
కూర్చుని బడ్జెట్ చదివిన ఆర్థికమంత్రి!!
ఎన్డీయే ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ.. కూర్చుని తన బడ్జెట్ ప్రసంగం చదివి వినిపించారు.
కేంద్ర బడ్జెట్ గానీ, రైల్వే బడ్జెట్ గానీ, రాష్ట్రాల బడ్జెట్లు గానీ.. ఏవైనా సరే అవి కొనసాగినంత సేపు సదరు మంత్రులు నిలబడే తమ బడ్జెట్ ప్రసంగం మొత్తాన్ని చదువుతుంటారు. అయితే.. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనట్లుగా, ఈమధ్య కాలంలో తొలిసారిగా ఎన్డీయే ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ.. కూర్చుని తన బడ్జెట్ ప్రసంగం చదివి వినిపించారు. తొలుత ఆయన నిలబడే ప్రసంగించారు.
అయితే, బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన 45 నిమిషాల తర్వాత.. ఐదు నిమిషాల పాటు విరామం తీసుకున్న ఆర్థిక మంత్రి, ఆ తర్వాత నుంచి తన స్థానంలో కూర్చుని తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు. మధ్యమధ్యలో మంచినీళ్లు తాగుతూ.. ఆయన కూర్చుని తన బడ్జెట్ వివరాలను చదివి వినిపించారు. నడుం నొప్పి తీవ్రంగా బాధిస్తుండటం వల్లే ఆయనిలా చేసినట్లు తెలుస్తోంది.