విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు బియాస్ నదిలో దిగేందుకు అనుమతి ఎవరిచ్చారో తెలపాలని ఆ కళాశాల యాజమాన్యానికి హిమాచల్ హైకోర్టు శుక్రవారం నోటీలసు జారీ చేసింది. ఇదిలా ఉండగా బియాస్ నదిలో విద్యార్థుల విషాదంపై నివేదికను మండి డివిజన్ కమిషన్ ఈరోజు హైకోర్టుకు అందజేసింది. డ్యామ్ అధికారుల నిర్లక్ష్యమే ఆ ప్రమాదానికి ఘటనకు కారణమని డివిజన్ కమిషన్ ఆ నివేదికలో పేర్కొంది.
అలాగే డ్యామ్ నుంచి గంటలో 450 క్యూసెక్కుల నీరు విడుదలైందని వెల్లడించింది. నీటీ విడుదల సమయంలో స్పష్టమైన నిబంధనలను పాటించలేదని... వార్నింగ్ సిస్టమ్ సరిగా లేదని తెలిపింది. పవర్ హౌస్లో అధికారుల మధ్య సమన్వయం లేదని చెప్పింది. ఇటువంటి పొరపాట్ల కారణంగానే విద్యార్థులు మృతి చెందారని మండి డివిజన్ కమిషన్ హైకోర్టు అందజేసిన నివేదికలో పేర్కొంది.
ఇటీవల హైదరాబాద్ నగరానికి చెందిన విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతీ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు విజ్ఞన యాత్ర కోసం ఉత్తర భారతదేశం వెళ్లారు. ఆ క్రమంలో హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. అక్కడి బియాస్ నదిలో ఫోటోలు దిగుతుండగా 24 మంది కాలేజీ విద్యార్థులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఆ ఘటనలో ఇప్పటి వరకు 12 మంది విద్యార్థులు మృతదేహాలను వెలికి తీశారు. విద్యార్ధుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.