Ridhima Papani
-
రిథిమాకు కన్నీటి వీడ్కోలు
బంగారుపాళెం: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో కొట్టుకుపోయి ఆశువులుబాసిన ఇంజినీరింగ్ విద్యార్థిని రిథిమా పాపానికి శుక్రవారం కన్నీటి వీడ్కోలు పలికారు. హైదరాబాద్‌లోని విజ్ఞాన జ్యోతి కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న రిథిమా పాపాని తోటి విద్యార్థులతో కలిసి విజ్ఞాన యాత్రకు వెళ్లి, 8వ తేదీన హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. బుధవారం ఆమె మృతదేహాన్ని అధికారులు కనుగొన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరింది. అక్కడి నుంచి ఆమె స్వగ్రామమైన చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలం పాపానివారిపల్లెకు తీసుకొచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
రిధిమా.. వెళ్లిపోయావమ్మా !
మోతీనగర్: హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నదీ ప్రవాహంలో గల్లంతైన రిధిమా మృతదేహం లభించిందని అధికారులు సమాచారమివ్వడంతో మోతీనగర్ బీఎస్పీకాలనీలో ఆమె నివాసం వద్ద తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈనెల 8న దుర్ఘటన జరిగిన నాటి నుంచి రిధిమా తల్లిదండ్రులు శ్రీనివాస్, రాధాదేవిలు తల్లడిల్లుతూ కూతురు కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు తమకూతురు క్షేమంగా తిరిగి వస్తుందని కళ్లల్లో ఒత్తులువేసుకొని అన్నపానీయాలు ముట్టకుండా ఎదురుచూసిన తల్లిదండ్రులకు చివరకు మృతదేహం వస్తుందని తెలియడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. ‘చిన్నప్పటినుంచి అల్లారుముద్దుగా పెంచుకున్నాం. ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదని’ ఆవేదన వ్యక్తం చేశారు. రిధిమా మృతదేహం లభించిందని తెలియడంతో ఆమె స్నేహితులు, బంధువులు ఇంటికి తరలివస్తున్నారు. ఈనెల 8న బియాస్ నదిలో దుర్ఘటన జరగ్గా...ఇప్పటివరకు 18 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా ఏడు మృతదేహాలు దొరకాల్సి ఉంది. మృతదేహం గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అనంతరం అక్కడినుంచి చిత్తూరు జిల్లాకు తరలించనున్నట్లు రిధిమా కుటుంబసభ్యులు తెలిపారు. -
విషాదయాత్ర
-
రిథిమా కోసం తల్లిదండ్రుల నిరీక్షణ
హైదరాబాద్: బియాస్ ఉదంతంలో గల్లంతైన తమ బిడ్డల జాడ కోసం తల్లిదండ్రులు, ఆత్మీయులు రెప్పవేయకుండా ఎదురు చూస్తున్నారు. నగరంలో సర్వత్రా విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థులు గల్లంతైన ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు,తోబుట్టువులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించడం ప్రతి ఒక్కరిని కలచి వేస్తోంది. కోటి ఆశలతో నిరీక్షణ మోతీనగర్ డివిజన్ బాలాజి స్వర్ణపురికాలనీకి చెందిన పి. శ్రీనివాస్, రమాదేవిల ప్రథమ కుమార్తె రిథిమా పాపాని కూడా గల్లంతైంది. తమ కూతురు క్షేమంగా తిరిగివస్తుందని తల్లిదండ్రులు మాత్రం కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. జాడ తెలియని శ్రీహర్ష నల్లకుంట శివం రోడ్డులోని బతుకమ్మకుంటకు చెందిన కల్లూరి శ్రీహర్ష గల్లంతైనట్లు వచ్చిన వార్తలతో అతని తల్లి స్వర్ణలత నిలువునా కుప్పకూలారు. స్పృహ తప్పారు. తండ్రి కేఆర్‌కేవీ.ప్రసాద్ హుటాహుటిన హిమాచల్ బయలుదేరి వెళ్లారు.