
'సబ్ కే సాత్, సబ్ కా వికాస్'
అధిక జనాభా కారణంగా దేశాభివృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.
న్యూఢిల్లీ: అధిక జనాభా కారణంగా దేశాభివృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. లోకసభలో 2014-15 ఆర్థిక బడ్జెట్ ను గురువారం ఆయన ప్రవేశపెట్టారు. అందరికీ సాయం, అందరికీ అభివృద్ధి(సబ్ కే సాత్, సబ్ కా వికాస్) అనేదే తమ లక్ష్యమని జైట్లీ పేర్కొన్నాడు.
రెండు, మూడేళ్లలో 7-8 శాతం వృద్ధిరేటు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ద్రవ్యలోటును అధిగమించడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని అన్నారు. నల్లధనం కలుగుతున్న నష్టాన్ని గుర్తించామని చెప్పారు. నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవకాశాలు కోల్పోతున్నామని వెల్లడించారు.