
హిమాచల్‌ప్రదేశ్ ఘటనపై కేటీఆర్ దిగ్భ్రాంతి
హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్ ఘటనపై తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖమంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థుల మృతదేహాలను తరలించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్ కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూము ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇప్పటివరకు మూడు మృతదేహలు లభ్యమైనట్లు తెలిసిందని అన్నారు.
గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు వెల్లడించారు. సంఘటనా స్థలానికి చేరుకునేందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు విమాన టిక్కెట్లను తమ ప్రభుత్వం ఇస్తుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మృతదేహాలను ప్రత్యేక విమానంలో తరలిస్తామని హామీయిచ్చారు.