సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్లీనరీని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈనెల 24న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న ప్లీనరీ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేదిక, సభా ప్రాంగణం ఏర్పాట్ల కమిటీ చైర్మన్, మంత్రి పద్మారావుగౌడ్ శుక్రవారం స్టేడియాన్ని సందర్శించి ఏర్పాట్ల పనులను పరిశీలించారు.