Beas river Tragedy
-
విజ్ఞానజ్యోతి విద్యార్థుల మృతి కేసు; ప్రభుత్వానికి చుక్కెదురు
న్యూఢిల్లీ: వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి కేసులో హిమచల్‌ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. విద్యార్థుల మృతికి హిమచల్‌ప్రదేశ్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. తీర్పు అమలుకు 6 నెలల సమయం కావాలని ప్రభుత్వం కోరగా, మూడు నెలల్లో పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 24 మంది విద్యార్థులు 2014 జూన్ 8న హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపణలు వచ్చాయి. చనిపోయిన ఒక్కో విద్యార్థి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పును హిమచల్‌ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీన్ని కోర్టు కొట్టివేయడంతో విద్యార్థుల కుటుంబాలకు ఊరట లభించింది. -
బియాస్ దుర్ఘటన నేపథ్యంలో...
న్యూఢిల్లీ: బియాస్ నదిలో 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతైన దుర్ఘటన నేపథ్యంలో విద్యార్థుల విజ్ఞాన యాత్రలకు మార్గదర్శకాలు రూపొందించాలని యూజీసీ, ఏఐసీటీఈలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. విద్యార్థుల భద్రతే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలు ఉండాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభకు తెలిపారు. బియాస్ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే స్పందించానని ఆమె చెప్పారు. సహాయక చర్యలు చేపట్టాలని హిమచల్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా తమ మంత్రులను సంఘటనా స్థలానికి పంపాయని చెప్పారు. బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాలకు చెందిన 24 మంది జూన్ 8న హిమచల్‌ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైయ్యారు. వీరిలో ముగ్గురు మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు. -
'విఎన్ఆర్' ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన
బియాస్ దుర్ఘటన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి విఎన్ఆర్ కళాశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. కాలేజీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. దాంతో కాలేజీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు గత నెలలో విజ్ఞాన యాత్రలో భాగంగా ఉత్తర భారతంలో పర్యటించారు. అందులోభాగంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలోకి దిగిన 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు నీటి ప్రవాహానికి కొట్టుకునిపోయి మరణించిన సంగతి తెలిసిందే. అయితే కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థులకు నష్టపరిహారం ఇస్తామని ప్రకటించి కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తు శుక్రవారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. దాంతో కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
రిథిమాకు కన్నీటి వీడ్కోలు
బంగారుపాళెం: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో కొట్టుకుపోయి ఆశువులుబాసిన ఇంజినీరింగ్ విద్యార్థిని రిథిమా పాపానికి శుక్రవారం కన్నీటి వీడ్కోలు పలికారు. హైదరాబాద్‌లోని విజ్ఞాన జ్యోతి కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న రిథిమా పాపాని తోటి విద్యార్థులతో కలిసి విజ్ఞాన యాత్రకు వెళ్లి, 8వ తేదీన హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. బుధవారం ఆమె మృతదేహాన్ని అధికారులు కనుగొన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరింది. అక్కడి నుంచి ఆమె స్వగ్రామమైన చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలం పాపానివారిపల్లెకు తీసుకొచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
రిధిమా.. వెళ్లిపోయావమ్మా !
