమాధానం చెప్పడంతో తండ్రి రామ్మోహన్ రావు కుప్పకూలిపోయాడు. -
క్షణాల్లో తప్పించుకున్నాడు
* నితిన్ తల్లిదండ్రులు గచ్చిబౌలి: హిమాచల్‌ప్రదేశ్ ఘటనలో తమ కొడుకు సురక్షితంగా బయటపడటం అదృష్టమని, మిగతా విద్యార్థులు గల్లంతైన విషయం జీర్ణించుకోలేక పోతున్నామని నితిన్ తల్లిదండ్రులు సి.యాదయ్య, సుజాత పేర్కొన్నారు. ఆదివారం రాత్రి 7.45 గంటలకు నితిన్ ఫోన్ చేసి చెప్పే వరకు ప్రమాదం విషయం తమకు తెలియదన్నారు. తన కళ్ల ముందే స్నేహితులు వరదలో కొట్టుకపోయారని ఆందోళనగా చెప్పగానే తాము షాక్‌కు గురైనట్లు తెలిపారు. అప్పటి వరకు ఫొటోలు దిగిన నితిన్ నీళ్లు చల్లగా ఉండటంతో బయటకు వెళ్లాలని.. అదే సమయంలో పైన ఉన్న అతని స్నేహితుడు పిలువడంతో అక్కడికి వెళ్లినట్టు చెప్పాడన్నారు. కొద్ది క్షణాల్లోనే నీటి ఉధృతికి అంతా కొట్టుకుపోయారని చెప్పాడన్నారు. విషయం తెలిసిన సమయం నుంచి నితిన్‌తో గంట గంటకు ఫోన్లో మాట్లాడుతున్నట్టు వివరించారు. వరంగల్ జిల్లా చేర్యాల మండలం, సుంచనకోటకు చెందిన యాదయ్య సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తూ గచ్చిబౌలి జీపీఆర్ఏ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఈయన నలుగురు కొడుకుల్లో నితిన్ పెద్దవాడు. స్నేహితుడితో వెళ్లి... నిజామాబాద్ జిల్లాకు చెందిన ఉపేంద్ర వీఎన్‌ఆర్‌లో ద్వితీయ సంవత్సరం చదువుతూ మియాపూర్‌లో ఓ హాస్టల్లో ఉంటున్నాడు. జీపీఆర్ఏ క్వార్టర్స్‌లో బంధువుల ఇంటికి వెళ్లి అక్కడి నుంచి క్యాబ్‌లో క్లాస్మేట్ నితిన్‌తో కలిసి ఈనెల 3న నాంపల్లికి బయలుదెరాడు. దక్షిణ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి.. అక్కడి నుంచి హిమాచల్‌ప్రదేశ్‌కు చేరకున్నారు. స్నేహితుడు ఉపేంద్ర గల్లంతు కావడం తట్టుకోలేకపోతున్నానని నితిన్ తల్లిదండ్రులు తెలిపారు. -
కులుమనాలికి వైఎస్ఆర్ సీపీ ఎంపీలు
న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లో గల్లంతైన విద్యార్థుల కుటుంబాలకు సహాయం అందించేందుకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఎంపీల బృందం మంగళవారం కులుమనాలి వెళ్లింది. ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కులుమనాలి వెళ్లారు. బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం సాగుతున్న సహాయక చర్యలను వారు పరిశీలించనున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్ ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో హైదరాబాద్ వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయారు. వీరిలో నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. కాగా, ఈ ఘటనపై వైఎస్ఆర్ సీపీ ఎంపీల బృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించింది. -
మాయదారి మలుపే ముంచేసింది
