ఫ్లాగ్‌షిప్‌కు మోడీ టచ్ | Modi to the flagship Touch | Sakshi
Sakshi News home page

ఫ్లాగ్‌షిప్‌కు మోడీ టచ్

Published Fri, Jul 11 2014 2:37 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

ఫ్లాగ్‌షిప్‌కు మోడీ టచ్ - Sakshi

ఫ్లాగ్‌షిప్‌కు మోడీ టచ్

పాత పథకాలు యథాతథం...

‘ఉపాధి’కి పెంపు లేదు...

2014-15 బడ్జెట్‌లో    :     రూ. 33,364 కోట్లు
2013-14 బడ్జెట్‌లో    :     రూ. 33,000 కోట్లు
2012-13 బడ్జెట్‌లో    :     రూ. 33,000 కోట్లు

 
 
యూపీఏ ప్రభుత్వం తొలివిడత అధికారంలోకి వచ్చాక 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) అమల్లోకి వచ్చింది. గ్రామాల్లోని ప్రజలకు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల పాటు కచ్చితంగా ఉపాధి భద్రత కల్పించడం ఈ పథకం ఉద్దేశం. 2006 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకాన్ని 2008 నాటికి దేశంలోని అన్ని జిల్లాలకూ విస్తరించారు. నిధుల కుమ్మరింపు భారీగానే ఉన్నా.. వనరుల కల్పనలో మాత్రం ఘోరంగా విఫలమవుతోందనే వాదనలు ఆరంభం నుంచీ వినిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో నిధుల దారిమళ్లింపు, నాసిరకం పనులు,
 
అవినీతి ఆరోపణలు ఇక సరేసరి. మోడీ సర్కారు దీన్ని వృద్ధికి లింకుపెట్టి కొత్తపుంతలు తొక్కిస్తామంటోంది. ‘ఉపాధి’ పనుల్లో నాణ్యత పెంపు, శాశ్వతప్రాతిపదికన నిర్మాణాలు, ఆస్తుల కల్పనతో పాటు వ్యవసాయం, తత్సంబంధ పనులకూ ఉపాధి హామీని జతచేస్తామని ప్రకటించింది. భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలొస్తాయో వేచిచూడాల్సిందే...
 
పనితీరు ఇదీ....


పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 14 కోట్ల మేర జాబ్ కార్డులు జారీ అయ్యాయి.ఇప్పటివరకూ రూ.2,55,862 కోట్ల మొత్తాన్ని వెచ్చించారు. 1,720 కోట్ల పనిరోజుల్ని (పర్సన్ డేస్) సృష్టించినట్లు అంచనా.గతేడాది మొత్తం 4.85 కోట్ల కుటుంబాలకు పనికల్పించారు. ఇక ఉపాధి హామీలో పాల్గొన్న వ్యక్తుల సంఖ్య 7.46 కోట్లు మాత్రమే. గతేడాది 102 లక్షల పనులను (కొత్తవి, అంతక్రితం ఏడాది వదిలేసినవి కలిపి) చేపట్టారు. ఇందులో 32 శాతం మాత్రమే పూర్తయ్యాయి.
   
2013-14లో సగటు రోజువారీ వేతనం రూ.132.6గా (అంతక్రితం ఏడాది రూ.121.4) నమోదైంది. బడ్జెట్ కేటాయింపునకన్నా అధికంగా రూ.38,621 కోట్లు ఖర్చయినట్లు అంచనా.సగటున 45.2 రోజులు ఒక్కో కుటుంబానికి పని కల్పించారు. 100 రోజుల పని పూర్తిచేసుకున్న కుటుంబాల సంఖ్య కేవలం 46.5 లక్షలు మాత్రమే.
 
భారత్ నిర్మాణ్ గ్రామాల్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకమిది. ఇందులో ప్రధానంగా రోడ్లు, గృహకల్పన, తాగునీరు, సాగునీరు, టెలికం-ఐటీ సేవల కల్పన, విద్యుదీకరణ... ఇలా ఆరు స్కీమ్‌లున్నాయి. 2005-09 మధ్య భారత్ నిర్మాణ్ తొలి దశ అమలు చేశారు. దీనికి మొత్తం బడ్జెట్ రూ.1.74 లక్షల కోట్లు. ప్రస్తుతం రెండో దశ అమలవుతోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకాలకు  నిధులు భారీగానే కేటాయిస్తున్నా... లక్ష్యాలను అందుకోవడంలో చతికిలపడుతున్నాయి. ఈ స్కీమ్‌ల పరిస్థితి చూస్తే...
 
ఇందిరా ఆవాస్ యోజన(ఐఏవై)..  http://img.sakshi.net/images/cms/2014-07/61405027185_Unknown.jpg

2014-15 16,000
2013-14 15,184
 
2022కల్లా దేశవ్యాప్తంగా అందరికీ సొంతింటి కల సాకారం చేస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం.. ఈ పథకానికి నిధులైతే పెద్దగా పెంచలేదు.2002 జనాభా లెక్కల ప్రకారం దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలు, ఎస్‌సీ/ఎస్‌టీలు, వికలాంగులు, బీపీఎల్ మైనారిటీలు ఈ పథకంలో లబ్ధిదారులు. వీరికిచ్చే నిధుల్లో 75 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రాలు భరిస్తాయి.2013-14లో 25,21,242 ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 20,28,322 ఇళ్లను మంజూరు చేశారు. ఇందులో 1,44,483 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి.నిర్మాణ సామగ్రి ధరలు పెరగటంతో ఇళ్ల నిర్మాణం కుంటుపడుతోంది. కొన్ని చోట్ల నాసిరకంగా ఇళ్లను నిర్మించడం, నిధులను పక్కదారిపట్టించడం, అవినీతి బాగోతాలు భారీగానే వెలుగుచూస్తున్నాయి.

గతేడాది బడ్జెట్‌లో మైదాన ప్రాంతాల్లో ఒకో ఇంటికి సాయాన్ని రూ.70,000కు, కొండ ప్రాంతాల్లో రూ.75,000కుపెంచుతున్నట్లు  ప్రకటించారు. ఇంకా 82 మావోయిస్టుల ప్రభావిత జిల్లాల్లో ఒకో ఇంటికి సాయాన్ని రూ.48,500గా నిర్ణయించారు. 2013 ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. మోడీ సర్కారు దీన్ని యథాతథంగా కొనసాగించింది.    
 
ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన  http://img.sakshi.net/images/cms/2014-07/61405027268_Unknown.jpg
 
2014-15  14,389
2013-14  21,700
 
మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తామని చెప్పిన ఎన్‌డీఏ ప్రభుత్వం.. తొలి బడ్జెట్‌లోనే నిధులను తగ్గించేసింది. ఈసారి 33 శాతం కోత పెట్టింది.
రోడ్డు సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో 2000లో నాటి ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రారంభించగా, 2005లో దీన్ని యూపీఏ భారత్ నిర్మాణ్‌లోకి చేర్చింది.
     
500 మందికి పైగా జనాభా ఉన్న మైదాన ప్రాంతాలకు, 250 మందికి పైగా జనాభా గల కొండ, ఎడారి ప్రాంత గ్రామాలకు రహదారి సౌకర్యాన్ని కల్పించాలనేది ప్రస్తుత లక్ష్యం.పథకం ప్రారంభం నుంచి 1,44,717 ఆవాస ప్రాంతాలను అనుసంధానించే లక్ష్యంతో సుమారు 5,44,462 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టులను క్లియర్ చేశారు.

 ఇటీవలే ఈ పథకం రెండో దశను ప్రారంభించారు. ప్రస్తుత గ్రామీణ రోడ్డు నెట్‌వర్క్‌లో ఎంపిక చేసిన కొన్ని రోడ్లను మరింత అత్యున్నతంగా తీర్చిదిద్దడం లక్ష్యం. గ్రామీణ వృద్ధి కేంద్రాలు, హబ్‌లు, పర్యాటక ప్రాంతాలు, మార్కెట్లు, ఇతరత్రా ముఖ్యమైన ప్రాంతాలను కలిపే రోడ్లను ఇందుకు ఎంపికచేస్తారు. గ్రామీణ మౌలిక సదుపాయాల పెంపు, పేదరికాన్ని తగ్గించడం దీని ఉద్దేశం. మొత్తంగా 50,000 కిలోమీటర్ల మేర రోడ్లను మెరుగుపరచడానికి రూ.33,030 కోట్లు వెచ్చిస్తారు. కేంద్రం 75 శాతం నిధులు ఇస్తుంది. మిగతాది రాష్ట్రాలు భరించాలి.
 
