'ఏపీ నేతలు టూర్‌కి వచ్చినట్టుగా వచ్చారు'
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ లో బియాస్ నదిలో విద్యార్థులు గల్లంతైన దుర్ఘటనపై సాయంత్రం సీఎం కేసీఆర్‌కు నివేదిక సమర్పించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. గాలింపు చర్యలు మరో పది రోజులు కొనసాగుతాయని చెప్పారు. విద్యార్థుల విషయంలో ఆంధ్ర, తెలంగాణ అనేది చూడలేదన్నారు.
ఘటనలో కాలేజీ యాజమాన్య నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తోందన్నారు. స్టూడెంట్స్‌తో పాటు సీనియర్ ఫ్యాకల్టీలు, లోకల్ గైడ్ లేరని తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాస్తారని చెప్పారు. స్టడీ టూర్స్‌పై త్వరలోనే ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేస్తుందన్నారు. బియాస్ విషాదంపై ఏపీ ప్రభుత్వం స్పందించిన తీరుపై నాయిని ఆక్షేపించారు. ఏపీ నేతలు ఏదో టూర్‌కి వచ్చినట్టుగా వచ్చి వెళ్లిపోయారని అన్నారు.