తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో జనవరి 18న ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ (GIIS) స్కూల్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ఐటీ/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్/ఇండస్ట్రీస్ & కామర్స్/లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నాగార్జున సాగర్ ఎం ఎల్ ఏ జయవీర్ కుందూరు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు/బాన్సువాడ ఎం ఎల్ ఏ/ మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, డిసిసి ప్రెసిడెంట్ డాక్టర్ రోహిణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారందర్ని అతిధి మర్యాదలతో తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వ్యవస్థాపక అధ్యక్షులు బండ మాధవ రెడ్డి , పూర్వ అధ్యక్షులు నీలం మహేందర్, అధ్యక్షులు గడప రమేష్ బాబు తదితరులు సింగపూర్ తెలుగు ప్రజల సమక్షంలో ఘనంగా ఆహ్వానించారు. సింగపూర్ తెలుగు ప్రజల మరిచిపోలేని మధుర క్షణాలను మదిలోనింపుకొన్నరోజు ఇదే.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. చిన్నారుల నృత్యప్రదర్శనలు, స్వాగత గీతంతో ఆహ్వానించారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షులు గడప రమేష్ స్వాగత ప్రసంగంతో.. తెలంగాణ కల్చరల్ సొసైటీ స్థాపన తెలుగు సంప్రదాయాలను, ఆచారాలను, ఆధ్యాత్మిక తత్వాలను భావితరాలకు అందించే కృషిలో సొసైటీ నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించడం జరిగింది.
తెలంగాణ మీద ఉన్నప్రేమను చూపించడానికి విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రోహిణ్ కుమార్ రెడ్డి, ఇతర సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అదేవిధంగా తెలంగాణ కల్చరల్ సొసైటీకి వెన్నంటి ముందుండి నడిపించి తమ సహాయ సహకారాలను ఎల్లవేళల అందించే వ్యవస్థాపక అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, పూర్వ అధ్యక్షులు నీలం మహేందర్, NRI Cell మంద భీం రెడ్డి కి, GTA గ్లోబల్ ఛైర్మెన్ కల్వల విశ్వేశర్ రెడ్డి, GIIS ఛైర్మెన్ అతుల్ తెముర్ణికర్, సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ అంతే కాకుండా ఈ కార్యక్రమానికి సహకరించిన బసిక శ్రీకాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలను ఉద్దేశించి తెలంగాణలో పలు రంగాలలో చేస్తున్న అభివృద్ధిని, తెలంగాణ ఔన్నత్యాన్ని భావితరాలకు అందించే ప్రణాలికను, ప్రపంచదేశాలు తెలంగాణను తలెత్తి చూసే సమయం ఆసన్నమైంది. అందుకు విదేశాలలో నివసిస్తున్న మన తెలంగాణ తెలుగు ప్రజల సహాయ సహకారాలు ఉండాలని కోరారు. అదేవిధంగా ఐటీ(IT) మినిస్టర్ శ్రీధర్ బాబు, డిజిటల్ రంగంలో చేస్తున్న అభివృద్ధిని వివరించారు .
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, IT మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర మంత్రివర్గ సభ్యులను, తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) కమిటి, సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ GIIS ఛైర్మెన్ అతుల్ తెముర్ణికర్ ఘనంగా సత్కరించారు.
ఈ వేడుకల్లో మాతృశ్రీసాయి ఇన్స్టిట్యూట్, సర్వ ఫైన్ ఆర్ట్స్, దుర్గ శర్మ గ్రూప్, దీపారెడ్డి అండ్ గ్రూప్ మరియు స్వర్ణకళామందిర్ నుండి చిన్నారుల నృత్యప్రదర్శనలు, మధురమైన గీతాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి కాసర్ల శ్రీనివాస రావు, మిర్యాల సునిత రెడ్డి ముఖ్య సమన్వయ కర్తలుగా వ్యవహరించి అందరిని అలరించారు.
కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వ్యవస్థాపక అధ్యక్షులు బండ మాధవ రెడ్డి , పూర్వ అధ్యక్షులు నీలం మహేందర్, సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) సభ్యుల చేతుల మీదుగా 2025 తెలుగు క్యాలెండర్ (సింగపూర్ కాలమాన ప్రకారం)ను విడుదల చేసి, అందరికీ వాటిని పంపిణీ చేశారు.
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, IT మినిస్టర్ శ్రీధర్ బాబు, ఇతర ముఖ్య అతిథులకు ధన్యావాదాలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన సొసైటీ సభ్యులు ఆలెక్స్ తాళ్ళపల్లి, మల్లారెడ్డి కళ్లెం, లక్ష్మణ్ రాజు కల్వ, రాకేష్ రెడ్డి రజిది, సురేందర్ రెడ్డి గింజల, సింగపూర్ తెలుగు ప్రజలకు అభినందనలు తెలియజేసారు.
ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల, కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ, అలాగే 'మీట్ అండ్ గ్రీట్' కు హాజరైన ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసారు.
అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన సొసైటీ మహిళా విభాగ సభ్యులు గడప స్వాతి, బసిక అనిత రెడ్డి, జూలూరు పద్మజ, సునీత రెడ్డి, హేమ లత, దీప నల్ల,కాసర్ల వందన, బొందుగుల ఉమా రాణి, నంగునూరు సౌజన్య, నడికట్ల కళ్యాణి, హరిత విజాపుర్, ఆవుల సుష్మ, పులిగిల్ల హరిత, సౌజన్య మాదారపు, ఎర్రమ రెడ్డి దీప్తి, సృజన వెంగళ, హర్షిణి మామిడాల, సుధా రాణి పెసరు, వాసవి పెరుకు, రావుల మేఘన, చల్ల లత మొదలగు వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment