రిథిమాకు కన్నీటి వీడ్కోలు | VNR VJ College Ridhima Papani last rites complete | Sakshi
Sakshi News home page

రిథిమాకు కన్నీటి వీడ్కోలు

Published Sat, Jun 28 2014 12:16 AM | Last Updated on Thu, May 10 2018 12:34 PM

రిథిమాకు కన్నీటి వీడ్కోలు - Sakshi

రిథిమాకు కన్నీటి వీడ్కోలు

బంగారుపాళెం: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో కొట్టుకుపోయి ఆశువులుబాసిన ఇంజినీరింగ్ విద్యార్థిని రిథిమా పాపానికి శుక్రవారం కన్నీటి వీడ్కోలు పలికారు. హైదరాబాద్‌లోని విజ్ఞాన జ్యోతి కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న రిథిమా పాపాని తోటి విద్యార్థులతో కలిసి విజ్ఞాన యాత్రకు వెళ్లి, 8వ తేదీన హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన విషయం తెలిసిందే.

బుధవారం ఆమె మృతదేహాన్ని అధికారులు కనుగొన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరింది. అక్కడి నుంచి  ఆమె స్వగ్రామమైన చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలం పాపానివారిపల్లెకు తీసుకొచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement