‘సాక్షి’తో బియాస్ నది పరీవాహక గ్రావువాసులు దిపేన్, బ్రిజ్జు
సాక్షి, హైదరాబాద్:‘‘ఘోర ఘటన కళ్లవుుందే జరిగింది. నీళ్లలో కొట్టుకుపోతున్న వారిని తాళ్లువేసి రక్షించేందుకు ప్రయుత్నించాం. ఒక అబ్బాయి మాత్రమే తాడును అందుకుని ఒడ్డుకు చేరాడు. మిగిలిన విద్యార్థులు చూస్తుండగానే కొట్టుకుపోయూరు’’ అని బియూస్ నది పరీవాహక ప్రాంత గ్రామానికి చెందిన దిపేన్, బ్రిజ్జులు సోవువారం ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడుతూ వాపోయూరు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం మండి జిల్లా బియాస్ నది పరీవాహన ప్రాంతంలోని లార్జీ హైడ్రో పవర్ ప్రాజెక్టు వద్ద ఆదివారం ప్రవూదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న స్థానికులు విద్యార్థులను రక్షించడానికి తీవ్ర ప్రయుత్నాలు చేశారని దిపేన్, బ్రిజ్జులు సాక్షికి వివరించారు.
ఆ వివరాలివీ.. సాయుంత్రం 6 గంటల ప్రాంతంలో రెండు బస్సుల్లో విద్యార్థులు అక్కడకు వచ్చారు. అందులో దాదాపు వుుప్పైవుంది వరకు మోకాలి లోతు వరకు నీరు ఉన్న బియూస్ నదిలోకి దిగారు. విద్యార్థినీ, విద్యార్థులు కొద్దిగా లోపలకు వెళ్లి బండరాళ్లపై కూర్చుని ఫొటోలు దిగసాగారు. వురికొందరు నీళ్లను కాళ్లతో తన్నుతూ కేరింతలు కొడుతున్నారు. మిగతావారు గ్రూపులు గ్రూపులుగా ఒడ్డునే ఉండి ఫొటోలు దిగుతున్నారు. అరుుతే నదిలోకి వెళ్లిన వారిని ఇంకా లోపలకు వెళ్లవద్దని మేం వారించాం. సాధారణంగా ఎవరైనా విహారయాత్రకు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఫొటోలు దిగడం సహజం. 6.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో నీటి ప్రవాహం పెరిగింది.
చూస్తుండగానే నీటి ఉధృతి పెరగడంతో గాబరా పడిన విద్యార్థులు అక్కడే ఉన్న చిన్న బండరాళ్లను ఎక్కేందుకు ప్రయుత్నించారు. డ్యాం నుంచి గేట్లను ఎత్తడం వల్లనే నీటి ఉధృతి పెరిగిందని వూకు అర్థమైంది. దీంతో లోపల ఉన్న విద్యార్థులను అప్రవుత్తం చేస్తూ బాహార్ ఆవో, జల్దీ ఆవో అంటూ కేకలు వేశాం. నీటి ప్రవాహం మరింత పెరగడంతో ఇద్దరు విద్యార్థులు వుుందుగా కొట్టుకుపోయూరు. వెంటనే తేరుకున్న మేం అందుబాటులో ఉన్న తాడును విసిరి దానిని పట్టుకుని రావాలని అరిచాం. అందులో ఒకరుతాడును పట్టుకోగా ఒడ్డుకు లాగేశాం. మరోసారి తాడు వేశాం, మరోవైపు నుంచి చీరెలు కూడా విసిరారు. చీరెలు పట్టుకున్న ఇద్దరిని బయుటకు లాగడానికి ప్రయుత్నిస్తుండగా ప్రవాహ ఉధృతి మరింత పెరగడంతో వారు కొట్టుకుపోయూరు. ఐదారుగురు వూత్రమే ప్రవూదం నుంచి బయుటపడగలిగారు. మిగిలిన వారిలో నలుగురు, ఆరుగురు తొమ్మిది మంది గ్రూపులుగా ఉండి ఒకరినొకరు పట్టుకుని ఆక్రందనలు చేస్తూనే ఉధృతంగా వచ్చిన నీటిలో గల్లంతయ్యూరు అని దిపేన్, బ్రిజ్జులు వివరించారు.