నీటి ఉధృతిని సకాలంలో గమనించలేకే ఘోరం క్షణాల్లో కొట్టుకుపోయి గల్లంతైన విద్యార్థులు ఇప్పటిదాకా నాలుగు మృతదేహాల వెలికితీత మృతులు: విజేత, ఐశ్వర్య, లక్ష్మీగాయత్రి, రాంబాబు దొరక ని మరో 20 మంది ఆచూకీ.. బతికే అవకాశాల్లేనట్లే అధికారుల అలసత్వం.. నింపాదిగా సహాయక చర్యలు తక్షణం స్పందిస్తే సగమైనా బతికేవారు: విద్యార్థులు నేటి ఉదయం వెళ్లనున్న వైఎస్సార్సీపీ ఎంపీలు అధికారుల అలసత్వంపై హిమాచల్ హైకోర్టు ఫైర్ సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న మిగతా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండి (హిమాచల్‌ప్రదేశ్) నుంచి సాక్షి ప్రతినిధి ప్రవీణ్: ప్రకృతి అందాల నడుమ ఎలాగైనా కలిసి ఫొటో దిగాలన్న ఆశే అశనిపాతమైంది. జలరక్కసి రూపంలో మృత్యువు విరుచుకుపడింది. క్షణాల మీద బలి తీసుకుంది. ఆదివారం హిమాచల్‌ప్రదేశ్ కులుమనాలి సమీపంలో బియాస్ నది ప్రమాదంలో 24 మంది విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, ఒక టూర్ ఆపరేటర్ గల్లంతైన దుర్ఘటనకు డ్యాం సిబ్బంది నిర్లక్ష్యంతో పాటు నది మూలమలుపు కూడా కారణమైంది. నీళ్లు లేవన్న భరోసాతో నదిలోకి దిగిన విద్యార్థులు తమకు కాస్త ఎగువన ఉన్న మూలమలుపు కారణంగా, డ్యాం నుంచి విడుదలై శరవేగంతో దూసుకొస్తున్న జలప్రవాహాన్ని సకాలంలో పసిగట్టలేకపోయారు. తీరా గ్రహించేసరికే ఆలస్యమైంది. అంతా దాని బారిన పడి, ఆక్రందనలు చేస్తూ, తోటివారి కళ్లముందే నిస్సహాయంగా కొట్టుకుపోయారు. ఇలా జరిగింది... జూన్ 3 రాత్రి హైదరాబాద్‌లో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన విద్యార్థుల బృందం 5న అర్ధరాత్రి 1.50కు ఆగ్రాలో దిగింది. రెండు రోజులు ఆగ్రా, పరిసరాలు, 7న ఢిల్లీలో అక్షరదామ్ తదితరాలు, 8న సిమ్లా చూసి మధ్యాహ్నం రెండు బస్సుల్లో మనాలి బయల్దేరింది. మండి దాటాక 35 కిలోమీటర్ల దూరంలోని తలౌటిలో ఆగింది. దారిపొడవునా కనువిందు చేస్తున్న జలపాతాలను చూసి మైమరచిన విద్యార్థులు ఒక్కసారి ఎలాగైనా నదిలోకి దిగాల్సిందేనని భావించారు. తలౌటి వద్ద అందుకు వీలు కుదిరింది. అక్కడ ఎలాంటి హెచ్చరికలూ లేకపోవడం, ప్రవాహమూ లేకపోవడం, స్థానికులు కూడా పర్లేదనడంతో విద్యార్థులంతా నదిలోకి దిగారు. అక్కడ 20 మీటర్ల వెడల్పే ఉంది. చిన్న చిన్న రాళ్లపై అడుగులు వేసుకుంటూ నది మధ్యలోని మూడు ఎత్తయిన బండ రాళ్లపైకి వెళ్లి నుంచుని ఫొటోలు దిగసాగారు. కొందరు బయటికి వెళ్లగా దాదాపు 30 మంది దాకా ప్రమాద సమయంలో అక్కడే ఉన్నారు. అదే సమయంలో ఎగువన డ్యాం గేట్లు ఎత్తేయడంతో జలరాశి వారికేసి అమిత వేగంతో ముంచుకు రాసాగింది. కానీ తమకు కాస్త ఎగువన ఉన్న నది మూలమలుపు కారణంగా వారు చివరిక్షణం దాకా ప్రమాదాన్ని పసిగట్టలేకపోయారు. కొంతమంది చివరి క్షణాల్లో అప్రమత్తమై చిన్న రాళ్ల మీదుగా ఒడ్డుకు చేరుకున్నారు. కానీ మధ్యలోని మూడు బండరాళ్ల మీద ఉన్నవాళ్లు ప్రమాదాన్ని పసిగట్టేలోపే ప్రవాహ ంలో కొట్టుకుపోయారు. 18 మంది విద్యార్థులు, ఆరుగురు విద్యార్థినులు, ప్రహ్లాద్ అనే టూర్ ఆపరేటర్.. మొత్తం 25 మంది గల్లంతయ్యారు. సోమవారం సాయంత్రం వరకు నాలుగు మృతదేహాలను వెలికితీశారు. వాటిని పోస్టుమార్టం కోసం మండీ జోనల్ ఆసుపత్రికి తరలించారు. మృతులను హైదరాబాద్‌కు చెందిన ఆకుల విజేత, గంపల ఐశ్వర్య, అప్పనబోతుల లక్ష్మీగాయత్రి, నల్లగొండ జిల్లాకు చెందిన బానోతు రాంబాబుగా గుర్తించారు. తోటివారి దుర్మరణాన్ని కళ్లారా చూసి షాక్‌కు గురైన విద్యార్థులను తొలుత కులుకు, అక్కడి నుంచి చండీగఢ్‌కు తరలించారు. తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వారిని మార్గమధ్యంలో పరామర్శించారు. విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. సమన్వయ లోపమే శాపం విద్యార్థులు కొట్టుకుపోయన నది లోయలో ఉండటం ఒక సమస్య కాగా, పాలకుల సమన్వయ లోపం కూడా సహాయక చర్యల పాలిట శాపంగా మారింది. దానికి తోడు ప్రమాదం జరిగిన వెంటనే చీకటి పడటంతో సహాయక చర్యలకు వీల్లేకుండా పోయింది. ఆదివారం సాయంత్రం ప్రమాదం జరిగితే, సోమవారం ఉదయానికి గానీ సహాయక బృందాలు రాలేదు! అవి కూడా కేవలం మృతదేహాల వెలికితీతేగా అన్నట్టుగా మొక్కుబడిగా పని చేశాయి. ఇప్పటిదాకా ఒక్క విద్యార్థిని కూడా ప్రాణాలతో తీసుకురాలేకపోయారు. ఎస్ఎస్బీ, పోలీసులు, హోంగార్డులు, స్థానిక డైవర్లు, రాఫ్టర్లతో కూడిన 70 మంది బృందం సహాయ, వెలికితీత కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంది. సోమవారం రాత్రి కార్యకలాపాలను నిలిపేశారు. మంగళవారం ఉదయం తిరిగి మొదలు పెట్టనున్నారు. బ్యారేజీ నుంచి ప్రమాద స్థలి వరకు, అక్కడి నుంచి దిగువన పండోహ్ అనే డ్యాం వరకు నది 20 మీటర్ల వెడల్పే ఉంది. నది అంతా పూడికతో కూడుకుని ఉండటం వల్ల మృతదేహాలు అందులో కూరుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. కిందికి కొట్టుకొచ్చిన 4 మృతదేహాలు పండోహ్ డ్యాం వద్దే దొరికాయి. సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉంటామని మండీ పోలీసు ఉన్నతాధికారి పీఎల్ ఠాకూర్ ‘సాక్షి’కి తెలిపారు. మరోవైపు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు బాధిత విద్యార్థుల తల్లిదండ్రులను వెంటబెట్టుకుని సహాయక చర్యలు కొనసాగుతున్న ప్రాంతానికి వెళ్లారు. మంగళవారం ఉదయం వారంతా ప్రమాద స్థలి వద్దకు వెళ్లనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి ఉదయం 8 గంటలకల్లా అక్కడికి చేరుకోనున్నారు. జలపాతాలు ఆకట్టుకున్నాయి: చేతన్, విద్యార్థి ‘‘జలపాతాలు, బియాస్ నది ఆకట్టుకున్నాయి. అక్కడ కొన్ని ఫొటోలు దిగాలనిపించింది. లోపలకు వెళ్లొచ్చా, సమస్య ఉంటుందా అని స్థానికులనడిగాం. పర్లేదనడంతో వెళ్లాం. నదిలోని చిన్న రాళ్లను ఆసరాగా చేసుకుని పెద్ద రాళ్లపైకి వెళ్లాం. చూస్తుండగానే నీటి ప్రవాహం ఐదారు రెట్లు పెరిగిపోయింది’’ సగానికి పైగా బతికేవారు: రవికుమార్, విద్యార్థి ‘‘అంత ప్రమాదం జరిగినా, మేమంతా మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదు. తక్షణం స్పందిస్తే కనీసం 10 నుంచి 15 మంది బతికేవారు. జరిగింది చూసి అక్కడికి వచ్చిన సిబ్బంది తదితరులు కూడా సహాయక చర్యలు మొదలు పెట్టాల్సింది పోయి మమ్మల్ని తిట్టడం మొదలు పెట్టారు’’ ఎక్కడిదీ ఆ ఉధృతి... ప్రమాద స్థలికి సరిగ్గా 2.7 కిలోమీటర్ల ఎగువన కులు దారిలో తలౌటి వద్ద అనే చిన్న బ్యారేజీ ఉంది. అక్కడ 126 మెగావాట్ల లర్జి విద్యుదుత్పాదన కేంద్రముంది. విద్యుదుత్పత్తిని తగ్గించాల్సిందిగా ఆదివారం సాయంత్రం ఉన్నతాధికారుల నుంచి ఆదేశం రావడంతో బ్యారేజీ నీటి నియంత్రణలో విధుల్లో ఉన్న హరివంశ్‌సింగ్ నీటిని నదిలోకి వదిలేశారు. సాయంత్రం 6.15కు ఒకటో నంబరు గేటును అర మీటరు ఎత్తారు. దాదాపుగా అదే సమయానికి విద్యార్థులు నదిలోకి దిగారు. ‘‘గేటును 6.45కు మరో ఒకటిన్నర మీటర్ల మేరకు ఎత్తాం. ఎగువ నుంచి నీటి ప్రవాహం ఇంకా పెరగడంతో ఏడింటికి ఐదో నంబర్ గేటును కూడా 2.5 మీటర్లు ఎత్తాం. ఒకటో నంబర్ గేటునూ మరో 2 మీటర్లు ఎత్తాం’’ అని హరివంశ్ ‘సాక్షి’కి వివరించారు. సైరన్ మోగిం చలేదన్న ఆరోపణను ప్రస్తావించగా దాన్ని విన్పించి చూపించారు. ‘‘ఇది అంతదూరం వినిపించదు. బ్యా రేజీ చుట్టుపక్కల వరకే విన్పిస్తుంది’ అని చెప్పారు. చెప్పుల కోసం వెళ్లి... ప్రవూదం జరగడానికి వుుందే బయుటకు వచ్చిన విద్యార్థిని చెప్పుల కోసం తిరిగి వెళ్లి నీటి ప్రవాహంలో గల్లంతరుుంది. కరీంనగర్ సమీపంలోని రేకుర్తివాసి దాసరి రాజిరెడ్డి చిన్నకూతురు శ్రీనిధి విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతోంది. ‘అప్పటిదాకా అందరం కలిసే కూర్చున్నాం. ఎదురుగా డ్యాం పరిసరాలు అందంగా కనిపించడంతో.. అందులో నీరు తక్కువగా ఉందని లోపలికి వెళ్లాం. ఫొటోలు దిగాం. ప్రమాదం జరగడానికి ముందే శ్రీనిధి బయటకు వచ్చింది. కానీ, చెప్పులు మర్చిపోవడంతో తన సెల్‌ఫోన్ నాకు ఇచ్చి లోనికి వెళ్లింది. అంతే... కళ్లు మూసి తెరిచేలోగా ఉప్పెనలా వచ్చిన డ్యాం నీటిలో శ్రీనిధి కొట్టుకుపోయింది. ఏం జరిగిందో కొన్ని నిమిషాలపాటు అర్థం కాలేదు’ అని శ్రీనిధి క్లాస్మేట్ దివ్య ఆవేదన చెందింది. సవూచారం లేని సందీప్ బియాస్ నది వద్ద జరిగిన దుర్ఘటనలో రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామానికి చెందిన బస్వరాజ్ సందీప్ గల్లంతయ్యూడు. మేడ్చల్ న్యాయస్థానంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరుున బస్వరాజ్ వీరేష్‌కు సందీప్ మొదటి సంతానం. సందీప్ గల్లంతయిన విషయం మీడియా ద్వారా తెలుసుకున్న కుటుంబీకులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సోమవారం సాయంత్రం వరకు కూడా వీరికి సందీప్ విషయమై ఏ సమాచారం అందలేదు. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో సందీప్ ఫోన్లో తనతో మాట్లాడాడని, ప్రవూదం విషయుం తెలిసిన తరువాత అతడి నంబర్‌కు కాల్ చేస్తే పనిచేయుడం లేదనే సవూధానం వస్తోందని వీరేష్ దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. భీతిల్లిన భీక్యాతండా బియాస్ నది వరదల్లో తమ తండాకు చెందిన విద్యార్థి గల్లంతయ్యూడనే సమాచారంతో నల్లగొండ జిల్లా మోతె వుండలం భీక్యా తండాలో ఒక్కసారి విషాదఛాయలు అలుముకున్నాయి. లాల్‌తండా గ్రామ పంచాయతీ పరిధిలో భీక్యాతండాకు చెందిన బానోతు శేఖర్-బుజ్జి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు నాగరాజు ఇంజనీర్‌గా స్థిరపడగా, చిన్నకుమారుడు రాంబాబు(20) విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కాలేజిలో సెకండియర్ చదువుతున్నాడు. సెలవుల్లో ఇంటికొచ్చినప్పుడు చేదోడువాదోడుగా తల్లిదండ్రులకు వ్యవసాయపనుల్లో సహకరించేవాడు. బియాస్ నది వరదల్లో కొడుకు గల్లంతై చనిపోయాడన్న సమాచారం అందండంలో రాంబాబు తల్లి బుజ్జి ఒక్కసారిగా స్పృహ తప్పిపడిపోయింది. నర్సంపేట, గిర్మాజీపేటలో విషాదం హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో గల్లంతైన వారిలో వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన చిందం పరమేశ్, గిర్మాజీపేటకు చెందిన అఖిల్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయూరు. చిందం వీరన్న, ఉమ దంపతులకు ముగ్గురు సంతానం. చిన్న కుమారుడు పరమేశ్ హైదరాబాద్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్టడీ టూర్‌కు తోటి విద్యార్థులతో కలిసి హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లి గల్లంతు కావడంతో నర్సంపేటలో విషాదం అలుముకుంది. గిర్మాజీపేటకు చెందిన మిట్టపల్లి సంజయ్,సునీత దంపతులకు ఒక కూతురు, కుమారుడు. కుమారుడు అఖిల్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళశాలలో ఈఅండ్ఐఈ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు హిమచల్‌ప్రదేశ్‌లో గల్లంతు కావడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. అఖిల్ ప్రమాదంలో చిక్కుకున్నాడని తెలియగానే... తల్లి షాక్‌కు గైరై సొమ్మసిల్లిపడింది. మిత్రులను కాపాడి మునిగిపోయాడు ఉధృతమవుతున్న జల ప్రవాహం ఓవైపు... నీటిలో కొట్టుకు పోతున్న స్నేహితులు మరోవైపు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో కూడా సాహసానికి ఒడిగట్టాడు ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి ముప్పిడి కిరణ్‌కుమార్. తన ప్రాణాలను