2014-15 ఆర్థిక సంవత్సరానికి దేశ వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతున్న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గురువారం పార్లమెంట్‌కు చేరుకున్నాయి.
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ సర్కారు ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌కు సమయం ఆసన్నమైంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి దేశ వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతున్న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గురువారం పార్లమెంట్‌కు చేరుకున్నాయి. బడ్జెట్ పత్రాలు కూడా పార్లమెంట్‌కు చేరుకున్నాయి. దేశాభివృద్ధికి బాటలు పరిచేలా బడ్జెట్‌లో సంస్కరణల పర్వానికి పెద్ద పీట వేయనున్నట్లు సమాచారం.
రైల్వే, రక్షణశాఖ సహా వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహిస్తారని తెలుస్తోంది. ఆర్థికవృద్ధికి చేయూతనివ్వడంతో పాటు మౌలిక వసతుల కల్పనపై కూడా జైట్లీ దృష్టి సారించినట్లు సమాచారం. అంతకు ముందు ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. బడ్జెట్ వివరాలు ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది.