హైదరాబాద్:హిమాచల్ ప్రదేశ్ లో ఆదివారం చోటు చేసుకున్న ఘోర ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు. నిన్న బియాస్ నదిలో పడి 24 మంది విద్యార్థుల గల్లంతవ్వగా, మరో 24 మంది సురక్షితంగా బయటపడ్డారు. వీరిని ఎయిర్ కోస్టా ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు తరలించారు. సోమవారం చేపట్టిన గాలింపు చర్యల్లో నలుగురు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలకు కులుమనాలిలో శవపరీక్షలు నిర్వహించారు. వీరిని ఆకుల విజేత, గంపల ఐశ్వర్య, రాంబాబు, లక్ష్మిలుగా గుర్తించారు.
ఆదివారం సాయంత్రం విజ్ఞాన్ జ్యోతిఇంజనీరింగ్ కళాశాలు విద్యార్థులు 24 మంది నదిలో గల్లంతయిన విషయం తెలిసిందే. ఇతర విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు.