ఇది మా బిడ్డకు మరోజన్మ | hyderabad student p srujan safe | Sakshi
Sakshi News home page

ఇది మా బిడ్డకు మరోజన్మ

Published Tue, Jun 10 2014 11:04 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM

ఇది మా బిడ్డకు మరోజన్మ

ఇది మా బిడ్డకు మరోజన్మ

* సృజన్ తండ్రి విశ్వనాథం

రాజేంద్రనగర్: విహారయాత్రకు వెళ్లిన విజ్ఞాన్ జ్యోతి కళాశాల విద్యార్థులు గల్లంతయ్యారంటూ టీవీలో బ్రేకింగ్‌న్యూస్ చూసి షాక్‌కు గురయ్యామని.. అదే సమయంలో తన కూతురు తేరుకుని కుమారుడి సెల్‌కు ఫోన్ చేసి మాట్లాడ్డంతో ఊపిరి పీల్చుకున్నట్టు విద్యార్థి పి.సృజన్ తల్లిదండ్రులు విశ్వనాథం, ఉమాదేవి కన్నీరు పెట్టుకున్నారు. తమ కుమారుడు క్షేమంగా ఉన్నా తోటి విద్యార్థులు 24 మంది మృతి చెందారని తెలిసి తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి అయిన విశ్వనాథంకు ముగ్గురు సంతానం కాగా సృజన్ చిన్నవాడు. వీరంతా బండ్లగూడ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో సృజన్ తండ్రికి ఫోన్‌చేసి క్షేమంగా ఉన్నట్టు తెలిపి ఫోన్ పెట్టేశాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో బంధువొకరు ఫోన్‌చేసి విహారయాత్రకు వెళ్లినవారి జాడతెలియడంలేదంటూ టీవీలో వస్తోందని చెప్పారన్నారు.

హతాశులైన తాము కుప్పకూలిపోగా కూతురు సృజన్‌తో మాట్లాడించిందన్నారు. తాను క్షేమంగా ఉన్నట్టు చెప్పడంతో కొంత ఊరట లభించదని విశ్వనాథం పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఫోన్‌చేసిన సృజన్ చండీఘడ్ నుంచి విమానంలో వస్తున్నట్టు సమాచారం అందించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement