
స్టాట్యూ ఆఫ్ యూనిటీకి రూ. 200 కోట్లు
గుజరాత్ లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ప్రతిష్టాపనకు కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది.
న్యూఢిల్లీ: గుజరాత్ లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ప్రతిష్టాపనకు కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. లోకసభలో 2014-15 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మేరకు ప్రకటన చేశారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దేశ ప్రజలను ఐక్యతగా ఉంచడానికి స్టాట్యూ ఆఫ్ యూనిటీని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక చిహ్నంగా నిర్మిస్తామని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి రెండింతలు పెద్దదిగా సర్ధార్ పటేల్ ఐక్యత స్మారక చిహ్నం నిర్మించనున్నారు.