టీఆర్‌ఎస్ ప్లీనరీ ఖమ్మం రైతులను ముంచింది
టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి
సాక్షి, ఖమ్మం: ‘టీఆర్‌ఎస్ ప్లీనరీ కోసం మార్కెట్ యార్డు ల్లో ఆ శాఖ మంత్రి హరీశ్ రావు బస్తా మోస్తే రూ.6 లక్షల కూలి ఇచ్చారు. టీఆర్‌ఎస్ నాయకులు, మంత్రులు.. వ్యాపారుల దగ్గర కూలీ చేయ డంతో వారు.. తాము ఏమైనా చేసుకోవచ్చని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ ఖమ్మం జిల్లా రైతుల కొంపముంచింది’అని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నా రు. బుధవారం ఖమ్మం జిల్లా జైలులో ఉన్న మిర్చి రైతుల కుటుంబాలను వారు పరామర్శించారు.
నామా ముత్తయ్య ట్రస్ట్ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. జిల్లా జైలులో ఉన్న రైతులను, నేతలు పరామర్శించి అనంతరం ఖమ్మంలో విలేకరులతో మాట్లాడారు. జైలుపాలైన రైతులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు జరిగిన అన్యాయంపై ఎస్టీ కమిషన్, గవర్నర్‌కు విన్నవిస్తామన్నారు.