యాదయ్య, సుజాత(ఇన్ సెట్) సురక్షితంగా బయటపడిన నితిన్
* నితిన్ తల్లిదండ్రులు
గచ్చిబౌలి: హిమాచల్‌ప్రదేశ్ ఘటనలో తమ కొడుకు సురక్షితంగా బయటపడటం అదృష్టమని, మిగతా విద్యార్థులు గల్లంతైన విషయం జీర్ణించుకోలేక పోతున్నామని నితిన్ తల్లిదండ్రులు సి.యాదయ్య, సుజాత పేర్కొన్నారు. ఆదివారం రాత్రి 7.45 గంటలకు నితిన్ ఫోన్ చేసి చెప్పే వరకు ప్రమాదం విషయం తమకు తెలియదన్నారు. తన కళ్ల ముందే స్నేహితులు వరదలో కొట్టుకపోయారని ఆందోళనగా చెప్పగానే తాము షాక్‌కు గురైనట్లు తెలిపారు. అప్పటి వరకు ఫొటోలు దిగిన నితిన్ నీళ్లు చల్లగా ఉండటంతో బయటకు వెళ్లాలని.. అదే సమయంలో పైన ఉన్న అతని స్నేహితుడు పిలువడంతో అక్కడికి వెళ్లినట్టు చెప్పాడన్నారు.
కొద్ది క్షణాల్లోనే నీటి ఉధృతికి అంతా కొట్టుకుపోయారని చెప్పాడన్నారు. విషయం తెలిసిన సమయం నుంచి నితిన్‌తో గంట గంటకు ఫోన్‌లో మాట్లాడుతున్నట్టు వివరించారు. వరంగల్ జిల్లా చేర్యాల మండలం, సుంచనకోటకు చెందిన యాదయ్య సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తూ గచ్చిబౌలి జీపీఆర్‌ఏ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఈయన నలుగురు కొడుకుల్లో నితిన్ పెద్దవాడు.
స్నేహితుడితో వెళ్లి...
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఉపేంద్ర వీఎన్‌ఆర్‌లో ద్వితీయ సంవత్సరం చదువుతూ మియాపూర్‌లో ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. జీపీఆర్‌ఏ క్వార్టర్స్‌లో బంధువుల ఇంటికి వెళ్లి అక్కడి నుంచి క్యాబ్‌లో క్లాస్‌మేట్ నితిన్‌తో కలిసి ఈనెల 3న నాంపల్లికి బయలుదెరాడు. దక్షిణ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి.. అక్కడి నుంచి హిమాచల్‌ప్రదేశ్‌కు చేరకున్నారు. స్నేహితుడు ఉపేంద్ర గల్లంతు కావడం తట్టుకోలేకపోతున్నానని నితిన్ తల్లిదండ్రులు తెలిపారు.