'వాటంతటవే పైకి తేలితేనే దొరుకుతాయి'
మండి: హిమాచల్ ప్రదేశ్ ఘటనకు బాధ్యులైన వారిని వదలబోమని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి అన్నారు. మండి కలెక్టర్ నివేదిక అందిన వెంటనే కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థుల ఫీజును రీయింబర్స్‌మెంట్ చేసేందుకు కాలేజ్ మేనేజ్ మెంట్ ఒప్పుకుందని తెలిపారు.
విద్యార్థుల కుటుంబానికి కాలేజీలో సీటు లేదా ఉద్యోగం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందని వెల్లడించారు. గల్లంతైన విద్యార్థుల మృతదేహాల గాలింపుకు సంబంధించి అన్ని మార్గాలు ఉపయోగించామని చెప్పారు. వాటంతటవే పైకి తేలితేనే మృతదేహాలు దొరుకుతాయని అన్నారు.