ధరలు తగ్గేవి... ధరలు పెరిగేవి...
న్యూఢిల్లీ: దేశీయ ఎలక్రానిక్ ఉత్పత్తులు ధరలు తగ్గనున్నాయి. అయితే దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్ వస్తువులపై మోత మోగించారు. 2014-15 ఆర్థిక బడ్జెట్ లో పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేత, తగ్గింపుతో పలు వస్తువుల ధరలు తగ్గనున్నాయి. మరికొన్ని వాటిపై పన్నులు పెంచడంతో వాటి ధరలు ప్రియం కానున్నాయి.
పాదరక్షలపై ఎక్సైజ్ సుంకం 12 నుంచి 6 శాతానికి తగ్గించారు. 19 అంగుళాల టీవీలు తయారు చేసే దేశీయ కంపెనీలకు పన్ను రాయితీ ఇచ్చారు. పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం 12 నుంచి 16 శాతానికి పెంచారు. సున్నపురాయి, డోలమైట్ పై రాయితీ ప్రకటించారు. కలర్ టీవీ పిక్చర్ ట్యూబ్పై పన్ను తగ్గించారు.
ధరలు తగ్గేవి...
* 19 అంగుళాల ఎల్ సీడీ, ఎల్ఈడీ టీవీలు, కంప్యూటర్ మానిటర్లు, మొబైల్ ఫోన్లు
* సబ్బులు, సౌందర్య సాధనాలు, పాదరక్షలు, బ్రాండెడ్ దుస్తులు
* పిక్చర్ ట్యూబ్స్, రెడీ టూ ఈట్ ఫుడ్స్
* నూనెలు, పెట్రో కెమికల్స్, సిమెంట్, ఐరన్
* సోలార్ ప్యానెల్స్, క్రీడా వస్తువులు
ధరలు పెరిగేవి...
* పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు, పాన్ మసాలా
* దిగుమతి చేసుకున్న స్టెయిన్ లెస్ స్టీల్ వస్తువులు
* దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్ వస్తువులు
* శీతలపానీయాలు