మోతీనగర్: హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నదీ ప్రవాహంలో గల్లంతైన రిధిమా మృతదేహం లభించిందని అధికారులు సమాచారమివ్వడంతో మోతీనగర్ బీఎస్పీకాలనీలో ఆమె నివాసం వద్ద తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈనెల 8న దుర్ఘటన జరిగిన నాటి నుంచి రిధిమా తల్లిదండ్రులు శ్రీనివాస్, రాధాదేవిలు తల్లడిల్లుతూ కూతురు కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు తమకూతురు క్షేమంగా తిరిగి వస్తుందని కళ్లల్లో ఒత్తులువేసుకొని అన్నపానీయాలు ముట్టకుండా ఎదురుచూసిన తల్లిదండ్రులకు చివరకు మృతదేహం వస్తుందని తెలియడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. ‘చిన్నప్పటినుంచి అల్లారుముద్దుగా పెంచుకున్నాం. ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదని’ ఆవేదన వ్యక్తం చేశారు. రిధిమా మృతదేహం లభించిందని తెలియడంతో ఆమె స్నేహితులు, బంధువులు ఇంటికి తరలివస్తున్నారు. ఈనెల 8న బియాస్ నదిలో దుర్ఘటన జరగ్గా...ఇప్పటివరకు 18 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా ఏడు మృతదేహాలు దొరకాల్సి ఉంది. మృతదేహం గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అనంతరం అక్కడినుంచి చిత్తూరు జిల్లాకు తరలించనున్నట్లు రిధిమా కుటుంబసభ్యులు తెలిపారు. -
బియాస్ లో శవమై తేలిన సాయిరాజ్
మండీ: హిమాచల్ ప్రదేశ్ బియాస్‌నదిలో మరో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడు హైదరాబాద్ ఏఎస్‌రావ్ నగర్‌కు చెందిన బి. మహెన్ సాయిరాజ్ గా గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం రేపు హైదరాబాద్‌కు పంపించనున్నారు. తల్లిదండ్రులతో పోట్లాడి మరీ టూర్ కు వెళ్లిన సాయిరాజ్ చివరకు శవమై తేలాడు. ఇప్పటివరకు13 మృతేదేహాలు వెలికితీశారు. శివప్రకాశ్ వర్మ, ఆశిష్ మంథా, మాచర్ల అఖిల్ మృతదేహాలు శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నాయి. గల్లంతైన మిగతా 11 మంది విద్యార్థుల మృతదేహాల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. -
విఎన్ఆర్ కాలేజీ యాజమాన్యానికి హైకోర్టు నోటీసులు
విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు బియాస్ నదిలో దిగేందుకు అనుమతి ఎవరిచ్చారో తెలపాలని ఆ కళాశాల యాజమాన్యానికి హిమాచల్ హైకోర్టు శుక్రవారం నోటీలసు జారీ చేసింది. ఇదిలా ఉండగా బియాస్ నదిలో విద్యార్థుల విషాదంపై నివేదికను మండి డివిజన్ కమిషన్ ఈరోజు హైకోర్టుకు అందజేసింది. డ్యామ్ అధికారుల నిర్లక్ష్యమే ఆ ప్రమాదానికి ఘటనకు కారణమని డివిజన్ కమిషన్ ఆ నివేదికలో పేర్కొంది. అలాగే డ్యామ్ నుంచి గంటలో 450 క్యూసెక్కుల నీరు విడుదలైందని వెల్లడించింది. నీటీ విడుదల సమయంలో స్పష్టమైన నిబంధనలను పాటించలేదని... వార్నింగ్ సిస్టమ్ సరిగా లేదని తెలిపింది. పవర్ హౌస్‌లో అధికారుల మధ్య సమన్వయం లేదని చెప్పింది. ఇటువంటి పొరపాట్ల కారణంగానే విద్యార్థులు మృతి చెందారని మండి డివిజన్ కమిషన్ హైకోర్టు అందజేసిన నివేదికలో పేర్కొంది. ఇటీవల హైదరాబాద్ నగరానికి చెందిన విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతీ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు విజ్ఞన యాత్ర కోసం ఉత్తర భారతదేశం వెళ్లారు. ఆ క్రమంలో హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. అక్కడి బియాస్ నదిలో ఫోటోలు దిగుతుండగా 24 మంది కాలేజీ విద్యార్థులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఆ ఘటనలో ఇప్పటి వరకు 12 మంది విద్యార్థులు మృతదేహాలను వెలికి తీశారు. విద్యార్ధుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
