గేట్లు తెరిచిన అధికారుల సస్పెన్షన్ | Rajnath Singh shock on Himachal Pradesh Incident | Sakshi
Sakshi News home page

గేట్లు తెరిచిన అధికారుల సస్పెన్షన్

Published Mon, Jun 9 2014 8:25 AM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM

Rajnath Singh shock on Himachal Pradesh Incident

న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌ లో  బియాస్ నదిలో హైదరాబాద్‌ విజ్ఞానజ్యోతి కళాశాల విద్యార్థులు గల్లంతైన ఘటనపై కేంద్రం హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.

అటు హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించింది. ముందుస్తు హెచ్చరికలు లేకుండా లార్జి హైడ్రోపవర్‌ ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేసిన అధికారులను సస్పెండ్ చేసింది.

మరోవైపు గల్లంతైన విద్యార్థుల కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ బృందం సహాయక చర్యలు చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement