'విఎన్ఆర్' ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన | Student unions protests at VNR Vignana Jyothi Institute of engineering & technology | Sakshi
Sakshi News home page

'విఎన్ఆర్' ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన

Published Fri, Jul 4 2014 12:24 PM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM

Student unions protests at VNR Vignana Jyothi Institute of engineering & technology

బియాస్ దుర్ఘటన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి విఎన్ఆర్ కళాశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. కాలేజీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. దాంతో కాలేజీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు గత నెలలో విజ్ఞాన యాత్రలో భాగంగా ఉత్తర భారతంలో పర్యటించారు.

 

అందులోభాగంగా హిమాచల్ప్రదేశ్లోని బియాస్ నదిలోకి దిగిన 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు నీటి ప్రవాహానికి కొట్టుకునిపోయి మరణించిన సంగతి తెలిసిందే. అయితే కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థులకు నష్టపరిహారం ఇస్తామని ప్రకటించి కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తు శుక్రవారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. దాంతో కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement