
నాయినిని అడ్డుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు
హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. అక్కడి నుంచి ఆయన సంఘటనా స్థలికి చేరుకుంటారు.
కాగా, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద నాయిని నర్సింహారెడ్డిని విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డుకున్నారు. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని నిలదీశారు. ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, కాలేజీ యాజమాన్యం సంఘటనా స్థలానికి తీసుకెళతామని చెప్పడంతో విద్యార్థులు తల్లిదండ్రులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారిని ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆవేదన చెందుతున్నారు.
మరోవైపు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో కంట్రోల్ రూము ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.