బడ్జెట్ మీద ట్విట్టర్లో ప్రశంసలు.. విమర్శలు | twitter reactions on union budget | Sakshi
Sakshi News home page

బడ్జెట్ మీద ట్విట్టర్లో ప్రశంసలు.. విమర్శలు

Published Thu, Jul 10 2014 2:29 PM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

twitter reactions on union budget

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్కు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభించింది. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల ధరలను పెంచడాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన నెటిజన్లు.. సర్దార్ పటేల్ విగ్రహానికి 200 కోట్లు కేటాయించడం లాంటి అంశాల మీద మాత్రం మిశ్రమంగా స్పందించారు. అంధుల కోసం బ్రెయిలీ నోట్లను ముద్రించాలన్ని నిర్ణయాన్ని స్వాగతించారు. ఇంకా ఎలాంటి స్పందనలు వచ్చాయో ఒకసారి చూద్దామా..

నగరాల్లో మహిళల రక్షణకు కేవలం వంద కోట్లేనా? దీనికి ఇంకా ఏదైనా పెద్దస్థాయిలో చేస్తారేమో అనుకున్నాం
-స్టెల్లా పాల్

గుజరాత్లో విజయవంతం అయిన అన్ని ప్రధాన పథకాలకు కేంద్ర బడ్జెట్లో స్థానం లభించింది
-రవి ఘియర్

దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. రక్షణ రంగానికి 2.29 లక్షల కోట్ల రూపాయల కేటాయింపు
-దేవేంద్ర ఫడ్నవిస్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కిసాన్ టెలివిజన్ను ప్రారంభించడం గణనీయమైన మార్పును తెస్తుంది
-నీల్ సంఘవి

ఉత్పాదక, మౌలిక సదుపాయాలు, గృహనిర్మాణం, నీటిపారుదల రంగాలకు మంచి ఊతం ఇచ్చారు. ఇది భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉంటుంది
-ప్రకాష్ జవదేవకర్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement