Milpitas
-
తెలంగాణకు కాలిఫోర్నియా పెట్టుబడులు: సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రశంసలు
తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు తెలంగాణ & కాలిఫోర్నియాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి పాత్ర గొప్పదని మిల్పిటాస్ సిటీ కమిషనర్ రఘు రెడ్డి ప్రశంసించారు. కాలిఫోర్నియా, ఫ్రీమాంట్‌లోని హార్ట్ఫుల్నెస్ సెంటర్లో కమ్యూనిటీ రిసెప్షన్ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ప్రొక్లమేషన్ కూడా అందించారు.ఈ కార్యక్రమంలో కాన్సులేట్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి , మిల్పిటాస్ సిటీ కమిషనర్ రఘు రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు.. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అన్ని విధాలా సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబులకు కమిషనర్ రఘు రెడ్డి హామీ ఇచ్చారు.తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాకు చెందిన రఘురెడ్డి శాంటా క్లారా కౌంటీ కమీషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారతదేశానికి చెందిన రఘురెడ్డి అక్కడ మొదటి తెలుగు కమిషనర్ కావడం విశేషం. ఈయన వచ్చే ఏడాది సిటీ మేయర్ పదవిని చేపట్టాలని పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాలిఫోర్నియా, అరిజోనా, నెవాడాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 800 మందికిపైగా ప్రవాసులు పాల్గొన్నారు. -
సిలికానాంధ్ర రామదాసు సంకీర్తనోత్సవం
కాలిఫోర్నియా : సిలికానాంధ్ర ఆధ్వర్యంలో రామదాసు సంకీర్తనోత్సవం అమెరికాలో కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో ఘనంగా జరిగింది. మల్లాది రవికుమార్, కొలవెన్ను శ్రీలక్ష్మి, అవ్వారి గాయత్రి ఆధ్వర్యంలో అదిగో భద్రాది, శ్రీరామ నామమే, పలుకే బంగారమాయెనా, శ్రీరాముల దివ్యనామ, రామజోగి మందు, తారకమంత్రము, హరి హరి రామ, తక్కువేమి మనకు, కంటినేడు మా రాముల కీర్తనలను బే ఏరియాలోని కర్ణాటక సంగీత ప్రియులు, సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు భక్తి పారవశ్యంతో పాడారు. అనంతరం సిలికాన్ వ్యాలీలోని వివిధ పలు సంగీత కళాశాలల విద్యార్థులు, ఔత్సాహిక సంగీత కళాకారులు వివిధ రామదాసు కీర్తనలను బృంద గానాలలో రాగయుక్తంగా పాడారు. అనురాధ శ్రీధర్ వయోలిన్ పై, శ్రీరాం బ్రహ్మానందం మృదంగంపై సహకారమివ్వగా మూడుగంటపాటూ విద్వాన్ మల్లాది రవికుమార్ శ్రీరామదాసు సంకీర్తనలను పాడారు. మల్లాది రవికుమార్ తమ గురువులు నేదునూరి కృష్ణమూర్తి, శ్రీపాద పినాకపాణి స్వరపరచిన కీర్తనలను పాడారు. రవికుమార్, అనూరాధ, శ్రీరాం కలిసి కచేరీ చేయటం ఇది మొదటిసారి. సభలో జరుగుతున్నప్పుడే అప్పటికప్పుడు ఒకరికొకరు సహకరిస్తూ మనోధర్మ సంగీతాన్ని హృద్యంగా అందించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీతవేత్త బ్రహ్మానందం, డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి, డాక్టర్ జంధ్యాల రవి అతిధులుగా హాజరయ్యారు. డాక్టర్ జంధ్యాల రవికుమార్, మనబడి కులపతి చమర్తి రాజు, సిలికానాంధ్ర వైస్ చైర్మన్ కొండిపర్తి దిలీప్ వాయిద్యకారులను సత్కరించారు. జంధ్యాల రవి కూచిపూడి నాట్యం, అన్నమయ్య కీర్తనలతో తనకు సిలికానాంధ్రతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హనిమిరెడ్డి, మల్లాది రవికుమార్‌ను ఘనంగా సత్కరించారు. కార్డియాలజిస్ట్ పనిచేస్తున్న తను, ఇతర డాక్టర్లు, నర్సులకు రామ శబ్దం ఎలా పరిచయం చేశాడో చెప్పారు. మల్లాది రవికుమార్ మాట్లాడుతూ తన అన్నయ్య శ్రీరాంప్రసాద్, తన తండ్రి సూరిబాబులతో కలిసి అన్నమయ్య, రామదాసు, త్యాగరాజుల సంగీతాన్ని సిలికానాంధ్ర ద్వారా ముందు తరానికి నేర్పించడానికి సహకరిస్తామన్నారు. సిలికానాంధ్ర ముఖ్యకోశాధికారి కొండుభట్ల దీనబాబు మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే రామదాసు కీర్తనలతో లక్షగళార్చన చేయడానికి సిలికానాంధ్ర సిద్ధంగా ఉందన్నారు. కొండిపర్తి దిలీప్ నిర్మించిన పర్ణశాల నమూనా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సిలికానాంధ్ర వాగ్గేయకార బృందసభ్యులు తణుగుల సంజీవ్, సర్వ షీలా, నాదెళ్ళ వంశీ, మల్లాది సదా, గుండ్లపల్లి వాణి, కడియాల కళ్యాణి, వేదుల స్నేహ, వంక రత్నామాల, మాలెంపాటి ప్రభ, కందుల శాయి, మంచికంటి రాంబాబు, గురజాలె దీప్తి, గంధం కిశోర్, కూచిభొట్ల రవి, వేదుల మూర్తి ఈ కార్యక్రమం విజయవంతం చేయడంతో తమవంతు కృషి చేశారు. -
ప్రముఖ ఎన్ఆర్ఐ రఘు రెడ్డికి అమెరికా సత్కారం
కాలిఫోర్నియా : అమెరికా ప్రభుత్వం ప్రముఖ ఎన్ఆర్ఐ, ఫిలాంత్రఫిస్ట్(దాత) అయిన కాకి రఘు రెడ్డిని ఘనంగా సన్మానించింది. రఘు రెడ్డి చేస్తున్న సామాజిక కార్యక్రమాలకుగానూ కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లోని సిటీ హాల్లో ఘనంగా సత్కరించారు. కాలిఫోర్నియా, ఉత్తర అమెరికాలో ఆయన చేస్తున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, సమాజ సేవకు గానూ ఈ గుర్తింపు లభించింది. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో రఘురెడ్డి సమాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, వివిధ సంస్కృతిక, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆటా రీజినల్ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రఘురెడ్డి ఇటీవలే ఆటా ప్లానింగ్ ఛైర్మన్‌గా కూడా ఎన్నికయ్యారు. తెలుగు మాట్లాడే వ్యక్తిగా రఘురెడ్డి తొలిసారి మిల్పిటాస్ నగర కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. నగర అభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తూనే సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనేవారు. ప్రస్తుతం రఘురెడ్డి మిల్పిటాస్ నగర కమిషనర్‌గా, ఆటా ప్లానింగ్ ఛైర్మన్‌గా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ పీటీఏ(రస్సెల్ మిడిల్ స్కూల్)గా, టోస్ట్ మాస్టర్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ పదవుల్లో కొనసాగడమే కాకుండా వివిధ రాజకీయ, సంస్కృతిక సంస్థల్లో కీలక సభ్యులుగా ఉన్నారు. మిల్పిటాస్ కౌన్సిల్ సభ్యులు, రఘురెడ్డి భార్య పద్మజా, కూతుళ్లు నిధి రెడ్డి, నిత్యా రెడ్డిల సమక్షంలో మిల్పిటాస్ మేయర్ ఆయనకు ప్రశంసా పత్రాన్ని అందించారు. రఘురెడ్డి స్వస్థలం సూర్యాపేట్ జిల్లాలోని తిరుమలగిరి మండలం.