గాలింపు చర్యలు తాత్కాలికంగా నిలిపివేత | Searching operations Temporarily Dropping | Sakshi
Sakshi News home page

గాలింపు చర్యలు తాత్కాలికంగా నిలిపివేత

Published Tue, Jun 10 2014 7:19 PM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM

గాలింపు చర్యలు తాత్కాలికంగా నిలిపివేత

గాలింపు చర్యలు తాత్కాలికంగా నిలిపివేత

హైదరాబాద్:  హిమాచల్‌ప్రదేశ్‌ బియాస్‌నదిలో గల్లంతయిన 24 మంది విద్యార్థుల్లో 19 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. నదిలో నీటిప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలను తాత్కాలింగా ఆపేశారు. ఇవాళ ఉదయం వెలికి తీసిన మృతదేహాన్ని బాగ్‌ అంబర్‌పేటకు చెందిన దేవాశిష్‌ బోస్‌గా గుర్తించారు. పండూ డ్యామ్‌కు 100 మీటర్ల దూరంలో దేవాశిష్‌ మృతదేహం బయటపడింది. దీంతో ఇప్పటిదాకా వెలికి తీసిన మృతదేహాల సంఖ్య ఐదుకు చేరింది.  ఆచూకీ తెలియకుండా పోయిన విద్యార్థుల కోసం  సైనిక, పోలీసు, గజఈతగాళ్లు బృందాలుగా ఏర్పడి  వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. లార్జిడ్యాం నుంచి పండూ డ్యామ్‌ దాకా దాదాపు 18 కిలోమీటర్లు అణువణువూ గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఘటన జరిగిన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు సరిపడాలేవని మండి కలెక్టర్‌ దేవేష్‌ కుమార్ చెప్పారు. వ్యవస్థలో లోపాలు ఉన్న మాట నిజమేనని ఆయన అంగీకరించారు. ఇకపై పర్యాటకులను అప్రమత్తం చేయడంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని  దేవేష్‌ కుమార్‌ చెప్పారు.

84 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, 10 మంది  గజ ఈతగాళ్లు  గాలిస్తున్నా గల్లంతైన విద్యార్థుల జాడ తెలియలేదు. కొండల్లోని మంచు కరిగివస్తున్న నీరు చల్లగా ఉండటం వల్ల సహాయకార్యక్రమాలుకు ఆటంకం కలిగిస్తోంది. దీంతో గాలింపు తాత్కాలికంగా నిలిపేశారు.  చనిపోయిన విద్యార్థుల మృతదేహాలను వారి ఇళ్లకు చేర్చారు. విహారయాత్రకు వెళ్లిన పిల్లలు విగత జీవులుగా ఇంటికి చేరటంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.

లక్ష్మీగాయత్రి అనే విద్యార్థి చిన్నప్పటి నుంచి అన్నింటిలో ఎంతో చురుకుగా ఉండేది. చదువులే కాదు ఆటపాటల్లోనూ ముందుండేది. ఇంజనీరింగ్‌లోనూ మంచి ర్యాంక్‌ సాధించి విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతోంది. కాలేజ్‌ తరపున ఇండస్ట్రీయల్ టూర్‌ కోసం  వెళ్లి 20 ఏళ్లు కూడా నిండకుండానే  కన్నుముసింది. దీంతో ఆ ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి. ఈ కష్టం పగవాడికి కూడా రాకుడదంటూ ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అవుతోంది. లక్ష్మీగాయత్రి ఎంతో మంచి అమ్మాయని అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండేది  బందువులు చెప్పారు . అలాంటి అమ్మాయి ఇలా అర్థంతరంగా చనిపోవటం జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. మిగిలిన వారి ప్రాణాలు ఎలాగు కపాడలేకపోయారు కనీసం వారి శవాలనైనా వారి కుటుంబాలకు  వెంటనే అందేలా చూడాలంటున్నారు. లక్ష్మీగాయత్రి కుటుంబాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, కూకట్‌ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావులు పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడమే కాకుండా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ రోజు మధ్యాహ్నం లక్ష్మీగాయత్రికి అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ మొత్తం ఘనటలో డ్యాం అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోందని సహాయక చర్యలు కూడా తూతూ మంత్రంగా కొనసాగుతున్నాయి బాధితుల బంధువులు చెప్పారు.  కాలేజీ యాజమాన్యం సరియైన విధంగా స్పందించలేదని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. సహాయక చర్యలు కూడా సరిగా జరగటంలేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement