పవర్ కంపెనీలకు పదేళ్ల టాక్స్ హాలీడే
న్యూఢిల్లీ: ఆర్థిక బడ్జెట్ లో విద్యుత్ రంగానికి సముచిత ప్రాధాన్యం కల్పించారు. విద్యుత్ ఉత్పాదన సంస్థలకు అమల్లోవున్న పదేళ్ల టాక్స్ హాలీడేను మరో ఏడాది పొడిగించారు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80-1ఏ కింద విద్యుత్ ఉత్పాదన సంస్థలకు పన్ను మినహాయింపు ఉంది. దీన్ని మార్చి 31, 2015 వరకు పొడిగించారు. మార్చి 31, 2017లోపు ప్రారంభమయ్యే కంపెనీలకు పదేళ్ల టాక్స్ హాలీడే వర్తిస్తుంది.
కాగా, ఢిల్లీలో విద్యుత్ సంస్కరణలకు రూ. 200 కోట్లు కేటాయించారు. రాజస్థాన్, తమిళనాడు, జమ్మూ-కాశ్మీర్ లోని సొలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రూ. 500 కోట్లు ప్రకటించారు. అల్ట్రా మోడరన్ సూపర్ క్రిటికల్ పవర్ ప్రాజెక్టులు నెలకొల్పనున్నట్టు అరుణ్ జైట్లీ తెలిపారు. దేశంలో అన్ని గృహాలకు నిరంతర విద్యుత్ సరఫరాకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.