
కవిత
హైదరాబాద్: నాంపల్లి కోర్టు ఆదేశాల ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కుమార్తె, నిజామాబాద్ లోక్సభ సభ్యురాలు కవితపై మాదన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కాశ్మీర్, తెలంగాణలను బలవంతంగా భారత్లో విలీనం చేశారని, కాశ్మీర్‌లోని కొన్ని భాగాలు భారత భూభాగంలోనివి కావని కవిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దేశ సమగ్రతకు భంగం వాటిల్లే విధంగా కవిత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ కరుణాసాగర్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ను పరిశీలించిన 7వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు కవితపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఐపీసీ 124 (ఏ), 153 (ఏ), 505, సీఆర్‌పీసీ156 (3) సెక్షన్ల కింద కవితపై పోలీసులు కేసు నమోదు చేశారు.