సాధారణ బడ్జెట్ ఆశాజనకంగా ఉందని టీడీపీ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని కాంగ్రెస్ ఎంపీలు వ్యాఖ్యానించారు.
సాధారణ బడ్జెట్ ఆశాజనకంగా ఉందని టీడీపీ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని కాంగ్రెస్ ఎంపీలు వ్యాఖ్యానించారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక కేటాయింపులు జరిగాయని టీడీపీ పార్లమంటరీ నేత సుజనాచౌదరి అన్నారు. బడ్జెట్‌ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని, మొన్న ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ అసంతృప్తి కలిగించినా, ఈ బడ్జెట్ బాగుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రవేశపెట్టినది ఎనిమిది నెలల బడ్జెటైనా ఇప్పుడున్న నిధులు సరిపోతాయని, ఇది రైతు పక్షపాత బడ్జెట్ అని టీడీపీ ఎంపీ తోట నర్సింహం అన్నారు.
అయితే.. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి నిధుల కేటాయింపు అంశం మాత్రం ఈ బడ్జెట్లో ఎక్కడా లేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు సుబ్బరామిరెడ్డి, రాపోలు ఆనంద భాస్కర్ విమర్శించారు. ఆర్భాటంగా ప్రకటనలు చేశారు గానీ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మాత్రం బడ్జెట్ లేదని వారు వ్యాఖ్యానించారు.