రాజీవ్ గాంధీ తాగునీటి మిషన్...  http://img.sakshi.net/images/cms/2014-07/61405027343_Unknown.jpg

2014-15   11,000
2013-14   11,000
 
భార జలాలు/హానికర మూలకాలు, ఫ్లోరైడ్, క్రిమిసంహారకాలు/ఎరువుల ప్రభావం ఉన్న సుమారు 20 వేల ఆవాస ప్రాంతాలకు కమ్యూనిటీ నీటిశుద్ధి ప్లాంట్ల ద్వారా వచ్చే మూడేళ్లలో సురక్షిత తాగునీరు కల్పించాలని తాజా బడ్జెట్‌లో ప్రకటించారు. నిధులను మాత్రం పెంచలేదు.

దేశంలో తాగునీటి సౌకర్యం లేని మారుమూల గ్రామాలన్నిటికీ సురక్షితమైన, తగినంత తాగునీటిని అందించాలనేది ఈ పథకం లక్ష్యం. కేంద్ర- రాష్ట్రాల భాగస్వామ్యంతో ఇది అమలవుతుంది. గతేడాది మార్చి నాటికి దేశంలోని మొత్తం 16.92 లక్షల గ్రామీణ ఆవాస ప్రాంతాలకుగాను.. 11.61 లక్షల ప్రాంతాలకు మాత్రమే సురక్షితమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నారు. వార్షిక లక్ష్యాలకు ఆమడదూరంలో పథకం నత్తనడకన అమలవుతోంది.
 
రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన     http://img.sakshi.net/images/cms/2014-07/51405027428_Unknown.jpg
 
2014-15   5,144
2013- 14  4,500
 
మోడీ సర్కారు ముద్ర కోసం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్‌జ్యోతి యోజన పేరుతో కొత్త పథకాన్ని తాజా బడ్జెట్‌లో జోడించింది. దీనికి రూ.500 కోట్లు కేటాయించారు. ఆర్‌జీజీవైకి కూడా నిధులను చెప్పుకోదగ్గ స్థాయిలోనే పెంచారు.విద్యుత్ సౌకర్యం లేని లక్ష గ్రామాలకు కరెంటు... దారిద్య్రరేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న 2.34 కోట్ల కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో 2005లో ఈ పథకం ప్రారంభమైంది. నోడల్ ఎజెన్సీగా ఆర్‌ఈసీ వ్యవహరిస్తోంది.ఈ పథకం ప్రారంభమైననాటినుంచి ఇప్పటివరకూ 2.16 కోట్ల ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు అంచనా. ఇక 1,08,280 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
 
గ్రామీణ టెలిఫొనీ...  http://img.sakshi.net/images/cms/2014-07/71405027489_Unknown.jpg
 
2014-15  3,553
2013-14  3,000
     
2017 నాటికి ఎన్‌ఓఎఫ్‌ఎన్ కింద బ్రాడ్‌బ్యాండ్ లక్ష్యాన్ని పూర్తిచేయాలని మోడీ సర్కారు నిర్దేశించుకుంది. ప్రస్తుత స్థాయి నుంచి 2017కల్లా గ్రామీణ టెలి డెన్సిటీని 70 శాతానికి, 2020నాటికి 100 శాతానికి చేర్చాలనేది తాజా లక్ష్యం.2014కల్లా గ్రామాల్లో ప్రతి 100 మందిలో 40 మంది టెలిఫోన్ వినియోగదారులుగా చేయాలనేది లక్ష్యం. దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్(జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్-ఎన్‌ఓఎఫ్‌ఎన్) ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు పంచాయతీ స్థాయిలో భారత్ నిర్మాణ్ కామన్ సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.టెలికం శాఖకు చెందిన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ నిధి(యూఎస్‌ఓఎఫ్) నుంచి ఈ స్కీమ్‌కు ఫండ్స్‌ను అందిస్తున్నారు.
 
గ్రామీణ సాగునీటి పథకం    http://img.sakshi.net/images/cms/2014-07/61405027562_Unknown.jpg
 
2014-15 41,510
2013-14 41,207

2014-15లో కేటాయింపు: భారీ, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులకు రూ.1,100 కోట్లు. చిన్న నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.410 కోట్లు.2013-14లో కేటాయింపు: భారీ, మధ్యస్థాయి సాగునీటి ప్రాజెక్టులకు రూ.895 కోట్లు, చిన్న ప్రాజెక్టులకు రూ.312 కోట్లు.

ఇంటి కలను నెరవేరుస్తాం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2022 నాటికి అందరికీ సొంతింటి కలను సాకారం చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఇంటి రుణాలపై ప్రత్యేకంగా యువతను దృష్టిలో పెట్టుకుని పన్ను రాయితీలు కల్పిస్తున్నట్లు ఆర్థికమంత్రి జైట్లీ చెప్పారు. జాతీయ హౌసింగ్ బ్యాంక్(ఎన్‌హెచ్‌బీ) పథకం కింద చౌక ధరలో ఇళ్ల నిర్మాణం కోసం బడ్జెట్‌లో రూ.4,000 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో బలహీన వర్గాలు/తక్కువ ఆదాయం కలిగిన వర్గాల కోసం వీటిని నిర్మిస్తారు. గ్రామీణ హౌసింగ్ ఫండ్ కింద చాలా మందికి ప్రయోజనం చేకూరినట్లు జైట్లీ తెలిపారు. మురికివాడల అభివృద్ధిని కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత కింద చేర్చారు. దీనివల్ల కార్పొరేట్లపై మరింత బాధ్యత పెరిగింది.
 
16 కొత్త పోర్టు ప్రాజెక్టులు


జల రవాణా ద్వారా దేశీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి, ఉద్యోగ కల్పనకు కేంద్రం ప్రాధాన్యమిచ్చింది. ఇందులోభాగంగా ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు ప్రకటిస్తూ.. దేశవ్యాప్తంగా 16 కొత్త పోర్టు ప్రాజెక్టులను ప్రతిపాదించింది. దేశంలోని ప్రధాన పోర్టుల అనుసంధానం, రూ. 11,635 కోట్లతో ట్యుటికోరిన్‌లో ఔటర్ హార్బర్ ప్రాజెక్టుతో పాటు కాండ్లా, జేఎన్‌పీటీ పోర్టుల వద్ద ఎస్‌ఈజెడ్‌ల ఏర్పాటు వం టివి ఇందులో ఉన్నాయి. నౌకా నిర్మాణ  పరిశ్రమను ప్రోత్సహించేం దుకు కొత్త విధానాన్ని ప్రకటిస్తామని కూడా జైట్లీ ఈ సందర్భంగా తెలిపా రు. విచ్ఛిన్నం కోసం దిగుమతి చేసుకునే నౌకలపై వాణిజ్య పన్నును ఐదు నుంచి 2.5 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం దేశంలోని 12 ప్రధా న పోర్టుల ద్వారా 700 మిలియన్ టన్నుల కార్గో రవాణాకు వీలుండగా.. 2020 కల్లా దీన్ని 3,130 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు స్పష్టం చేశారు.
 
ఐదు పర్యాటక సర్క్యూట్ల సృష్టికి రూ. 500 కోట్లు

న్యూఢిల్లీ: దేశంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేం దుకు ప్రత్యేక ఇతివృత్తాలతో ఐదు పర్యాటక సర్క్యూట్లను సృష్టించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఈ ఐదు సర్క్యూట్ల సృష్టికి రూ.500 కోట్ల నిధులను ఆయన కేటాయించారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా సార్‌నాథ్-గయ-వారణాసి బుద్ధిస్ట్ సర్క్యూట్‌ను తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. దేశంలో పర్యాటకాభివృద్ధి కోసం మంత్రి చేసిన ఇతర ప్రతిపాదనలు... మధుర, అమృత్‌సర్, గయ, కంచీపురం, అజ్మీర్ వంటి  పట్టణాలలో వారసత్వ కట్టడాల పరిరక్షణకు ‘జాతీయ వారసత్వ పట్టణ అభివృద్ధి, పునరుద్ధరణ పథకం(హృదయ్)’ను అమలు చేస్తారు. ఇందుకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. దేశంలో ‘తీర్థయాత్రల పునరుత్తేజం, ఆధ్యాత్మిక అభివృద్ధికి జాతీయ కార్యక్రమం(ప్రసాద్)’ నిర్వహించేందుకు రూ.100 కోట్లు కేటాయించారు. పురావస్తు కట్టడాల పరిరక్షణకు మరో రూ.100 కోట్లు ఇచ్చారు. గోవా అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారిందని, అక్కడ ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించాలని, అందుకు కేంద్రం మద్దతు పూర్తిగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా విదేశీయులు దేశంలోకి వచ్చిన తర్వాత కూడా వీసా పొందేలా ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్(ఈ-వీసా) సౌకర్యాన్ని ఆరునెలల్లో దశలవారీగా 9 విమానాశ్రయాల్లో అమలు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీనిపై పరిశ్రమవర్గాలు స్పందిస్తూ.. ఈ-వీసాల కేటాయింపు నిర్ణయం దేశ పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని హర్షం వ్యక్తం చేశాయి.     
 