అశీష్, అఖిల్ మృతదేహాలు లభ్యం
మండీ: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతు అయిన విద్యార్థుల్లో మరో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమైయ్యాయి. మృతులు అశీష్ ముంతా, మాచర్ల అఖిల్‌గా గుర్తించారు. సికింద్రాబాద్ చిలకలగూడ శ్రీనివాసనగర్‌కు చెందిన అశీష్ ముంతా ప్రమాద సమయంలో ఇద్దరు విద్యార్థినులను ఒడ్డుకు చేర్చి, తాను నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడని అతని స్నేహితులు చెప్పారు. ఏడాది కిందట భర్తను కోల్పోయి విచారంలో ఉన్నఅశీష్ తల్లి సత్యవాణి ఈ వార్త విని కన్నీటిపర్యంతమైంది. ఈ ఉదయం వెలికితీసిన మృతదేహం ఎం.శివప్రకాశ్ వర్మదిగా గుర్తించారు. దీంతో ఇప్పటివరకు లభ్యమైన విద్యార్థుల మృతదేహాల సంఖ్య 12కు చేరింది. గల్లంతైన విద్యార్థుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
'ఏపీ నేతలు టూర్‌కి వచ్చినట్టుగా వచ్చారు'
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ లో బియాస్ నదిలో విద్యార్థులు గల్లంతైన దుర్ఘటనపై సాయంత్రం సీఎం కేసీఆర్‌కు నివేదిక సమర్పించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. గాలింపు చర్యలు మరో పది రోజులు కొనసాగుతాయని చెప్పారు. విద్యార్థుల విషయంలో ఆంధ్ర, తెలంగాణ అనేది చూడలేదన్నారు. ఘటనలో కాలేజీ యాజమాన్య నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తోందన్నారు. స్టూడెంట్స్‌తో పాటు సీనియర్ ఫ్యాకల్టీలు, లోకల్ గైడ్ లేరని తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాస్తారని చెప్పారు. స్టడీ టూర్స్‌పై త్వరలోనే ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేస్తుందన్నారు. బియాస్ విషాదంపై ఏపీ ప్రభుత్వం స్పందించిన తీరుపై నాయిని ఆక్షేపించారు. ఏపీ నేతలు ఏదో టూర్‌కి వచ్చినట్టుగా వచ్చి వెళ్లిపోయారని అన్నారు. -
సీనియర్ ఫ్యాకల్టీలను పంపలేదు: మహేందర్‌రెడ్డి
-
సీనియర్ ఫ్యాకల్టీలను పంపలేదు: మహేందర్‌రెడ్డి
మండీ: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో విద్యార్థులు గల్లంతైన ఘటనలో విజ్ఞాన్‌జ్యోతి కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. యాజమాన్యం బాధ్యత లేకుండా ప్రవర్తించిందని విమర్శించారు. విద్యార్థుల వెంబడి సీనియర్ ఫ్యాకల్టీలను పంపలేదని తెలిపారు. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తప్పవని హెచ్చరించారు. లార్జి డ్యాం వద్ద సహాయక చర్యలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విద్యార్థులు గల్లంతైన ఘటనపై హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఘటన జరిగి ఇన్నాళ్లైనా దర్యాప్తు నివేదిక ఎందుకివ్వలేదని హిమాచల్ ప్రభుత్వ యంత్రాంగంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలీచాలని నష్టపరిహారం ఇస్తే ఎలాగని ప్రశ్నించింది. నష్టపరిహార మొత్తాన్ని పెంచాలని సూచించింది. -
బియాస్ కన్నీరు !
