న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లో గల్లంతైన విద్యార్థుల కుటుంబాలకు సహాయం అందించేందుకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఎంపీల బృందం మంగళవారం కులుమనాలి వెళ్లింది. ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కులుమనాలి వెళ్లారు. బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం సాగుతున్న సహాయక చర్యలను వారు పరిశీలించనున్నారు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్ ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో హైదరాబాద్ వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయారు. వీరిలో నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. కాగా, ఈ ఘటనపై వైఎస్ఆర్ సీపీ ఎంపీల బృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించింది.
కులుమనాలికి వైఎస్‌ఆర్ సీపీ ఎంపీలు
Published Tue, Jun 10 2014 8:08 AM | Last Updated on Tue, May 29 2018 2:59 PM
Advertisement