అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల 24న నిర్వహించనున్న పార్టీ తొలి ప్లీనరీ సమావేశానికి హాజరు కానున్నారు.
రాయికల్: అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల 24న నిర్వహించనున్న పార్టీ తొలి ప్లీనరీ సమావేశానికి హాజరు కానున్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి అమెరికాలోని న్యూ జెర్సీ యూనివర్సిటీలో సెమినార్, ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్ సెల్ ఆవిర్భావం వంటి పలు కార్యక్రమాల్లో కవిత బిజీ బిజీగా గడిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి న తర్వాత జరుగుతున్న పార్టీ తొలి ప్లీనరీకి ఆమె హాజరుకానున్నారు.