కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. నేడు పార్లమెంట్లో అరుణ్ జైట్లీ సాధారణ ...
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. నేడు పార్లమెంట్లో అరుణ్ జైట్లీ సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. దాంతో బడ్జెట్ వివరాలను ప్రణబ్కు వివరించినట్లు సమాచారం. ఇక ప్రణబ్తో భేటీ అనంతరం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర భేటీతో సమావేశం కానున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు జైట్లీ ..బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీఏ ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.