washed away car
-
అయ్యో పాపం.. అంతా చూస్తుండగానే కొట్టుకు పోయారు
నాగ్‌పూర్: చుట్టు ముట్టేసిన వరద నీరు. మునిగిపోయిన వాహనం. ప్రాణాల కోసం హాహాకారాలు. చేతులు బయటకు పెట్టి వాహనపు పైభాగాన్ని పట్టుకుని రక్షించుకునే ప్రయత్నం. కాపాడండని కేకలు. చుట్టుపక్కల ఎంతో మంది ఉన్నా.. వరద ఉధృతిని చూసి సాహసం చేసి రక్షించలేని పరిస్థితి. వెరసి.. వాహనంతో పాటే కొట్టుకుని పోయి ప్రాణాలు వదిలారు. మహారాష్ట్ర నాగ్‌పూర్ సావ్నెర్ మండలం కేల్వాద్ దగ్గర నందా నదిలో ఈ విషాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ ముల్తాయికి చెందిన ఓ కుటుంబం.. వివాహ వేడుక కోసం నాగ్‌పూర్‌కు వచ్చింది. తిరిగి ఊరికి వెళ్తున్న క్రమంలో వాళ్ల వాహనం బ్రిడ్జిపై వెళ్తుండగా.. హఠాత్తుగా వరద ముంచెత్తి ఇలా నదిలో చిక్కుకుని కొట్టుకుపోయింది. #BREAKING #News #Monsoon2022 #Maharashtra 3 died and about 3 trapped after a scorpio car washed away in Nanda river of Kelwad, Tahsil Saoner, District #Nagpur amid heavy flow of water induced by rains, confirms @SPNagpurrural@CMOMaharashtra@Dev_Fadnavis@Deve #MaharashtraRains pic.twitter.com/gJ0HQIzOrz — Ketan Sojitra (@Public_Affairs7) July 12, 2022 అంతా చూస్తుండగానే.. వాహనం మునిగి కొట్టుకుపోగా.. నిస్సహాయంగా చూస్తూ రక్షించే ప్రయత్నాలు చేయలేకపోయారు గ్రామస్తులు. ఉన్నతాధికారులకు సమాచారం అందించినా.. వాళ్లు వచ్చేసరికి ఆలస్యం అయ్యింది. కొందరు మొబైల్స్‌లో వీడియోలు తీస్తూ ఉండిపోయారు. ముగ్గురు మృతి చెందగా.. అందులో ఒక మహిళ కూడా ఉంది. మరో ముగ్గురు వాహనంతో పాటు గల్లంతయ్యారు. వాళ్ల కోసం గాలింపు చర్యలు పెట్టారు అధికారులు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో వర్ష ప్రభావంతో ఇప్పటిదాకా(జూన్ 1 నుంచి జులై 10 దాకా) 83 మంది మృతి చెందారని స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది. -
మూసీలో కొట్టుకుపోయిన కారు.. త్రుటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, వికారాబాద్: త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మూసీ(వాగు)లో ఓ కారు కొట్టుకుపోతుండగా స్థానికులు గమనించి అడ్డుకోవడంతో అందులోని వ్యక్తి క్షేమంగా బయటపడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చించల్‌పేట వద్ద మంగళవారం ఉదయం జరిగింది. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. వికారాబాద్ మండలం ధన్నారం గ్రామానికి చెందిన ప్రకాష్ తన కారులో చించల్‌పేట మీదుగా నవాబుపేటకు వెళ్తున్నాడు. అప్పటికే మూసి వాగులో నీరు పారుతోంది. నీటి ప్రవాహం తక్కువగా ఉందని భావించిన ఆయన అలాగే కారును ముందుకు పోనిచ్చాడు. మధ్యలోకి వెళ్లగానే నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో వాహనం నెమ్మదిగా కొట్టుకుపోసాగింది. గమనించిన చించల్‌పేట గ్రామస్తులు అప్రమత్తమై కారును అడ్డుకున్నారు. తాళ్ల సహాయంతో వాహనాన్ని బయటకు తీశారు. దీంతో కారులో ఉన్న ప్రకాష్ క్షేమంగా బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ బుచ్చయ్య, ఎస్ఐ వెంకటేశ్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రకాష్‌ను రక్షించిన చించల్‌పేట గ్రామస్తులను ఈ సదర్భంగా అభినందించారు. నీరు ఉధృతిగా ఉన్నప్పుడు వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. చదవండి: లక్షా 75 వేల ఆవు దూడ.. వింత చేప..! -
తాటిచెట్టును పట్టుకొని ముగ్గురు..
జనగామ: జనగామ మండలం వడ్లకొండ వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. నర్మెట నుంచి జనగామ వైపు వస్తున్న కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో మంగళవారం రాత్రి సుమారు 10.20 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలను నిలిపివేసి పోలీసులు కాపలాగా ఉన్నారు. ఆ రహదారిపై వస్తున్న కారును ముందు రావొద్దని పోలీసులు వారించినా డ్రైవర్ వినిపించుకోకుండా దూసుకొచ్చాడు. కల్వర్టుపైకి రాగానే వరద ఉధృతికి కారు చీటకోడూరు రిజర్వాయర్ వైపు కొట్టుకుపోయింది. ఈ సమయంలో కారులో ఉన్న ఓ వ్యక్తి తాటిచెట్టును గట్టిగా పట్టుకోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. వెంటనే మిగతా ఇద్దరు కూడా చెట్టును పట్టుకున్నారు. భారీక్రేన్ తెప్పించి ఈ ముగ్గురి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. -
'బియాస్'లో మరో విషాదం
నదిలో కారు పడి 8 మంది దుర్మరణం మండి: హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లా ఆట్ ప్రాంతంలో కారు అదుపుతప్పి బియాస్ నదిలో పడి న ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. వారిలో ఏడుగురు ఒకే కుటుంబానికి చెందినవారున్నారు. ఈ దుర్ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, మరో వ్యక్తితో కలిసి మాణికరన్ నుంచి తిరిగి వస్తుండగా వారి కారును వేగంగా వచ్చిన మరో వాహనం ఢీకొట్టింది. దీంతో వారి టాటా నానో కారు దొర్లుకుంటూ వెళ్లి బియాస్ నదిలో పడడంతో అందరూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారని మండి ఎస్పీ ప్రేమ్ కుమార్ చెప్పారు. ప్రాణాలతో బయటపడిన కుటుంబంలోని వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు ఇప్పటి వరకు ఒక మృతదేహాన్ని కనుగొన్నారు. మిగతా ఏడుగురి కోసం వెతుకుతున్నారు.