ఢిల్లీ: ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులకు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. వివిధ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా ఐదుగురు న్యాయమూర్తులు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు ఐదుగురు న్యాయమూర్తులకు చీఫ్ జస్టిస్‌లుగా పదోన్నతి దక్కింది.
జస్టిస్ విపిన్ సంఘీ (ప్రస్తుతం ఢిల్లీ) - ఉత్తరాఖండ్ హైకోర్టు
జస్టిస్ ఏఏ సయ్యద్ (ప్రస్తుతం బొంబాయి) - హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు
జస్టిస్ ఎస్‌ఎస్ షిండే (ప్రస్తుతం బొంబాయి) - రాజస్థాన్ హైకోర్టు
జస్టిస్ రష్మిన్ ఎం ఛాయా (ప్రస్తుతం గుజరాత్) - గౌహతి హైకోర్టు
జస్టిస్ ఉజ్జల్ భుయాన్ (ప్రస్తుతం తెలంగాణ) - తెలంగాణ హైకోర్టు
Comments
Please login to add a commentAdd a comment