'బియాస్'లో మరో విషాదం | One Dead, 6 Feared Washed Away as Car Plunges into Beas River | Sakshi
Sakshi News home page

'బియాస్'లో మరో విషాదం

Published Tue, Jul 5 2016 7:05 PM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM

'బియాస్'లో మరో విషాదం

'బియాస్'లో మరో విషాదం

నదిలో కారు పడి 8 మంది దుర్మరణం

మండి: హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లా ఆట్ ప్రాంతంలో కారు అదుపుతప్పి బియాస్ నదిలో పడి న ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. వారిలో ఏడుగురు ఒకే కుటుంబానికి చెందినవారున్నారు. ఈ దుర్ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, మరో వ్యక్తితో కలిసి మాణికరన్ నుంచి తిరిగి వస్తుండగా వారి కారును వేగంగా వచ్చిన మరో వాహనం ఢీకొట్టింది.

దీంతో వారి టాటా నానో కారు దొర్లుకుంటూ వెళ్లి బియాస్ నదిలో పడడంతో అందరూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారని మండి ఎస్పీ ప్రేమ్ కుమార్ చెప్పారు. ప్రాణాలతో బయటపడిన కుటుంబంలోని వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు ఇప్పటి వరకు ఒక మృతదేహాన్ని కనుగొన్నారు. మిగతా ఏడుగురి కోసం వెతుకుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement