రిథిమా కోసం తల్లిదండ్రుల నిరీక్షణ | Ridhima Papani missing in Beas river | Sakshi
Sakshi News home page

రిథిమా కోసం తల్లిదండ్రుల నిరీక్షణ

Published Tue, Jun 10 2014 12:44 PM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM

రిథిమా కోసం తల్లిదండ్రుల నిరీక్షణ

రిథిమా కోసం తల్లిదండ్రుల నిరీక్షణ

హైదరాబాద్: బియాస్ ఉదంతంలో గల్లంతైన తమ బిడ్డల జాడ కోసం తల్లిదండ్రులు, ఆత్మీయులు రెప్పవేయకుండా ఎదురు చూస్తున్నారు. నగరంలో సర్వత్రా విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థులు గల్లంతైన ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు,తోబుట్టువులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించడం ప్రతి ఒక్కరిని కలచి వేస్తోంది.

కోటి ఆశలతో నిరీక్షణ
మోతీనగర్ డివిజన్ బాలాజి స్వర్ణపురికాలనీకి చెందిన పి. శ్రీనివాస్, రమాదేవిల ప్రథమ కుమార్తె రిథిమా పాపాని కూడా గల్లంతైంది. తమ కూతురు క్షేమంగా తిరిగివస్తుందని తల్లిదండ్రులు మాత్రం కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు.
 
జాడ తెలియని శ్రీహర్ష
నల్లకుంట శివం రోడ్డులోని బతుకమ్మకుంటకు చెందిన కల్లూరి శ్రీహర్ష గల్లంతైనట్లు వచ్చిన వార్తలతో అతని తల్లి స్వర్ణలత నిలువునా కుప్పకూలారు. స్పృహ తప్పారు. తండ్రి కేఆర్‌కేవీ.ప్రసాద్ హుటాహుటిన హిమాచల్ బయలుదేరి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement