
ముదిగొండ: నిరంకుశత్వం, నియంత పోకడలు కలిగిన భట్టి విక్రమార్కకు ఓటమి తప్పదని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి కమల్‌రాజ్‌ను గెలిపించాలని కోరారు. మండలంలోని దనియాలగూడెం, మేడేపల్లి, యడవల్లి, యడవల్లి లక్ష్మీపురం గ్రామాల్లో మంగళవారం టీఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. అందరికీ అందుబాటులో ఉండే కమల్‌రాజును ఆదరించాలన్నారు. నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి చెక్కులపై సంతకం చేయకుండా భట్టి విక్రమార్క పేదలను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. మధిరలో భట్టి గెలిచే అవకాశం లేదని నూటికి నూరు శాతం లేదన్నారు. ఆయన మాజీగానే మిగిలిపోతారన్నారు.
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరాయన్నారు. లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా భట్టి విక్రమార్క ఏనాడూ పేదల సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఆయన ఈ ప్రాంత ప్రజలను పట్టించున్న దాఖలాలు లేవన్నారు. యడవల్లిలో కాంగ్రెస్ నుంచి 45 కుటుంబాలు టీఆర్‌ఎస్‌లో చేరాయి. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, విజయాడైరి జిల్లా చైర్మన్ సామినేని హరిప్రసాద్, మండల రైతు కన్వీనర్ పోట్ల వెంకటప్రసాద్‌రావు, ఎర్ర వెంకన్న, మోర్తాల నాగార్జునరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.