
తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు తెలంగాణ & కాలిఫోర్నియాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి పాత్ర గొప్పదని మిల్పిటాస్ సిటీ కమిషనర్ రఘు రెడ్డి ప్రశంసించారు. కాలిఫోర్నియా, ఫ్రీమాంట్‌లోని హార్ట్‌ఫుల్‌నెస్ సెంటర్‌లో కమ్యూనిటీ రిసెప్షన్ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ప్రొక్లమేషన్ కూడా అందించారు.

ఈ కార్యక్రమంలో కాన్సులేట్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి , మిల్పిటాస్ సిటీ కమిషనర్ రఘు రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు.. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అన్ని విధాలా సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబులకు కమిషనర్ రఘు రెడ్డి హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాకు చెందిన రఘురెడ్డి శాంటా క్లారా కౌంటీ కమీషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారతదేశానికి చెందిన రఘురెడ్డి అక్కడ మొదటి తెలుగు కమిషనర్ కావడం విశేషం. ఈయన వచ్చే ఏడాది సిటీ మేయర్ పదవిని చేపట్టాలని పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాలిఫోర్నియా, అరిజోనా, నెవాడాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 800 మందికిపైగా ప్రవాసులు పాల్గొన్నారు.

Comments
Please login to add a commentAdd a comment