
సబ్సిడీ సిలిండర్లపై మళ్లీ పరిమితి!
న్యూఢిల్లీ: మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు సబ్సిడీల భారాన్ని క్రమంగా దించుకునే దిశగా బడ్జెట్‌లో పలు ప్రతిపాదనలు చేసింది. ముఖ్యంగా డీజిల్, వంటగ్యాస్ సబ్సిడీల వల్ల ఏటా పడుతున్న రూ.1.40 లక్షల కోట్ల భారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా డీజిల్ ధరపై నియంత్రణ పూర్తిగా ఎత్తివేయడంతోపాటు వంటగ్యాస్ సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను కుదించాలని నిర్ణయం తీసుకుంది. ‘‘డీజిల్ మార్కెట్ ధరకు, అమ్మకపు ధరకు మధ్యనున్న వ్యత్యాసాన్ని 2014-15 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా పూర్తిగా తొలగించాలని యోచిస్తున్నాం.
ఆ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణ ఉండదు. మార్కెట్ రేట్ల ప్రకారమే వాటి అమ్మకపు ధర ఉంటుంది’’ అని బడ్జెట్‌లో పేర్కొన్నారు. మొత్తమ్మీద 2013-14లో ఇంధన సబ్సిడీ రూ.1.40 లక్షల కోట్లు ఉండగా, ఇందులో ఒక్క డీజిల్‌పైనే రూ.62,800 కోట్లు వెచ్చిస్తున్నారు. ‘‘చమురు రంగంలో అంతర్జాతీయంగా ఎలాంటి షాకులూ లేకపోతే ఏడాదిలోగా డీజిల్ ధరలపై నియంత్ర ణ తొలగిపోతుంది. సబ్సిడీ పెరిగిపోతున్న నేపథ్యంలో సిలిండర్ల సంఖ్యపై వా స్తవ అంచనాతో పరిమితి విధించాల్సిన అవసరముంది’’ అని పేర్కొన్నారు.