
డీడీలో 'కిసాన్ ఛానెల్' : జైట్లీ
దూరదర్శన్లో కిసాన్ ఛానెల్ ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. లోకసభలో 2014-15 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మేరకు ప్రకటన చేశారు. అందుకోసం రూ.100 కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు చెప్పారు. అలాగే కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అందుకు బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించామని అరుణ్ జైట్లీ తెలపారు.