అశీష్, అఖిల్ మృతదేహాలు లభ్యం | ashish mantha, macherla Akhil bodies found in beas river | Sakshi
Sakshi News home page

అశీష్, అఖిల్ మృతదేహాలు లభ్యం

Published Thu, Jun 19 2014 3:56 PM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM

అశీష్

అశీష్

మండీ: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతు అయిన విద్యార్థుల్లో మరో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమైయ్యాయి. మృతులు అశీష్ ముంతా, మాచర్ల అఖిల్‌గా గుర్తించారు. సికింద్రాబాద్ చిలకలగూడ శ్రీనివాసనగర్‌కు చెందిన అశీష్ ముంతా ప్రమాద సమయంలో ఇద్దరు విద్యార్థినులను ఒడ్డుకు చేర్చి, తాను నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడని అతని స్నేహితులు చెప్పారు. ఏడాది కిందట భర్తను కోల్పోయి విచారంలో ఉన్నఅశీష్ తల్లి సత్యవాణి ఈ వార్త విని కన్నీటిపర్యంతమైంది.

ఈ ఉదయం వెలికితీసిన మృతదేహం ఎం.శివప్రకాశ్ వర్మదిగా గుర్తించారు. దీంతో ఇప్పటివరకు లభ్యమైన విద్యార్థుల మృతదేహాల సంఖ్య 12కు చేరింది. గల్లంతైన విద్యార్థుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement