సాక్షి, ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో బీజేపీ చేరికల కమిటీ బృందం భేటీపై ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకే వారిని కలిసినట్లు స్పష్టం చేశారు. కాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో బీజేపీ చేరికల కమిటీ బృందం ఖమ్మంలో గురువారం భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే.
పొంగులేటి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన ముఖ్యమైన అనుచరులతో సైతం బీజేపీ చేరికల కమిటీ బృందం చర్చలు జరిపింది. దాదాపు అయిదు గంటలుపైగా చర్చలు కొనసాగాయి. ఈ సమావేశానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
చదవండి: తెలంగాణ బీజేపీలో లుకలుకలు?..పొంగులేటి ఎపిసోడ్‌తో బట్టబయలు
సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నాం
అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్‌ను బొద్దపెట్టే ఏకైక పార్టీ బీజేపీయేనని తెలిపారు. తమ లక్ష్యం, పొంగులేటి, జూపల్లి లక్ష్యం ఒకటేనని అన్నారు. పొంగులేటిని బీజేపీని ఆహ్వానించామని, ఆయన నిర్ణయం సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. పొంగులేటితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, కలిసికట్టుగా పనిచేసి కేసీఆర్‌ను గద్దె దించుతామని అన్నారు.
పార్టీలో సుముచిత స్థానం
పొంగులేటి , జూపల్లికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు మీకు ఎదురైన సమస్యలు, అవమానాలు తమకు తెలుసని, బీజేపీలో అవన్నీ ఉండవని తెలిపారు. మీ దృష్టిలో ఉన్న నియోజకవర్గాల్లో పోటీకి మీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించే విధంగా అమిత్ షా, నడ్డాతో మాట్లాడుతామని ఇద్దరు నేతలకు ఈటల చెప్పినట్లు తెలుస్తోంది. అయితే చేరికల కమిటీ ఎదుట పొంగులేటి, జూపల్లి పలు డిమాండ్‌లు ఉంచినట్లు సమాచారం. చర్చల్లో పార్టీలో చేరికపై పొంగులేటి, జూపల్లి బీజేపీ బృందానికి ఎటువంటి హామీ ఇవ్వలేదు. త్వరలో తమ అనుచరులతో మాట్లాడి నిర్ణయం చెబుతామనిపేర్కొన్నారు.
చదవండి: ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కొత్త ప్రతిపాదన
బీజేపీ నేతలతో భేటీ అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆలోచలను సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారని మండిపడ్డారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకు అందరూ ఏకమయ్యేలా చూడాలన్నారు. మాయ మాటలతో మూడవసారి సీఎం కావాలనే ఆశ కలగానే మిగులుతుందని జోస్యం చెప్పారు. పదవుల పంపకమేమి లేదు.. ఏపార్టీ వాళ్లయిన తమతో సంప్రదింపులు జరిపి, పార్టీలోకైనా ఆహ్వానించవచ్చని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు వచ్చిన కమ్యూనిస్ట్‌లు వచ్చినా స్వాగతిస్తామన్నారు.
బీజేపీలోకి రావాలని గతంలోనే ఢిల్లీ పెద్దలు అడిగారని పొంగులేటి తెలిపారు. కేసీఆర్ ఖమ్మంలో పోటీచేస్తే ఆయననై కూడా పోటీచేస్తానని పేర్కొన్నారు. బీజేపీలోకి రావాలని గతంలోనే ఢిల్లీ పెద్దలు అడిగారని ప్రస్తావించారు. అయితే తాను ఏ పార్టీలో చేరుతాననే దానిపై ఈనెలలో సస్పెన్స్‌కు తెరపడుతుందనుకుంటున్నట్లు చెప్పారు. కేసీఆర్‌ను గద్దె దించడమే మా అందరి లక్ష్యం. తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.
ఏ నిర్ణయం తీసుకోలేదు..
నేటీ బీజేపీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జూపల్లి కృష్ణారావు తెలిపారు. గతంలో చెప్పినట్టుగానే రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు, సంస్థలు, ఉద్యమకారులు, కళాకారులందరినీ సంఘటితం చేసి.. లక్ష్య సాధన కోసం ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తామన్నారు. ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.
చదవండి: నంది అవార్డుల వివాదంపై స్పందించిన మంత్రి తలసాని
Comments
Please login to add a commentAdd a comment