వీఎన్ఆర్ కాలేజి యాజమాన్యానికి పూర్వ విద్యార్ధుల బాసట
మండి: హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో విద్యార్థుల గల్లంతు ఘటనపై యాజమాన్యానికి విఎన్‌ఆర్ విజ్ఞాన్ కళాశాల పూర్వవిద్యార్థులు బాసటగా నిలిచారు.
బియాస్ నదిలో ప్రమాదానికి, యాజమాన్యం ఎలాంటి సంబంధం లేదని విద్యార్ధులు తెలిపారు. ఈ దుర్ఘటనలో కాలేజి యాజమాన్య తప్పిదంలేదని పూర్వ విద్యార్ధులు మీడియాకు వెల్లడించారు.
ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు మేము అండగా నిలుస్తామని పూర్వ విద్యార్ధులు ముందుకు వచ్చారు. మృతి చెందిన విద్యార్ధుల కుటుంబాలకు మా సానుభూతి తెలియజేస్తున్నామని విఎన్‌ఆర్ విజ్ఞాన్ కళాశాల పూర్వవిద్యార్థులు అన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాపై కాలేజి యాజమాన్యం స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.