సైతం లెక్కచేయక అతను స్నేహితులను కాపాడేందుకే ప్రాధాన్యమిచ్చాడు. బియాస్ నదిలో జరిగిన ప్రమాదంలో ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుుడు ముప్పిడి వెంకటరమణ కుమారుడు కిరణ్ స్నేహితుల కోసం వెళ్లి ప్రమాదంలో గల్లంతైనట్టు తెలుస్తోంది. అందిన సమాచారం ప్రకారం.... ప్రమాదం జరిగిన స్థలంలో కిరణ్‌కు సమీపంలో ప్రత్యూష అనే విద్యార్థినితో పాటు మరో విద్యార్థిని ఉన్నారు. వీరిలో ప్రత్యూష కుటుంబం, కిరణ్ కుటుంబం సన్నిహితులు. తన సమీపంలో ఉన్న ఆ ఇద్దరు విద్యార్థినులను కాపాడేందుకు కిరణ్ నదీప్రవాహంలోనే ఉండిపోయాడు. ఇద్దరినీ అతికష్టం మీద ఒడ్డుకు చేర్చాడు. తాను కూడా ఒడ్డుకు వచ్చే ప్రయత్నం చేస్తుండగా, అతను నిల్చున్న బండరాయి జారింది. దీంతో కిరణ్ ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు. -సాక్షి నెట్వర్క్ లైఫ్ జాకెట్లు ఎవరూ ధరించలేదు ఆదివారం సాయంత్రం 6.30-6.45 గంటల మధ్య సుమారు 48 మంది విద్యార్థులు లార్జీ డ్యామ్ గేట్లకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఫొటోలు దిగేందుకు కిందకు దిగారు. ఆ సమయంలో పాదాలు మునిగేలా మాత్రమే అక్కడ నీళ్లున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న రెండు పెద్ద బండరాళ్లపై నిల్చుని విద్యార్థులు ఫొటోలు దిగారు. విద్యార్థులు లైఫ్‌జాకెట్లు, హెల్మెట్లు ధరించి నీళ్లలోకి దిగినట్లుగా కొన్ని పత్రికల్లో వచ్చిన ఫొటోలు అవాస్తవం. అసలు అవి వేసుకోమని విద్యార్థులకు చెప్పిన వారెవరూ అక్కడ లేరు. నీటి ప్రవాహమే లేనప్పుడు అవన్నీ వేసుకోవాలన్న ఆలోచన ఎవరికీ రాలేదు.గేట్లు తెరవడానికి కొన్ని నిమిషాల ముందు 24 మంది విద్యార్థులు సురక్షితంగా పైకి వచ్చేశారు. గేట్లు తెరుస్తున్నప్పుడు సైరన్ శబ్దం వినిపించలేదు. డ్యామ్ పైనున్న వారు మాత్రం హిందీలో గేట్లు తెరుస్తున్నట్లుగా అరిచారు. కానీ ఈ శబ్దం కూడా సరిగా వినిపించకపోవడంతో విద్యార్థులు అక్కడే ఉన్నారు. నిమిషం వ్యవధిలో విద్యార్థులు నీటిలో కొట్టుకుపోవడం తీవ్రంగా కలచి వేసింది. - సుమబాల, ఫ్యాకల్టీ మెంబర్, వీఎన్ఆర్ వీజేఐటీ సైరన్ శబ్దం వినిపించలేదు గేట్లు తీసే సమయంలో సైరన్ శబ్దం మాకు వినిపించలేదు. ఫొటోలు దిగే సమయంలో నీటి ఉద్ధృతి క్రమంగా పెరుగుతోందని మాకు మేమే గమనించి మొత్తం 48 మందిలో 24 మందిమి పైకి వచ్చేశాం. మిగతా వారు ఫొటోలు దిగుతున్నారు. మేము పైకి వచ్చేలోగానే నిమిషం వ్యవధిలో అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ అందరూ నీళ్లలో కొట్టుకుపోవడంతో మేము ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాం. ముందు నదిలోకి దిగే సమయంలో అక్కడున్న స్థానికులు ఫరవాలేదు అని చెబితేనే నీళ్లలోకి దిగాము. - సద్ది దివ్య, విద్యార్థిని, క్షేమంగా బయటికి వచ్చిన విద్యార్థిని అలారం శబ్దం రాలేదు... ‘విద్యార్థులు డ్యామ్ వద్ద ఫొటోలు దిగేందుకు వెళ్లారు. నేను మరికొంత మంది విద్యార్థులు ఒడ్డున నిలబడ్డాం. డ్యామ్ గేట్లు ఒక్కసారిగా ఎత్తడంతో నీటి ప్రవాహం దూసుకొచ్చింది. డ్యామ్గేట్లు ఎత్తినప్పుడు ఎలాంటి అలారం శబ్దం వినపడలేదు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే నీటి ప్రవాహం పెరిగింది. రక్షించాలని కేకలు వేశాం. నేను ‘100’ నంబర్‌కు ఫోన్‌చేసి పోలీసులకు సమాచారమిచ్చా. ప్రమాదం జరిగిన సుమారు రెండు గంటలకు బైక్‌మీద ఒక పోలీసు కానిస్టేబుల్ ఘటనా స్థలానికి వచ్చాడు. అధికారులు సకాలంలో స్పందించి ఉంటే కొందరినైనా కాపాడుకుని ఉండేవాళ్లం...’ తాండూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి పానుగంటి సృజన్ వివరించాడు. అన్నయ్యా అంటూ పలకరించి... ‘‘అన్నయ్యా నీ మెయిల్ ఐడీ ఎస్ఎంఎస్ చేస్తే టూర్లో మధురస్మతులను పంపిస్తానని’’ ఫోన్లో అన్నయ్యతో మాట్లాడిన ఐశ్వర్య కొద్దిగంటలలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. హైదరాబాద్ అల్వాల్ జ్యోతి నగర్లో నివసించే గంప దుర్గాదాస్, సుధలకు అభిషేక్, ఐశ్వర్య (19) సంతానం. ఐశ్వర్య ఇండస్ట్రియల్ టూర్‌కు వెళ్లగా, తండ్రి దుర్గాదాస్, తల్లి సుధ సోదరుడు అభిషేక్ కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్లారు. మధ్యలో తల్లి సోదరుడు మధురైకి, తండ్రి శబరిమలైకు వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం సోదరుడికి ఫోన్ చేసిన ఐశ్వర్య తాజ్‌మహల్, ఫతేఫూర్ సిక్రీలను సందర్శించిన ఫొటోలు పంపిస్తానని, మెయిల్ ఐడీ పంపించమని అన్నయ్యతో మాట్లాడింది. అయితే అర్థరాత్రి ఐశ్వర్య మృతదేహం లభించినట్లు సమాచారం రావడంతో వీరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వెళ్లింది మూడు బ్యాచ్‌లు 163 మంది వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి మొత్తం మూడు బ్యాచుల్లో 163 మంది విద్యార్థులు ఇండస్ట్రియల్ టూర్‌కు వెళ్లారు. వారంతా జూన్ 3న బయల్దేరారు. వీరి లో సెకండియర్ ఆటోమొబైల్ బ్రాంచ్ నుంచి 35 మంది, సీఎస్ఈ నుంచి 80 మంది, ఈఐఈ బ్రాంచ్ నుంచి 48 మంది వెళ్లారు. ఈఐఈ బ్రాంచ్ విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. బాధితుల సమాచారం కోసం హైదరాబాద్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నంబర్లు అశోక్ కుమార్, డీఆర్వో సెల్ నం. 9440815887 మూర్తి, జేడీ, సాంకేతిక విద్య సెల్ నం. 9912342187 విచారణకు ఆదేశం సిమ్లా: ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతైన ప్రమాదంపై మండి డివిజనల్ కమిషనర్‌తో సోమవారం న్యాయ విచారణకు హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ ఆదేశించారు. -
తాడుతో ఒకరిని కాపాడాం..కానీ..
‘సాక్షి’తో బియాస్ నది పరీవాహక గ్రావువాసులు దిపేన్, బ్రిజ్జు సాక్షి, హైదరాబాద్:‘‘ఘోర ఘటన కళ్లవుుందే జరిగింది. నీళ్లలో కొట్టుకుపోతున్న వారిని తాళ్లువేసి రక్షించేందుకు ప్రయుత్నించాం. ఒక అబ్బాయి మాత్రమే తాడును అందుకుని ఒడ్డుకు చేరాడు. మిగిలిన విద్యార్థులు చూస్తుండగానే కొట్టుకుపోయూరు’’ అని బియూస్ నది పరీవాహక ప్రాంత గ్రామానికి చెందిన దిపేన్, బ్రిజ్జులు సోవువారం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ వాపోయూరు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం మండి జిల్లా బియాస్ నది పరీవాహన ప్రాంతంలోని లార్జీ హైడ్రో పవర్ ప్రాజెక్టు వద్ద ఆదివారం ప్రవూదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న స్థానికులు విద్యార్థులను రక్షించడానికి తీవ్ర ప్రయుత్నాలు చేశారని దిపేన్, బ్రిజ్జులు సాక్షికి వివరించారు. ఆ వివరాలివీ.. సాయుంత్రం 6 గంటల ప్రాంతంలో రెండు బస్సుల్లో విద్యార్థులు అక్కడకు వచ్చారు. అందులో దాదాపు వుుప్పైవుంది వరకు మోకాలి లోతు వరకు నీరు ఉన్న బియూస్ నదిలోకి దిగారు. విద్యార్థినీ, విద్యార్థులు కొద్దిగా లోపలకు వెళ్లి బండరాళ్లపై కూర్చుని ఫొటోలు దిగసాగారు. వురికొందరు నీళ్లను కాళ్లతో తన్నుతూ కేరింతలు కొడుతున్నారు. మిగతావారు గ్రూపులు గ్రూపులుగా ఒడ్డునే ఉండి ఫొటోలు దిగుతున్నారు. అరుుతే నదిలోకి వెళ్లిన వారిని ఇంకా లోపలకు వెళ్లవద్దని మేం వారించాం. సాధారణంగా ఎవరైనా విహారయాత్రకు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఫొటోలు దిగడం సహజం. 6.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో నీటి ప్రవాహం పెరిగింది. చూస్తుండగానే నీటి ఉధృతి పెరగడంతో గాబరా పడిన విద్యార్థులు అక్కడే ఉన్న చిన్న బండరాళ్లను ఎక్కేందుకు ప్రయుత్నించారు. డ్యాం నుంచి గేట్లను ఎత్తడం వల్లనే నీటి ఉధృతి పెరిగిందని వూకు అర్థమైంది. దీంతో లోపల ఉన్న విద్యార్థులను అప్రవుత్తం చేస్తూ బాహార్ ఆవో, జల్దీ ఆవో అంటూ కేకలు వేశాం. నీటి ప్రవాహం మరింత పెరగడంతో ఇద్దరు విద్యార్థులు వుుందుగా కొట్టుకుపోయూరు. వెంటనే తేరుకున్న మేం అందుబాటులో ఉన్న తాడును విసిరి దానిని పట్టుకుని రావాలని అరిచాం. అందులో ఒకరుతాడును పట్టుకోగా ఒడ్డుకు లాగేశాం. మరోసారి తాడు వేశాం, మరోవైపు నుంచి చీరెలు కూడా విసిరారు. చీరెలు పట్టుకున్న ఇద్దరిని బయుటకు లాగడానికి ప్రయుత్నిస్తుండగా ప్రవాహ ఉధృతి మరింత పెరగడంతో వారు కొట్టుకుపోయూరు. ఐదారుగురు వూత్రమే ప్రవూదం నుంచి బయుటపడగలిగారు. మిగిలిన వారిలో నలుగురు, ఆరుగురు తొమ్మిది మంది గ్రూపులుగా ఉండి ఒకరినొకరు పట్టుకుని ఆక్రందనలు చేస్తూనే ఉధృతంగా వచ్చిన నీటిలో గల్లంతయ్యూరు అని దిపేన్, బ్రిజ్జులు వివరించారు.