-
'వాటంతటవే పైకి తేలితేనే దొరుకుతాయి'
మండి: హిమాచల్ ప్రదేశ్ ఘటనకు బాధ్యులైన వారిని వదలబోమని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి అన్నారు. మండి కలెక్టర్ నివేదిక అందిన వెంటనే కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థుల ఫీజును రీయింబర్స్మెంట్ చేసేందుకు కాలేజ్ మేనేజ్ మెంట్ ఒప్పుకుందని తెలిపారు. విద్యార్థుల కుటుంబానికి కాలేజీలో సీటు లేదా ఉద్యోగం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందని వెల్లడించారు. గల్లంతైన విద్యార్థుల మృతదేహాల గాలింపుకు సంబంధించి అన్ని మార్గాలు ఉపయోగించామని చెప్పారు. వాటంతటవే పైకి తేలితేనే మృతదేహాలు దొరుకుతాయని అన్నారు. -
వీఎన్ఆర్ కాలేజి యాజమాన్యానికి పూర్వ విద్యార్ధుల బాసట
మండి: హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో విద్యార్థుల గల్లంతు ఘటనపై యాజమాన్యానికి విఎన్ఆర్ విజ్ఞాన్ కళాశాల పూర్వవిద్యార్థులు బాసటగా నిలిచారు. బియాస్ నదిలో ప్రమాదానికి, యాజమాన్యం ఎలాంటి సంబంధం లేదని విద్యార్ధులు తెలిపారు. ఈ దుర్ఘటనలో కాలేజి యాజమాన్య తప్పిదంలేదని పూర్వ విద్యార్ధులు మీడియాకు వెల్లడించారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు మేము అండగా నిలుస్తామని పూర్వ విద్యార్ధులు ముందుకు వచ్చారు. మృతి చెందిన విద్యార్ధుల కుటుంబాలకు మా సానుభూతి తెలియజేస్తున్నామని విఎన్ఆర్ విజ్ఞాన్ కళాశాల పూర్వవిద్యార్థులు అన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాపై కాలేజి యాజమాన్యం స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. -
గాలింపు చర్యలు తాత్కాలికంగా నిలిపివేత
హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్ బియాస్‌నదిలో గల్లంతయిన 24 మంది విద్యార్థుల్లో 19 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. నదిలో నీటిప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలను తాత్కాలింగా ఆపేశారు. ఇవాళ ఉదయం వెలికి తీసిన మృతదేహాన్ని బాగ్ అంబర్‌పేటకు చెందిన దేవాశిష్ బోస్‌గా గుర్తించారు. పండూ డ్యామ్‌కు 100 మీటర్ల దూరంలో దేవాశిష్ మృతదేహం బయటపడింది. దీంతో ఇప్పటిదాకా వెలికి తీసిన మృతదేహాల సంఖ్య ఐదుకు చేరింది. ఆచూకీ తెలియకుండా పోయిన విద్యార్థుల కోసం సైనిక, పోలీసు, గజఈతగాళ్లు బృందాలుగా ఏర్పడి వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. లార్జిడ్యాం నుంచి పండూ డ్యామ్ దాకా దాదాపు 18 కిలోమీటర్లు అణువణువూ గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఘటన జరిగిన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు సరిపడాలేవని మండి కలెక్టర్ దేవేష్ కుమార్ చెప్పారు. వ్యవస్థలో లోపాలు ఉన్న మాట నిజమేనని ఆయన అంగీకరించారు. ఇకపై పర్యాటకులను అప్రమత్తం చేయడంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని దేవేష్ కుమార్ చెప్పారు. 84 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, 10 మంది గజ ఈతగాళ్లు గాలిస్తున్నా గల్లంతైన విద్యార్థుల జాడ తెలియలేదు. కొండల్లోని మంచు కరిగివస్తున్న నీరు చల్లగా ఉండటం వల్ల సహాయకార్యక్రమాలుకు ఆటంకం కలిగిస్తోంది. దీంతో గాలింపు తాత్కాలికంగా నిలిపేశారు. చనిపోయిన విద్యార్థుల మృతదేహాలను వారి ఇళ్లకు చేర్చారు. విహారయాత్రకు వెళ్లిన పిల్లలు విగత జీవులుగా ఇంటికి చేరటంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. లక్ష్మీగాయత్రి అనే విద్యార్థి చిన్నప్పటి నుంచి అన్నింటిలో ఎంతో చురుకుగా ఉండేది. చదువులే కాదు ఆటపాటల్లోనూ ముందుండేది. ఇంజనీరింగ్‌లోనూ మంచి ర్యాంక్ సాధించి విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతోంది. కాలేజ్ తరపున ఇండస్ట్రీయల్ టూర్ కోసం వెళ్లి 20 ఏళ్లు కూడా నిండకుండానే కన్నుముసింది. దీంతో ఆ ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి. ఈ కష్టం పగవాడికి కూడా రాకుడదంటూ ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అవుతోంది. లక్ష్మీగాయత్రి ఎంతో మంచి అమ్మాయని అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండేది బందువులు చెప్పారు . అలాంటి అమ్మాయి ఇలా అర్థంతరంగా చనిపోవటం జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. మిగిలిన వారి ప్రాణాలు ఎలాగు కపాడలేకపోయారు కనీసం వారి శవాలనైనా వారి కుటుంబాలకు వెంటనే అందేలా చూడాలంటున్నారు. లక్ష్మీగాయత్రి కుటుంబాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావులు పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడమే కాకుండా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ రోజు మధ్యాహ్నం లక్ష్మీగాయత్రికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ మొత్తం ఘనటలో డ్యాం అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోందని సహాయక చర్యలు కూడా తూతూ మంత్రంగా కొనసాగుతున్నాయి బాధితుల బంధువులు చెప్పారు. కాలేజీ యాజమాన్యం సరియైన విధంగా స్పందించలేదని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. సహాయక చర్యలు కూడా సరిగా జరగటంలేదని చెప్పారు. -
విషాదయాత్ర
-
కన్నా ఎక్కడున్నావురా?
బియాస్ నదిలో జరగిన ప్రమాదంలో రహమత్‌నగర్‌కు చెందిన జగదీశ్ ఉన్నాడు. తమ కొడుకును తలుచుకుంటు తల్లిదండ్రుల కన్నీరు మున్నీరుగా విలపించడం స్థానికంగా ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ‘కన్నా.. ఎక్కడున్నావురా.. ఏమైపోయావురా..కనిపించరా..’ అంటు జగదీష్ తల్లి విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. తల్లిదండ్రులను ఒప్పించి వెళ్లాడు మియాపూర్ హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలోని బ్లోసమ్ అపార్ట్మెంట్లో ఉంటున్న రవివర్మ ఎస్బీహెచ్, జూబ్లీహిల్స్ శాఖ బ్రాంచ్‌మేనేజర్. భార్య సుమతి, ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శివప్రకాశ్ వర్మ విజ్ఞాన్జ్యోతిలో ఈఐఈ ఇంజనీరింగ్ కోర్సు ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులను ఒప్పించి పట్టుబట్టి మరీ 3వ తేదీన విహారయాత్రకు బయలుదేరాడు. ప్రతిరోజు తల్లితో ఫోన్లో మాట్లాడుతుండేవాడు. చివరిసారిగా ఆదివారం ఉదయం తల్లికి ఫోన్ చేశాడు. టూర్ విశేషాలు చెప్పాడు. ఆ తరువాత మళ్లీ ఫోన్ రాలేదు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సోమవారం ఉదయం 6 గంటలకు ఇంటికి తాళంవేసి హిమాచల్‌కు బయలుదేరారు. తల్లడిల్లుతున్న తల్లి హృదయం హిమాచల్‌ప్రదేశ్ ఘటనలో చిలకలగూడ శ్రీనివాసనగర్‌కు చెందిన అశీష్ ముంతా(20) గల్లంతు కావడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తల్లి సత్యవాణి కన్నీటిపర్యంతమైంది. ఏడాది కిందట భర్తను కోల్పోయి విచారంలో ఉన్న ఆమెకు ఈ వార్త అశనిపాతమైంది. కాగా గల్లంతైన ఆశీష్ ప్రమాద సమయంలో ఇద్దరు విద్యార్థినులకు ఒడ్డుకు చేర్చి, తాను ప్రమాదంలో చిక్కుకున్నాడని అతని స్నేహితులు చెబుతున్నారు. ఆచూకీ లేని సాబేర్.. శేరిలింగంపల్లి గుల్మెహర్పార్క్ కాలనీకి చెందిన షేక్ సాబేర్ హుస్సేన్ విషయమై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించగా సాబేర్ సురక్షితంగానే ఉన్నట్లు చెప్పారు. అయినా కాలేజీ వాళ్ల మాటలతో సంతృప్తి చెందక సాబేర్ తల్లిదండ్రులు ఆసియా, షేక్ రజాలు సోమవారం హిమాచల్‌కు బయలుదేరి వెళ్లారు. కానీ బియాస్నది వద్ద జరిగిన విషాదం వివరాలు తమకు ఏమీ తెలియడం లేదని సాబేర్ తల్లిదండ్రులు హిమాచల్‌లోని మండి నుంచి ‘సాక్షి’కి ఫోన్ చేసి చెప్పారు. ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించితేకాని ఆచూకీ దొరకదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ రాకపోవడంతో ఆందోళన చందానగర్‌కు జవహర్ కాలనీ టెల్కర్ట్స్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసముండే వెంకట దుర్గ తరుణ్‌ను ఈ నెల 3వ తేదీ సాయంత్రం 8 గంటలకు స్వయంగా తండ్రి సుబ్బారావు రెలైక్కించారు. రెగ్యులర్‌గా ఫోన్లో మాట్లాడే తరుణ్ చివరిసారిగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు తండ్రికి ఫోన్ చేసి కులూకు వెళుతున్నట్లు చెప్పాడు. అంతే.. ఆ తరువాత ఫోన్ రాలేదు. దాంతో తండ్రి సుబ్బారావు ఆందోళనకు గురై హిమాచల్‌ప్రదేశ్‌కు బయలుదేరి వెళ్లాడు. ఫోన్ స్విచాఫ్.. కడప జిల్లా తెలుగు గంగ ప్రాజెక్టులో ఎస్ఈగా పనిచేస్తున్న సుబ్బారావు, ఆశల కుటుంబం కూడా కూకట్‌పల్లిలోనే ఉంటుంది. వారి కుమారుడు సాయిరాజ్ కూడా ఈ ప్రమాదంలో గల్లంతయ్యాడు. చివరి సారిగా సాయిరాజ్ ఆదివారం మధ్యాహ్నం ఫోన్ చేసి కులుమనాలి సమీపంలోని పర్యాటక స్థలంలో ఉన్నామని చెప్పాడు. టీవిలో వస్తున్న వార్తలు విన్న తల్లిదండ్రులు సాయికి ఫోన్ చేశారు. అప్పటికే అది స్విచాఫ్ అయింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన వారు హుటాహుటిన హిమాచల్ ప్రదేశ్‌కి బయలుదేరారు. కోలుకోలేని విషాదంలో తల్లి వనస్థలిపురంకు చెందిన గోనూరు అరవింద్ గల్లంతయ్యాడన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. అరవింద్ తల్లి శశిలత దుఃఖం వర్ణనాతీతం. శంషాబాద్‌లో ఉండే భర్త వినోద్‌కుమార్‌తో వచ్చిన మనస్పర్ధల కారణంగా కొంతకాలంగా ఆమె తన ముగ్గురు పిల్లలతో వనస్థలిపురం హిల్‌కాలనీలోని తండ్రి సంగప్ప ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో అరవింద్ గల్లంతు కావడం ఆ తల్లిని కోలుకోలేని విషాదంలో ముంచింది. -
రిథిమా కోసం తల్లిదండ్రుల నిరీక్షణ
హైదరాబాద్: బియాస్ ఉదంతంలో గల్లంతైన తమ బిడ్డల జాడ కోసం తల్లిదండ్రులు, ఆత్మీయులు రెప్పవేయకుండా ఎదురు చూస్తున్నారు. నగరంలో సర్వత్రా విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థులు గల్లంతైన ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు,తోబుట్టువులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించడం ప్రతి ఒక్కరిని కలచి వేస్తోంది. కోటి ఆశలతో నిరీక్షణ మోతీనగర్ డివిజన్ బాలాజి స్వర్ణపురికాలనీకి చెందిన పి. శ్రీనివాస్, రమాదేవిల ప్రథమ కుమార్తె రిథిమా పాపాని కూడా గల్లంతైంది. తమ కూతురు క్షేమంగా తిరిగివస్తుందని తల్లిదండ్రులు మాత్రం కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. జాడ తెలియని శ్రీహర్ష నల్లకుంట శివం రోడ్డులోని బతుకమ్మకుంటకు చెందిన కల్లూరి శ్రీహర్ష గల్లంతైనట్లు వచ్చిన వార్తలతో అతని తల్లి స్వర్ణలత నిలువునా కుప్పకూలారు. స్పృహ తప్పారు. తండ్రి కేఆర్‌కేవీ.ప్రసాద్ హుటాహుటిన హిమాచల్ బయలుదేరి వెళ్లారు.