గ్రామీణాభివృద్ధిపై దృష్టి

యువతకు చేయూతనిచ్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రూ. 100 కోట్లు కేటాయించింది. గ్రామాల్లోని ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం దీని లక్ష్యం.
ఇళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించేందు కోసం నేషనల్ హౌసింగ్ బ్యాంక్(ఎన్‌హెచ్‌బీ)కి రూ. 8 వేల కోట్లు కేటాయింపు
ప్రాంతాల్లో వాటర్‌షెడ్‌ల అభివృద్ధి కోసం నీరాంచల్ కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టిం ది. ఇందుకు రూ. 2,142 కోట్లు వెచ్చించనుంది.

మరో 100 జిల్లాల్లో స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలకు 4 శాతం వడ్డీతో బ్యాంకు రుణాలను అందించనున్నట్లు జైట్లీ వెల్లడించారు. ప్రస్తుతం 150 జిల్లాల్లోనే ఇది అమలులో ఉంది.
 
క్రీడలకు జోష్..

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో యువజన సర్వీసులు, క్రీడల రంగానికి కేటాయింపులు రూ. 562 కోట్ల మేరకు పెరిగాయి. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కలిపి మొత్తం రూ.1,769 కోట్లను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కేటాయించారు. ఇందులో ప్రణాళికా వ్యయం రూ. 1,643 కోట్లు కాగా.. ప్రణాళికేతర వ్యయం 126 కోట్లు. 2014-15 బడ్జెట్‌లో జమ్మూకాశ్మీర్‌కు పెద్ద పీట వేశారు. ఈ రాష్ట్రంలో క్రీడా వసతులు, ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియాల అభివృద్ధికి రూ. 200 కోట్లను కేటాయించారు. మణిపూర్‌లో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 100 కోట్లు కేటాయించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్)కి రూ. 85 కోట్ల పెంపుతో 405.10 కోట్లు, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లకు 25 కోట్ల పెంపుతో 185 కోట్లు కేటాయించారు. కాగా, రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్‌కు కేటాయింపుల్లో భారీ కోత విధించారు. దీనికి గతంలో రూ. 104.85 కోట్లను కేటాయించగా.. ఇప్పుడు 20 కోట్లతో సరిపెట్టారు. ఆసియా క్రీడలు, కామన్‌వెల్త్ గేమ్స్‌లో పాలుపంచుకునే క్రీడాకారుల సన్నద్ధత కోసం రూ. 100 కోట్లను కేటాయించారు. ఈశాన్య రాష్ట్రాలు, సిక్కింలో క్రీడల అభివృద్ధికి రూ. 192.65 కోట్లను కేటాయించారు. డోపింగ్ నిరోధక కార్యక్రమాలకు రూ. 11.60 కోట్లు.. నేషనల్ డోప్ టెస్ట్ ల్యాబొరేటరీకి రూ. 9 కోట్లు కేటాయించారు.
 
జైట్లీ.. పేరాలకు పేరాల స్పీచ్

మన ఆర్థిక మంత్రులు బడ్జెట్ ప్రవేశపెడుతూ మధ్యలో తిరువళ్లూరు నుంచి గాలిబ్ వరకు చాలా మంది సూక్తులను అలవోకగా చెప్పేస్తూ.. గంటలకు గంటలు మాట్లాడ్డం వింటూనే ఉంటాం. కానీ కొంతమంది మాత్రమే ‘సుత్తి కొట్టొద్దు.. సూటిగా చెప్పు’ అన్నట్టు సింపుల్‌గా ప్రసంగిస్తారు. అలాంటిదే మొన్న మొట్ట మొదటి బడ్జెట్ ప్రసంగం. ఈ ప్రసంగం కేవలం 39 పేరాలే. దీనికి భిన్నంగా ప్రస్తుత ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ 253 పేరాల స్పీచ్ ఇచ్చారు. ఇంతవరకు ఎక్కువ పేరాల ప్రసంగాలిచ్చిన ఆర్థిక మంత్రులందరినీ ఆయన మించిపోయారు.
     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement