తాండూరు: ఈ సారి కూడా తాండూరు వాసులకు నిరాశే మిగిలింది. మంగళవారం రైల్వే మంత్రి సదానందగౌడ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో తాండూరుకు కొత్త హాల్టింగ్ గానీ, పొడగింపునకు గానీ అవకాశం దక్కలేదు. గత ప్రభుత్వం హయాంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై మోడీ సర్కారు దృష్టి సారిస్తుందని ఆశపడిన ప్రయాణికులకు భంగపాటు తప్పలేదు. తాండూరు మీదుగా నడిచే రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని స్థానిక వ్యాపారులు, ప్రజలు ఏళ్లుగా కోరుతున్నారు. ప్రతి బడ్జెట్ సమయంలోనూ ఎదురుచూశారు. కర్ణాటకలోని చిత్తాపూర్ చిన్న రైల్వేస్టేషన్. ఇక్కడ గరీభ్థ్ ్రఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ ఉంది.
ఈ రైల్వేస్టేషన్ నుంచి రోజుకు రైల్వేకు రూ.50వేల వరకు టిక్కెట్ విక్రయంపై ఆదాయం వస్తుంది. రోజుకు సుమారు 1500 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ సేడంలో ఆగుతుంది. ఇక్కడ రోజుకు 2500 ప్రయాణికులు రాకపోకలు సాగి స్తారు. సుమారు రూ.లక్ష ఆదాయం వస్తుంది. కానీ ఈ రెండు రైల్వేస్టేషన్ల కన్నా తాండూరు పెద్దది. రోజుకు సుమారు ఐదు వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. సుమారు రోజుకు రూ.రెండు లక్షల ఆదాయం వస్తుంది. మోడీ సర్కారు ఈ బడ్జెట్‌లో గరీభ్థ్,్ర రాజధాని ఎక్స్‌ప్రెస్‌లకు తాండూరులో హాల్టింగ్ ఇస్తుందని ప్రయాణికుల ఆశించారు. కానీ నిరాశే మిగిలింది.
ఇక ఉదయం పది గంటలకు తాండూరు నుంచి హైదరాబాద్‌కు ‘హుస్సేన్‌సాగర్’ రైలు ఉంది. ఆ తర్వాత హైదరాబాద్‌కు వెళ్లడానికి సాయంత్రం నాలుగు గంటల వరకు రైలు లేదు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల మధ్య హైదరాబాద్ వెళ్లడానికి వికారాబాద్ వరకు నడుస్తున్న పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను పొడిగించాలని ఇక్కడి ప్రయాణికులు చాలాకాలంగా కోరుతున్నారు.
ఈ రైలు పొడిగింపునకు, పద్మావతి ఎక్స్‌ప్రెస్ హాల్టింగ్‌కు రైల్వే బడ్జెట్‌లో అవకాశం దక్కపోవడం ఈ ప్రాంత ప్రయాణికులను నిరాశపరిచింది. వేల కోట్లు ఖర్చుపెట్టి బుల్లెట్ రైలును నడపడం వల్ల కొందరికే ప్రయోజనం కలుగుతుంది తప్పా.. మధ్య తరగతికి ఏం ప్రయోజనమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీదర్ -ముంబయ్ ఎక్స్‌ప్రెస్ రైలు నడపనున్నట్టు రైల్వే మంత్రి ప్రకటించినా.. అది రూట్‌లో నడుస్తుందన్న దానిపై స్పష్టత లేదు.
ఈ సారీ ఆగలేదు!
Published Wed, Jul 9 2014 12:03 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement