పార్టీ నాయకత్వంలో కొత్త ఉత్సాహం
- తీర్మానాల రూపంలో ప్రభుత్వ ప్రగతి నివేదిక
- వేదికపై మాట్లాడేందుకు అమాత్యులకు నో చాన్స్
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకే తీర్మానాల బాధ్యత
- ఇక వరంగల్ బహిరంగ సభపై నేతల దృష్టి
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎంతో కీలకంగా భావించిన పదహారో ప్లీనరీ విజయవంతం కావడం తో పార్టీ నాయకత్వంలో ఆనందం వ్యక్తమవుతోంది. ప్లీనరీని విజయవంతం చేసేందుకు గడచిన 15 రోజులుగా పార్టీ యంత్రాంగం శ్రమించింది. సభ్యత్వ నమోదు, గ్రామ, మండల శాఖల కమిటీల ఎన్నిక, ఆ తర్వాత అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ఇలా.. వరుసగా పార్టీ యంత్రాంగం బిజీబిజీగా గడిపింది. ఈ నెల 27న వరంగల్‌లో జరగనున్న బహిరంగ సభతో పార్టీ 16 ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ముగిసినట్టే. ప్లీనరీలో గడిచిన మూడే ళ్లలో ప్రభుతం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథ కాలు, కార్యక్రమాల ప్రగతి నివేదికను తీర్మానాల రూపంలో సమర్పించారు.
ప్రభుత్వ పథకాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని పార్టీ నాయత్వం భావిస్తున్న నేపథ్యంలో.. వాటికి తీర్మానాల రూపం ఇచ్చి చర్చకు పెట్టారు. అలాగే ప్లీనరీకి హాజరైన ప్రతినిధులకు ప్రభుత్వ పనితీరు, పథకాలపై అవగా హన కల్పించే ప్రయత్నం చేశారు. మూడేళ్ల పాలన ప్రగతి నివేదికను ప్రకటించిన టీఆర్‌ఎస్.. భవిష్యత్ కార్యక్రమాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. రానున్న రెండేళ్లలో ఏం చేయనున్నారన్న అంశాన్ని రేఖా మాత్రంగానే ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు చేయనున్న ఆర్థిక సాయం అంశాన్ని ప్రత్యేక అంశంగా చేపట్టింది. ఈ ఒక్క అంశానికే ప్రాధాన్యం ఇచ్చి చర్చకు పెట్టింది.
ప్రతిపక్షాలపై విమర్శలు..
తమ ప్రభుత్వ పనితీరు, విజయాలను వివరిస్తూనే పార్టీ నేతలు విపక్షాలపైనా విరుచుకుపడ్డారు. సాగునీ టి ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారంటూ ప్రతిపక్షా లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య పాలనపైనా సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు. కాగా ప్లీనరీలో మం త్రులంతా మౌనంగానే ఉన్నారు. ఒక్క మంత్రికి కూడా మాట్లాడే అవకాశం రాలేదు. తీర్మానాలను ప్రతిపాదించడం, బలపర చడం వంటి బాధ్యతలను పూర్తిగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకే ఇవ్వడం తో మంత్రులు వేదికపై కూర్చోవడానికే పరిమిత మయ్యారు. పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న అయి దుగురు మహిళల్లో.. ఇద్దరికి ప్లీనరీలో మాట్లాడే అవకాశం దక్కింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపు ష్టం–వృత్తులు అంశంపై ఎమ్మెల్యే కొండా సురేఖ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ ప్రసంగించారు. సామాజిక రుగ్మతలపై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లా డారు. ఆమె చేసిన ప్రతిపాదనలపై కేబినెట్‌లో చర్చిం చి నిర్ణయం తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు.
15 లక్షల మందితో సభ!
ప్లీనరీ విజయవంతం కావడంతో ఇక వరంగల్ బహిరంగ సభపై దృష్టి పెడతామని టీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 27న నిర్వహించే ఈ సభకు పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది. ఉద్యమ పార్టీగా ఇదే వరంగల్‌లో 10 లక్షల మందితో సభ జరిపామని, అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి కావొస్తున్న తరుణంలో బహిరంగ సభను 15 లక్షల మందితో జరిపేందుకు శ్రమిస్తున్నామని పార్టీ నాయకుడు ఒకరు చెప్పారు.
ప్లీనరీ సక్సెస్
Published Sat, Apr 22 2017 1:54 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM
Advertisement
Advertisement